కొత్త కారు కొనాలనుకునేవారికి ఇది బంపర్ ఛాన్స్.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి

భారతదేశపు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) తన సేల్స్ పెంచుకోవడానికి ఆగష్టు నెలలో ప్రసిద్ధ మోడల్ అయినటువంటి XUV 3XO కారుపై భారీ ఎత్తున తగ్గింపు ఆఫర్స్‌ను ప్రకటించింది. తక్కువ ధరలో కారును సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన XUV 3XO SUVపై అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లతో కంపెనీ సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఆఫర్ల వల్ల కొనుగోలుదారులు గణనీయమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వేరియంట్‌ను బట్టి ఈ ప్రయోజనాలు రూ. 44,000 నుంచి గరిష్టంగా రూ. 89,000 వరకు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక ప్యాకేజ్‌లో భాగంగా, కంపెనీ నగదు తగ్గింపులు అందిస్తోంది. అంటే, కస్టమర్లు కారు ధరపై నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తున్నాయి. పాత కారును ఇచ్చి కొత్త XUV 3XO కొనుగోలు చేసే వారికి అదనపు లాభం దక్కుతుంది. అలాగే, కార్పొరేట్ ప్రయోజనాలు కూడా కల్పించబడ్డాయి, ఇవి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డ ఆఫర్లు. అంతేకాకుండా, కొంతమంది వేరియంట్‌లతో ఉచిత ఉపకరణాలు కూడా అందించబడుతున్నాయి.

Mahindra Offers Up To Rs 89000 Discount On Xuv 3xo Suv In August 2025

దీని వలన వినియోగదారులు కారు కోసం అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, మరింత విలువైన ప్యాకేజ్‌ను పొందుతారు. మొత్తంగా చెప్పాలంటే, ఈ ఆగస్టులో మహీంద్రా XUV 3XO కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు కేవలం SUVనే కాకుండా, పలు రకాల ఆర్థిక ప్రయోజనాలు, అదనపు సౌకర్యాలను కూడా పొందగలరు. ఈ ఆఫర్లు SUV మార్కెట్‌లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశముంది.

ఆగస్టులో XUV 3XO SUV టాప్-ఆఫ్-ది-లైన్ AX7 L డీజిల్ వేరియంట్ కొనుగోలు చేసే వారికి అత్యధిక లాభం లభిస్తోంది. ఈ మోడల్‌పై మొత్తం రూ. 89,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ. 50,000 నగదు తగ్గింపు, రూ.20,000 విలువైన ఉపకరణాలు, అలాగే రూ. 35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, అదనంగా కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి.

Mahindra Offers Up To Rs 89000 Discount On Xuv 3xo Suv In August 2025

అదే AX7 L మోడల్‌లో పెట్రోల్ వేరియంట్ తీసుకునే వారికి కూడా లాభం తక్కువేమీ కాదు. వీరికి మొత్తం రూ. 84,000 వరకు ఆఫర్లు లభిస్తాయి. ఇందులో రూ. 45,000 నగదు తగ్గింపు, రూ. 10,000 విలువైన ఉపకరణాలు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఇక సాధారణ AX7 పెట్రోల్ మోడల్‌పై మొత్తం రూ. 64,000 వరకు ప్రయోజనం అందుబాటులో ఉంది.

ఈ మొత్తంలో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 విలువైన ఉపకరణాలు, అలాగే రూ.35,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX7 లేదా AX5 డీజిల్ ట్రిమ్‌లు ఎంచుకునే వారికి మహీంద్రా రూ. 69,000 వరకు ఆఫర్ ఇస్తోంది. ఈ ప్యాకేజీలో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 20,000 విలువైన ఉపకరణాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు ఉంటాయి.

Mahindra Offers Up To Rs 89000 Discount On Xuv 3xo Suv In August 2025

AX5 L పెట్రోల్ వేరియంట్ మాత్రం అత్యల్ప ఆఫర్లను కలిగి ఉంది. దీనిపై మొత్తం రూ. 44,000 ఉంది.దీనిలో రూ. 5,000 నగదు తగ్గింపు, రూ.20,000 విలువైన ఉపకరణాలు, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భారత మార్కెట్‌లో మహీంద్రా XUV 3XO SUV పలు ధరల్లోఉన్నాయి. ఈ కాంపాక్ట్ SUV ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7.99 లక్షల వద్ద ప్రారంభమై, టాప్ వేరియంట్‌కి రూ.15.80 లక్షల వరకు ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 16, 2025, 11:24 [IST]
English summary
Mahindra offers up to rs 89000 discount on xuv 3xo suv in august 2025 details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+