100 మందిలో 90 మంది ఫ్యాన్స్.. నిన్ను ఓడించే వారు ఇంకా పుట్టలేదు మామ..! ఇప్పటి వరకు ఎంతమంది కొన్నారో తెలుసా?

భారతీయ వాహన పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మహీంద్రా(Mahindra) తన కార్ల అమ్మకాలతో దూసుకుపోతుంది. వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో సరికొత్త డిజైన్లతో వాహనాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే, SUV విభాగంలో తన పట్టును నిలుపుకోవడానికి గతంలో తీసుకొచ్చిన థార్(Thar) మోడల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారుగా నిలిచింది. థార్‌కు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అత్యంత అనువైన మోడల్. దీని ఆకట్టుకునే డిజైన్, పెర్ఫామెన్స్‌తో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల అమ్మకాలను సాధించింది. దేశంలో చాలా మంది ఈ మోడల్‌కు ఫ్యాన్స్‌గా ఉన్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇది అన్ని నగరాలు, పట్టణాల్లో కనిపిస్తుంది. ఇది మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుంచి మహీంద్రా కంపెనీ అమ్మకాల్లో ఇదే హైలెట్‌గా నిలుస్తుంది.

మహీంద్రా థార్(Mahindra Thar) ఇండియా మార్కెట్లో 2020 ఏడాదిలో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కారును 2 లక్షల మంది కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే SUV లలో ఇది ముందు స్థానంలో ఉంటుంది. ఈ కారు 3 డోర్ వెర్షన్‌తో విడుదల అయింది. లాంచ్ అయిన వెంటనే రికార్డు స్థాయిలో బుకింగ్స్ అందుకుంది.

Mahindra 3 Door Thar 2 Lakh Sales

ఆ తర్వాత దీని పెర్ఫామెన్స్ గురించి అందరికీ తెలియడంతో మరింత ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఈ మోడల్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి మారుతీ జిమ్నీ కారును తీసుకొచ్చినప్పటికి కూడా చాలా మందికి మాత్రం థార్ మోడల్ ఫేవరెట్‌గా నిలిచింది. ఈ కారు ఆఫ‌రోడ్ ప్రయాణాలకు కింగ్‌గా పరిగణిస్తారు. లోపల అధునాతన ఫీచర్స్ ఉంటాయి. ముఖ్యంగా క్యాబిన్‌‌లో లగేజీ పెట్టడానికి మెరుగైన స్థలం కూడా ఉంది.

మహీంద్రా థార్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ దీనికి కొనసాగింపుగా 5 డోర్ థార్‌ను కూడా విడుదల చేసింది. ఈ మోడల్ కూడా విజయవంతం అయింది. 3 డోర్ థార్‌తో పోలిస్తే 5 డోర్ థార్ రాక్స్‌ను కొంచెం పొడుగ్గా ఉంటుంది. దీనిలో ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించవచ్చు. మొదటి థార్‌ ఆకట్టుకునే పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన కస్టమర్లు 5 డోర్ వెర్షన్‌కు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

3 Door Thar Crosses 2 Lakh Sales Since Launch

2020లో విడుదలైన థార్‌ ఇప్పటికి కూడా ఏమాత్రం డిమాండ్ తగ్గిపోకుండా అమ్మకాలతో దూసుకుపోవడం అంటే ఈ మోడల్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలిసిపోతుంది. 3 డోర్ థార్‌ డీజిల్, పెట్రోల్ ఆప్షన్‌లో లభిస్తుంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. డీజిల్ ఆప్షన్ 118 PS పవర్, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే పెట్రోల్ ఇంజిన్ 150 PS పవర్, 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా థార్ అత్యంత నమ్మకమైనది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్లు, అడ్జెస్ట్ చేయగల డ్రైవర్ సీటు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి పలు ఫీచర్లను కలిగి ఉంది.

Mahindra 3 Door Thar Crosses 2 Lakh Sales

ఇంకా, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మాన్యువల్ AC, లోపల అత్యాధునిక ఇంటీరియర్, బలమైన బాడీతో వచ్చింది. ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా సరికొత్తగా అనిపిస్తుంది. 3 డోర్ థార్‌తో పాటే 5 డోర్ రాక్స్ మోడల్‌ కూడా అమ్మకాల పరంగా దూసుకుపోతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 7, 2025, 17:00 [IST]
English summary
Mahindra off road king 3 door thar crosses 2 lakh sales milestone since launch
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+