కొత్త కారు కొనాలా? రూ.8.94 లక్షలకే అదిరిపోయే కారు వచ్చేసింది బాస్! మహీంద్రా కొత్త మోడల్‌పై ఓ లుక్కేయండి
భారతీయ SUV మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహీంద్రా (mahindra), తాజాగా XUV 3XO 'REVX' సిరీస్‌తో మరింత ఆకర్షణీయమైన అడుగు వేసింది. ఇది ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న XUV 3XO కొత్త అవతారం. ఈ సారి మరింత స్టైలిష్ డిజైన్, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు,డ్రైవింగ్ ఎంగేజ్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది మహీంద్రా. స్పోర్టీగా కనిపించేట్టు, నడిపించడంలో జోష్ కలిగేట్టు, ఇంకా పోటీ ధరతో కొనుగోలుదారులకు లభించేలా REVX సిరీస్‌ను రూపొందించింది. ఈ సిరీస్‌ను ప్రీమియం డిజైన్, ఆధునిక ఫీచర్లతో పాటు శక్తివంతమైన పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పోటీ ప్రస్తుతం ఆటోపరిశ్రమలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ కంపెనీ XUV 3XO 'REVX'తో ఇతర మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది. ఈ కారు గురించిన వివరాలను ఈ కథణంలో తెలుసుకుందాం..
మహీంద్రా XUV 3XO REVX ధర పరంగా చూస్తే, రూ. 8.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఫీచర్ల పరంగా కూడా రిచ్ ఫీల్ కలుగిస్తుంది. దీనిలో అనేక టెక్నాలజీ అప్గ్రేడ్‌లు, కనెక్టివిటీ ఫీచర్లు, డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్కువ ఫీచర్స్‌తో కూడిన ప్ వేరియంట్ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు వెళుతుంది.

XUV 3XO REVX మూడు వేరియంట్లలో REVX M, REVX M (O), REVX A లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫీచర్లు, డిఫరెంట్ స్టైల్‌తో రూపొందించబడింది. ఇంజిన్ అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. ఇందులో 1.2 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు, ఇది TCMPFi(టర్బో చార్జ్డ్ మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్), TGDi (టర్బో గ్యాస్ డైరెక్ట్ ఇంజెక్షన్) వేరియంట్లుగా లభిస్తుంది.
వినియోగదారుల డ్రైవింగ్ అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకొని, ఈ SUVకు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (MT) తో పాటు, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AT) ఎంపికలుగా అందుబాటులో ఉంది. ఎక్స్‌టీరియర్ విషయానికొస్తే, ఈ REVX సిరీస్ ఐదు రకాల స్టైలిష్ కలర్ ఆప్షన్లలో గెలాక్సీ గ్రే, టాంగో రెడ్, నెబ్యులా బ్లూ, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్‌లలో అందుబాటులో ఉంది.

వేరియంట్‌ల వివరాల్లోకి వెళితే, REVX M(O) ధర రూ.9.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) అనే మిడ్-వేరియంట్ అత్యంత విలువైనదిగా నిలుస్తోంది. ఇది బేస్ మోడల్ అయిన REVX M కంటే మరింత ఆకర్షణీయమైన క్యాబిన్ అనుభవంను అందిస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, దీనిలో సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఇతర అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు అందించబడతాయి. ఫిట్మెంట్, ఫినిషింగ్, డాష్ డిజైన్ వంటి అంశాల్లో ఈ వేరియంట్ పక్కాగా ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది.
REVX A వేరియంట్, మహీంద్రా XUV 3XO REVX సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన, ప్రీమియం మోడల్‌గా నిలుస్తోంది. రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ వేరియంట్, ప్రత్యేకంగా అధిక పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం రూపుదిద్దబడింది. ఇందులో 1.2 లీటర్ల mStallion TGDi (టర్బో గ్యాస్ డైరెక్ట్ ఇంజెక్షన్) ఇంజిన్ వాడబడింది, ఇది మహీంద్రా ఇంటర్నల్ హై-పెర్ఫార్మెన్స్ పెట్రోల్ ఇంజిన్ లైనప్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ ఇంజిన్ నుండి 130 bhp శక్తి ఉత్పత్తి అవుతుంది, అలాగే 230 Nm టార్క్‌ను జనరేట్ చేయగలదు. REVX A వేరియంట్ రెండు గేర్‌బాక్స్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AT) ఎంపికలతో వస్తుంది. వీటివల్ల డ్రైవింగ్ అనుభవాన్ని వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఈ వేరియంట్‌లో ఉన్న శక్తివంతమైన ఇంజిన్ వలన, ఇది హైవే రైడింగ్, అలాగే సిటీ ట్రాఫిక్‌కు మెరుగ్గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








