ఒక్కసారి థార్‌లో కూర్చొని వెళ్తే... కింగ్ కాదు కానీ కింగ్‌లా ఫీల్ అవ్వకుండా ఉండలేరు.. అందుకే సేల్స్‌లో రాజు
దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా నుంచి గతంలో విడుదలైన శక్తివంతమైన ఆఫ్‌రోడ్ కింగ్ థార్ (Thar) అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మార్కెట్లో తన హవాను చూపించిన ఈ మోడల్ ప్రతినెలా వేలకు పైగా విక్రయాలను నమోదు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత నెలలో కూడా ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది కస్టమర్లు ఆసక్తి కనబరిచారు. తాజాగా ఏప్రిల్ 2025లో, మహీంద్రా థార్ తన ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెలలో బ్రాండ్ తొలిసారిగా 10,000 కార్ల నెలవారీ అమ్మకాల మార్కును దాటి, SUV ప్రీమియం విభాగంలో తన స్థానం మరింత బలపరిచింది.
మూడు-డోర్ల థార్, కొత్తగా ప్రవేశపెట్టిన ఐదు-డోర్ల థార్ రాక్స్ వేరియంట్లతో కలిపి, మహీంద్రా ఈ నెలలో మొత్తం 10,703 కార్లను విక్రయించింది. ఇది సంస్థకు గణనీయమైన విజయం. ఈ అమ్మకాల పెరుగుదల వెనుక ప్రధాన కారణంగా డీజిల్ వేరియంట్లకు ఉన్న అధిక ఆదరణ నిలిచింది. మొత్తం అమ్మకాలలో 10,040 కార్లు డీజిల్ వేరియంట్లే కావడం, ఈ వాదనకు బలమిస్తుంది. పెట్రోల్ వేరియంట్లు కేవలం 663 యూనిట్లకే పరిమితం కావడం గమనార్హం.

ఇది వినియోగదారుల ప్రాధాన్యతలను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఏప్రిల్ 2025తో ముగిసే వరుస నెలల్లో, వినియోగదారులు డీజిల్ వేరియంట్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ల కంటే డీజిల్ వేరియంట్లకు ఉండే ఆదరణ గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.ఈ ధోరణికి మద్దతుగా మార్చి 2025లో నమోదైన అమ్మకాల వివరాలు నిలుస్తాయి. ఆ నెలలో మొత్తం 7,375 కార్లు డీజిల్ వేరియంట్లు అమ్ముడుపోయాయి.
అదే పెట్రోల్ వేరియంట్లు కేవలం 1,561 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఇది డీజిల్ మోడళ్లపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మహీంద్రా మూడు డోర్ల థార్ వేరియంట్ ధర రూ. 11,49,999 నుండి ప్రారంభమై, రూ. 17,40,000 వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అదే, ఐదు డోర్ల థార్ రాక్స్ ప్రారంభ బేస్ వేరియంట్ ధర రూ.2,99,000 నుంచి ప్రారంభమై రూ. 23,08,999 (ఎక్స్-షోరూమ్) వరకు చేరుతుంది.

థార్, థార్ రాక్స్ పలు ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 1.5-లీటర్ D117 CRDe డీజిల్ ఇంజిన్, 118PS పవర్, 300Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ RWD (వెనుక చక్రాల డ్రైవ్) కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2.2-లీటర్ mHawk 130 CRDe డీజిల్ ఇంజిన్ 32PS పవర్, 300Nm టార్క్‌తో RWD, 4WD (నాలుగు చక్రాల డ్రైవ్) ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది.
2.0-లీటర్ mStallion 150 TGDi పెట్రోల్ ఇంజిన్, 152PS పవర్, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది RWD, 4WD ఆప్షన్లతో వస్తుంది. ఈ మూడు ఇంజిన్ వేరియంట్లన్నీ 6-స్పీడ్ మాన్యువల్ (MT) లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటాయి. థార్ రాక్స్ మోడల్ 2.0-లీటర్ G20 TGDi mStallion పెట్రోల్ ఇంజిన్‌తో 162PS పవర్, 330Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2.2-లీటర్ D22 mHawk డీజిల్ ఇంజిన్ శక్తివంతమైన టార్క్ డెలివరీతో ప్రసిద్ధి గాంచిన మోడల్. ఇది ఎక్కువగా ఆఫ్-రోడ్, దూర ప్రయాణాల కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఎంపిక. ఇది 177 PS పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, థార్ రాక్స్ పెట్రోల్ మోడల్ RWD కి పరిమితం చేయబడింది. డీజిల్ వేరియంట్ RWD, 4WD (4XPLOR) సెటప్‌ల మధ్య కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








