ఈ కారు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది! కొత్త మోడల్ లాంచ్ డేట్ కన్ఫర్మ్!

మహీంద్రా (Mahindra) ఆఫ్-రోడ్ SUV విభాగంలో తన థార్ (Thar) మోడల్‌తో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చాలా ఏళ్లుగా 3-డోర్ల వెర్షన్‌ను మాత్రమే అందిస్తూ, ఈ కారు అడ్వెంచర్ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఇదే విభాగంలో మారుతి సుజుకి, జిమ్నీని 5-డోర్ల మోడల్‌గా విడుదల చేసి పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇప్పుడు, భారత మార్కెట్‌లో మంచి అమ్మకాలు సాధిస్తున్న తన 3-డోర్ల థార్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా మహీంద్రా ముందడుగు వేసింది. కొత్తగా అప్‌డేట్ చేసిన ఈ మోడల్‌ను సెప్టెంబర్ 1న అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్‌డేట్‌తో థార్ అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

సాహస యాత్రలు, కఠినమైన మార్గాలు, అడవి ప్రదేశాలు ఏ రోడ్డు అయినా సులభంగా ప్రయాణించే సామర్థ్యం వల్ల థార్‌కు భారతీయ మార్కెట్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చాలా సంవత్సరాలుగా కంపెనీ 3-డోర్ల వెర్షన్‌ను మాత్రమే విక్రయిస్తోంది. రెండవ తరం థార్ ఐదేళ్ల క్రితం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుండి దీని డిజైన్, ఫీచర్లు, టెక్నికల్ అప్‌డేట్స్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

Thar 3 Door New Model Will Launch On September 1st In India

ఆటోమొబైల్ రంగంలో పోటీ పెరగడంతో పాటు, వినియోగదారుల అభిరుచులు కూడా కొత్త టెక్నాలజీ, మెరుగైన ఫీచర్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహీంద్రా తన 3-డోర్ల థార్‌కు మిడ్-లైఫ్ అప్‌డేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ వెర్షన్ భారతీయ రోడ్లపై విస్తృతంగా పరీక్షించబడుతోంది. కొత్త డిజైన్ టచ్‌లు, మెరుగైన సౌకర్యాలు, అవసరమైన టెక్నికల్ అప్‌గ్రేడ్స్‌తో ఇది మరింత ఆకర్షణీయంగా మారనుందని అంచనా.

అంతేకాదు, మహీంద్రా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా జరుపుకోబోతోంది. ఆగస్టు 15న ఒకేసారి నాలుగు కొత్త కాన్సెప్ట్ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు మహీంద్రా అభిమానులకు పండుగలాంటివి కానున్నాయి. ఒకవైపు భవిష్యత్తు కాన్సెప్ట్ మోడల్స్‌ రూపంలో కొత్త కార్లను పరిచయం చేస్తూనే, మరోవైపు ప్రస్తుత బెస్ట్‌సెల్లర్ థార్‌కు కొత్త రూపాన్ని అందించబోతోంది.

Thar 3 Door New Model Will Launch On September 1st In India

స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఈవెంట్ అనంతరం మహీంద్రా లాంచ్ చేయబోయే తొలి కారు కొత్త థార్ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్న ఈ మిడ్-లైఫ్ అప్‌డేట్ వెర్షన్, డిజైన్ పరంగా గణనీయమైన మార్పులను పొందింది. ప్రత్యేకంగా, థార్ రాక్స్ మోడల్‌లో కనిపించే కొన్ని ఆకర్షణీయమైన డిజైన్ అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

ముందు భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేయడం వల్ల కారు మరింత లేటెస్ట్‌గా, స్టైలిష్‌గా మారింది. బలమైన, స్పోర్టీ లుక్ ఇచ్చే కొత్త బంపర్, మార్పులు చేసిన ఫాగ్ లైట్ హౌసింగ్, అలాగే ఫ్రంట్ ఫెసాడ్‌ను హైలైట్ చేసే సి-ఆకారపు LED డేలైట్ రన్నింగ్ లైట్స్.. ఇవన్నీ కొత్త థార్‌కు ఫ్రెష్ విజువల్ ఐడెంటిటీని అందిస్తున్నాయి. అదనంగా, కొత్త డిజైన్‌లోని అల్లాయ్ వీల్స్ కారు సైడ్ ప్రొఫైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

Thar 3 Door New Model Will Launch On September 1st In India

ఇంటీరియర్‌లో కూడా అప్‌డేట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు క్యాబిన్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది. మెరుగైన UI, కనెక్టివిటీ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లతో ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఎంజాయబుల్‌గా మార్చనుంది. గేర్ లివర్ ప్రాంతాన్ని కూడా కొత్తగా డిజైన్ చేయడం వల్ల ఎర్గోనామిక్స్ మెరుగుపడ్డాయి. అలాగే, స్టీరింగ్ వీల్ పూర్తిగా కొత్త రూపంలో రావడం వల్ల డ్రైవర్‌కు ప్రీమియం ఫీలింగ్ లభిస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, మహీంద్రా ప్రస్తుత మోడల్‌లో లభ్యమయ్యే డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను అలాగే కొనసాగించనుంది. అంటే, పవర్‌ట్రెయిన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, కొత్త లుక్, మెరుగైన ఫీచర్లు, రిఫైన్‌మెంట్ కారణంగా ఈ థార్ మోడల్ మార్కెట్‌లో మరింత క్రేజ్ సృష్టించే అవకాశం ఉంది. మొత్తం మీద, కొత్త థార్ లాంచ్ కోసం ఆఫ్-రోడ్ SUV అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 9, 2025, 9:50 [IST]
English summary
Mahindra off road thar 3 door new model will launch on september 1st in india
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+