ఇదెక్కడి థార్ భయ్యా.. దేశంలోని జనాలు దీనికోసం షోరూమ్ ముందు బారులు తీరారు
మహీంద్రా థార్ (Mahindra Thar), భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఆఫ్-రోడ్ SUVలలో ఒక ప్రతిష్టాత్మక పేరు. తన అదిరిపోయే లుక్, ఆకర్షణీయమైన డిజైన్, ఆఫ్-రోడింగ్‌లో అద్భుతమైన సామర్థ్యం కారణంగా ఇది ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకుంటూ వస్తోంది. వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన థార్, రోడ్డుపై, రోడ్డుకు బయట రెండింట్లోనూ సమానంగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇది థార్ రాక్స్, క్లాసిక్ 3-డోర్ వెర్షన్ రూపాల్లో అందుబాటులో ఉండటం ద్వారా, కస్టమర్లకు మరిన్ని ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తోంది. ఇటీవల జూలై 2025లో థార్ మళ్లీ తన సేల్స్ శక్తిని చాటుకుంది. గత నెలలో ఈ కారును 9,845 మంది కొనుగోలు చేయడం విశేషం.
అయితే ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 4,385 యూనిట్ల వద్ద ఉండగా, ఈసారి సంవత్సర ప్రాతిపదికన 125 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ గణంకాల ప్రకారం, దేశంలోని జనాలు ఈ కారు కోసం షోరూమ్ ముందు బారులు తీరారని అర్థం అవుతుంది. ఈ పెరుగుదల వెనుక కొత్త డిజైన్ అప్‌డేట్స్, ఫీచర్లలో మార్పులు, ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడే యువతలో పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది.

ఈ సంవత్సరం తొలి ఆరు నెలలు మహీంద్రా థార్ SUVకు అసలైన స్వర్ణయుగం అని చెప్పొచ్చు. భారతీయ SUV మార్కెట్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న ఈ మోడల్, 2025 జనవరి నుంచి జూన్ వరకు గణనీయమైన అమ్మకాల వృద్ధిని సాధించింది. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 58,663 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ సంఖ్యను నెలవారీ సగటుగా లెక్కిస్తే, ప్రతి నెల దాదాపు 9,777 యూనిట్లు అమ్ముడవుతున్నాయి.
ఈ గణంకాలను చూసినట్లయితే, థార్ పై ప్రజల ఆసక్తి, డిమాండ్ ఎంతటి స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్, ఆఫ్-రోడ్ SUV మార్కెట్లో ప్రీమియం లుక్, శక్తివంతమైన పనితీరుతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దీని ధర రూ.12.99 లక్షల నుండి రూ.23.39 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండటం వలన, విభిన్న బడ్జెట్, అవసరాలకు సరిపడే వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇది రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది, మొదటిది 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2-లీటర్ డీజిల్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. వీటికి అనుగుణంగా 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండటం, డ్రైవర్ అభిరుచికి తగిన అనుభవాన్ని ఇస్తుంది. మైలేజీ పరంగా చూస్తే, థార్ రాక్స్ 12.4 kmpl నుండి 15.2 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది, ఇది దీని తరహా SUVలలో బాగానే పరిగణించవచ్చు.
మహీంద్రా థార్ 3-డోర్ SUV, తన కాంపాక్ట్ డిజైన్‌లోనే మస్క్యులర్ లుక్, అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిపి అందించే మోడల్‌గా నిలుస్తోంది. దీని ధర రూ. 11.50 లక్షల నుండి రూ. 17.62 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉండటం వలన, ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌ను ఇష్టపడే వారికి, అలాగే ప్రత్యేకమైన SUV స్టైల్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. థార్ 3-డోర్ వెర్షన్‌లో బలమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్, అలాగే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌లో వినియోగదారులు తమకు కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. ఇవి విభిన్న డ్రైవింగ్ అవసరాలకు సరిపోతాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడటం వలన, డ్రైవర్ తన అభిరుచికి తగ్గ అనుభవాన్ని పొందగలడు. ఇది లీటరుకు గరిష్టంగా 15.20 కి.మీ. వరకు మైలేజీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








