మహీంద్రా కార్ల షోరూమ్‌లకు పోటెత్తిన జనం.. వచ్చిన వారు ఈ కారునే ఎక్కువగా అడిగారు
భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా & మహీంద్రా (M&M) మరోసారి తన శక్తివంతమైన స్థిరత్వాన్ని చూపించింది. పండుగ సీజన్ ప్రారంభమైన దశలోనే కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తూ మార్కెట్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకుంది. ముఖ్యంగా, అక్టోబర్ 2025 మహీంద్రా కోసం చరిత్రలో నిలిచిపోయే నెలగా మారింది. మారుతి సుజుకి తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ తయారీదారుగా నిలిచిన మహీంద్రా, SUV సెగ్మెంట్‌లో తన అస్తిత్వాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. అక్టోబర్ నెలలో మహీంద్రా 71,624 యూనిట్ల దేశీయ అమ్మకాలు నమోదు చేయడం కంపెనీకి ఇప్పటివరకు వచ్చిన అత్యధిక నెలవారీ సంఖ్య. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నెలవారీ అమ్మకాలు ఈ స్థాయికి చేరడం అరుదు.
ఇది కంపెనీ పై ప్రజల్లో ఉన్న నమ్మకం ఎంత బలమైనదో స్పష్టంగా చూపిస్తుంది. గత ఏడాది అక్టోబర్ 2024లో విక్రయించిన సంఖ్యతో పోలిస్తే 31% పెరుగుదలను నమోదు చేయడం విశేషం. అంతేకాక, కేవలం గత నెల సెప్టెంబర్ 2025తో పోలిస్తే కూడా అమ్మకాలు 27% పెరగడం ప్రత్యేకంగా గమనించదగ్గ అంశం. ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా పండుగ డిమాండ్ భారీగా పెరగడం, ఇటీవల చేసిన GST తగ్గింపు చెప్పబడుతున్నాయి.

ధరలు తగ్గడంతో కొనుగోలు పెరిగింది. మరోవైపు, మహీంద్రా మార్కెట్ వాటా కూడా ఈ అమ్మకాల దూకుడుకు అనుగుణంగానే పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో మహీంద్రా మార్కెట్ షేర్ 13.7%గా ఉండగా, ఈ సంవత్సరం అక్టోబర్‌లో అది 15.3%కు చేరడం కంపెనీకి మరో మెట్టు ఎదుగుదల. కార్ల మార్కెట్‌లో రెండు శాతం పాయింట్ల పెరుగుదల సాధించడం చిన్న విషయం కాదు; ఇది బ్రాండ్ ఎదుగుదల దిశలో ఉన్న బలమైన సంకేతం.
ఈ విజయానికి ప్రధాన కారకులు మహీంద్రా పోర్ట్‌ఫోలియోలోని ప్రముఖ SUVలు. స్కార్పియో, బొలెరో, XUV300, థార్, అలాగే క్రితం నెలలో సేల్స్ రికార్డులు బద్దలుకొట్టిన XUV 3XO వంటి మోడల్స్ మొత్తం అమ్మకాల ఉత్సాహాన్ని మరింత పెంచాయి. వీటి కఠినమైన బిల్డ్ క్వాలిటీ, శక్తివంతమైన ఇంజిన్‌లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు, భారతీయ రోడ్లకు తగిన రగ్గడ్ డిజైన్ అన్ని కలిసి మహీంద్రా అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయి.

గత నెలలో అత్యధికంగా అమ్ముడైన మహీంద్రా మోడల్ స్కార్పియో/స్కార్పియో N. మొత్తం 17,880 యూనిట్లు విక్రయించబడటంతో ఈ SUV మరోసారి మాస్ లీడర్‌గా నిరూపించుకుంది. భారతీయ కస్టమర్ల అభిరుచిలో స్కార్పియో ఇప్పటికీ ఎలాంటి స్థానం సంపాదించిందో ఈ సంఖ్యే చెబుతోంది. స్కార్పియో తరువాతి స్థానంలో నిలిచింది మహీంద్రా నమ్మకమైన, రగ్గడ్, విలేజ్-ఫ్రెండ్లీ SUV బొలెరో. అక్టోబర్ 2025లో బొలెరో మొత్తం 14,343 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది.
ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 9,849 యూనిట్లతో పోలిస్తే 46% పెరుగుదల చూపడం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. ఇంకా గ్రామీణ మార్కెట్లో బొలెరోకు ఉన్న అచంచలమైన డిమాండ్ ఈ సంఖ్యల ద్వారా మళ్లీ స్పష్టమవుతోంది. మహీంద్రా కు గేమ్ చేంజర్‌గా మారిన XUV 3XO. ఈ కాంపాక్ట్ SUV అక్టోబర్‌లోనే 12,237 యూనిట్ల అమ్మకాలను సాధించి అమ్మకాల జాబితాలో మూడవ స్థానాన్ని అందుకుంది.

ఇవే కాకుండా, మహీంద్రా ఇతర మోడళ్లూ మంచి ప్రదర్శననే కొనసాగించాయి. గత అక్టోబర్‌లో కంపెనీ 12,029 థార్ యూనిట్లను విక్రయించింది. అలాగే ఫీచర్-రిచ్, ప్రీమియం ఫ్యామిలీ SUV అయిన XUV700 కూడా తన వేగాన్ని తగ్గించకుండా 10,139 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మహీంద్రా అడుగులు బలంగా వేస్తోంది. గత నెలలో కంపెనీ 2,708 XEV 9E, 2,134 PE6, 152 XUV400 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications








