సినిమాలైనా, మినిస్టర్ కాన్వాయ్ అయినా ఈ కారు ఉండాల్సిందే..త్వరలో కొత్తగా ముస్తాబై రాబోతుంది
దేశంలో ఎస్‌యూవీలను తయారు చేయడంలో ముందున్న మహీంద్రా కంపెనీ, త్వరలో తమ రెండు ముఖ్యమైన మోడల్స్ అయిన స్కార్పియో-ఎన్ (Scorpio-N), ఎక్స్‌యూవీ700 (XUV700) (ఇప్పుడు XUV 7XO) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆయా సెగ్మెంట్లలో పోటీ పెరిగిన నేపథ్యంలో, మహీంద్రా ఈ రెండు ఎస్‌యూవీలను కొత్త అప్‌డేట్‌లు, ఆకర్షణీయమైన ఫీచర్‌లతో మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ఎస్‌యూవీలకు సంబంధించి రోడ్డు టెస్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. వాటి స్పై షాట్‌లు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త మోడల్స్‌లో ఏం ఆశించవచ్చో వివరంగా తెలుసుకుందాం.
కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ, మరింత ఆకర్షణీయమైన, అగ్రెస్సివ్ గ్రిల్తో పాటు, కొత్తగా అప్‌డేట్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌లు వంటి మార్పులతో ముందు భాగాన్ని కొత్తగా డిజైన్ చేయనుంది. ఈ మార్పుల వల్ల స్కార్పియో-ఎన్ రోడ్ ప్రజెన్స్ (Road Presence) మరింత పెరుగుతుంది. మొత్తం లుక్ ఒకేలా ఉన్నప్పటికీ, చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులు కారుకు మోడ్రనిటీని తీసుకువస్తాయి.

ప్రీమియం ఫీచర్లు,సేఫ్టీ అప్‌డేట్స్
పోటీదారులకు గట్టి పోటీ ఇవ్వడానికి, మహీంద్రా కొత్త స్కార్పియో-ఎన్‌లో ప్రీమియం ఫీచర్లు, మెరుగైన భద్రతా అంశాలను చేర్చాలని భావిస్తోంది. ప్రస్తుతం టాప్ ట్రిమ్స్‌కు మాత్రమే పరిమితమైన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ప్యాకేజీని, ఈసారి అన్ని వేరియంట్‌లలోనూ స్టాండర్డ్ ఫీచర్‌గా తీసుకురావచ్చని అంచనా.
ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్ల కారణంగా ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర (రూ. 13.20 లక్షల నుంచి రూ. 24.17 లక్షలు) కంటే, కొత్త ఫేస్‌లిఫ్ట్ ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ (XUV 7XO)
నాలుగు సంవత్సరాల అమ్మకాల తర్వాత, మహీంద్రా తమ XUV700 మోడల్‌ను XUV 7XO అనే కొత్త పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ కొత్త XUV 7XO తన పాత మోడల్ XUV700 కెపాసిటీ, టెక్నాలజీ, పర్పామెన్స్నే కొనసాగిస్తుంది.
డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లు
కొత్త XUV 7XO ముందు భాగంలో కొత్త గ్రిల్తో మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్‌లు ట్విన్-పాడ్ డిజైన్ను కలిగి ఉంటాయి. వెనుక వైపున, కొత్త టైల్-ల్యాంప్‌లు రిఫ్రెష్ డిజైన్‌ను పొందాయి. కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్‌తో పాటు, రివైజ్డ్ బంపర్‌లను కూడా మనం ఆశించవచ్చు. ఈసారి ఇంటీరియర్‌లో ట్రిపుల్-స్క్రీన్ డిజైన్ ఉండే అవకాశం ఉంది, ఇది కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
సేఫ్టీ ఫీచర్లు, బుకింగ్ వివరాలు
సురక్షితమైన ప్రయాణం కోసం కొత్త XUV 7XOలో 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. అదనంగా, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు లభిస్తాయి.
పవర్‌ట్రైన్‌లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. 6- లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లు యధావిధిగా కొనసాగుతాయి. కొత్త మహీంద్రా XUV 7XO ప్రారంభ ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.26 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు జనవరి 5వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, ఆసక్తి ఉన్నవారు రూ.21,000 ముందస్తు చెల్లింపుతో బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








