దేశం ఎదురుచూస్తున్న కారును మీరు సొంతం చేసుకోవచ్చు! ప్రస్తుతానికి రూ.25,000 చాలు!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటినుంచో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న మహీంద్రా కొత్త SUV ఇప్పుడు కస్టమర్లకు ముందుగానే చేరువవుతోంది. మహీంద్రా తన సరికొత్త XUV 7XO SUV బుకింగ్‌లను డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో సూపర్ హిట్‌గా నిలిచిన Mahindra XUV700కి పునఃరూపకల్పనగా రూపొందించిన ఈ కొత్త SUVపై కస్టమర్లలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ XUV 7XOను కొనుగోలు చేయాలనుకునే వారు మహీంద్రా అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా లేదా కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం కేవలం రూ. 21,000 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.
బుకింగ్ ప్రక్రియను మరింత కస్టమర్ ఫ్రెండ్లీగా మార్చిన మహీంద్రా, అదే సమయంలో తమకు నచ్చిన డీలర్‌షిప్ షోరూమ్‌ను ఎంపిక చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అంతేకాకుండా, కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రకం, ఇంజిన్ ఆప్షన్, గేర్‌బాక్స్ ఎంపికలను కూడా బుకింగ్ సమయంలోనే ఎంచుకునే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల కారును కొనుగోలు చేసే ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా మారనుంది.

ముఖ్యంగా SUV కొనుగోలులో పర్ఫార్మెన్స్, మైలేజ్, డ్రైవింగ్ అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లకు ఇది పెద్ద ప్లస్‌గా చెప్పుకోవచ్చు. XUV 7XO అధికారికంగా జనవరి 5, 2026న లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే బుకింగ్ ఓపెన్ చేయడం ద్వారా మార్కెట్లో ఆసక్తిని మరింత పెంచడమే కాకుండా, కస్టమర్లకు ముందస్తు ప్రయోజనం కల్పించడమే మహీంద్రా వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తం మీద లాంచ్‌కు ముందే SUV సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారిందని చెప్పొచ్చు.
కొత్త XUV7XOలో పవర్‌ట్రెయిన్ పరంగా మహీంద్రా ఎలాంటి రాజీ పడలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ SUVలో పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఎంపికలను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా, ప్రస్తుతం XUV700లో అందుబాటులో ఉన్న 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్నే కొత్త మోడల్‌లో కూడా ఉపయోగించనున్నట్లు భావిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 200 hp పవర్తో పాటు 380 Nm టార్క్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

స్పోర్టీ డ్రైవింగ్‌ను ఇష్టపడే వారికి ఇది మంచి అనుభవాన్ని అందించనుంది. అదే సమయంలో, డీజిల్ వేరియంట్ కోసం ఇప్పటికే నిరూపితమైన 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ను కూడా కొనసాగించనున్నట్లు అంచనా. ఈ ఇంజిన్ 185 hp పవర్తో పాటు 450 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ టార్క్ అవసరమయ్యే హైవే డ్రైవింగ్, లాంగ్ జర్నీలు, లోడ్‌తో ప్రయాణించే సందర్భాల్లో ఈ డీజిల్ ఇంజిన్ పెద్ద ప్లస్‌గా మారనుంది.
ఈ రెండు ఇంజిన్‌లకు కూడా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్ అభిమానులతో పాటు, సౌకర్యవంతమైన డ్రైవ్ కోరుకునే ఆటోమేటిక్ వినియోగదారులను కూడా ఈ SUV ఆకట్టుకునే అవకాశం ఉంది. అంతేకాదు, అడ్వెంచర్, ఆఫ్‌రోడ్ డ్రైవింగ్‌ను ఇష్టపడే కస్టమర్ల కోసం, ప్రస్తుతం XUV700 డీజిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను కొత్త XUV7XOలో కూడా కొనసాగించే అవకాశముందని సమాచారం.

SUV క్యాబిన్ లోపల పునఃరూపకల్పన చేయబడిన డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఇది XEV 9S ఎలక్ట్రిక్ కారులో ఉన్నట్లుగా మూడు-స్క్రీన్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. అలాగే, డాష్‌బోర్డ్‌లో కొత్త ఆకారపు AC వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయని తెలుస్తుంది. కారు ముందు డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ముందు సెటప్ అంతా కూడా ఆకర్షణీయంగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








