ఈ ఫ్యామిలీ కారు ధరను భారీగా తగ్గించిన కంపెనీ.. 7 మంది కంఫర్ట్‌గా ట్రావెల్ చేయొచ్చు.. మంచి మైలేజ్ కూడా

దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. అత్యంత ప్రజాదరణ పొందిన తన ప్రసిద్ధ మోడల్ XUV700 SUV మోడల్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, హై-టెక్ భద్రతా ప్రమాణాలతో పాపులర్ అయిన ఈ మోడల్‌పై కస్టమర్లకు వేరియంట్‌ను బట్టి తగ్గింపు ధరను ఆఫర్ చేస్తుంది. కుటుంబ SUVగా హిట్ అయిన XUV700 ఈ తగ్గింపు వల్ల మరింత మంది కస్టమర్లు ఈ కారును తమ గ్యారేజ్‌లో నిలుపుకునే అవకాశం లభించనుంది. మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం SUV మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. తక్కువ ధరలో హై-ఎండ్ కారు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం.

వేరియంట్ల వారీగా మహీంద్రా ఇస్తున్నటువంటి తగ్గింపులను చూసినట్లయితే XUV700 SUV AX7 AT (6-సీటర్) అలాగే, AX7 AT (7-సీటర్) కార్లపై రూ.45,000 తగ్గింపును కంపెనీ అందిస్తుంది. ఇంకా AX7 L AT (6-సీటర్), AX7 L AT (7-సీటర్) వేరియంట్‌లపై రూ.75,000 ధర తగ్గింపు అందుబాటులో ఉంది. XUV700 ఇప్పటికే మార్కెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన SUVలలో ఒకటి. ఈ ధర తగ్గింపు దానిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

Rs 75000 Cut On Xuv700 Suv

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న SUV XUV700 బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 13.99 లక్షల నుంచి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి రూ. 25.74 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే పన్నులతో కలిపి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ధరలు నగరాలను బట్టి మారుతుంది. ఈ కారు బయటి నుంచి ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ SUV తన స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ పనితీరుతో భారత SUV మార్కెట్‌లో ప్రముఖ స్థానాన్ని పొందింది. ఈ SUVలో LED హెడ్‌లైట్లు, LED DRLs, LED ఫాగ్ లాంప్స్, స్టైలిష్ ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఆకట్టుకునే అల్లాయ్ వీల్స్ వంటి అదిరిపోయే ఎక్స్‌టీరియర్ హైలైట్స్ ఈ కారులో ఉన్నాయి. ఇది రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Mahindra Xuv700 Suv

XUV700 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో 200 PS పవర్, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో 185 PS పవర్, 450 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఈ ఇంజిన్‌కు జోడించారు. ఇది దాదాపు 17 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఇది దాని శక్తివంతమైన పనితీరుతో, మైలేజ్ సామర్థ్యాన్ని ఇస్తుంది.

మహీంద్రా మోటర్స్ తన ఫ్లాగ్షిప్ XUV700ని అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో అందిస్తుంది. ఈ మోడల్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 12-స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, వాయిస్ కమాండ్ ఫంక్షన్లు, 7 ఎయిర్‌బ్యాగులు, ESP,ADAS, TPMS వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి.

Mahindra Xuv700

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, March 29, 2025, 10:00 [IST]
English summary
Mahindra price cut upto rs 75000 on xuv700 suv more details check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+