20 ఏళ్లుగా మహీంద్రాకు తిరుగులేని ఆయుధం..ఆ కారు కొనడానికే క్యూ కడుతున్న జనం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక, సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికల్లో మహీంద్రా డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. ఈ అమ్మకాల జోరులో మహీంద్రా పాత మోడల్ అయిన స్కార్పియో కారు అగ్రస్థానంలో నిలవడం విశేషం. స్కార్పియో కారు కోసం కస్టమర్‌లు 20 ఏళ్లుగా క్యూ కడుతున్నారని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

2025 సంవత్సరపు మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) మహీంద్రా మొత్తం 1,44,503 కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.28% అధికం. 2024 మూడవ త్రైమాసికంలో కేవలం 1,35,962 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రికార్డు వృద్ధికి ప్రధానంగా థార్, స్కార్పియో కార్లే కారణం. ఈ రెండు మోడళ్లు మహీంద్రా మొత్తం త్రైమాసిక అమ్మకాల్లో దాదాపు 49% వాటాను కలిగి ఉన్నాయి.

Mahindra Records Strong Double-Digit Growth in Q3 Sales Scorpio Leads the Charge

స్కార్పియో (క్లాసిక్, N సహా) ఈ త్రైమాసికంలో 41,959 యూనిట్లు అమ్ముడై, 3.7% వార్షిక వృద్ధిని నమోదు చేసి, మహీంద్రాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. థార్ 63.97% భారీ వార్షిక వృద్ధితో 28,688 యూనిట్లు అమ్ముడయ్యాయి. XUV700 21,774 యూనిట్లు అమ్ముడై 17.6% స్వల్ప తగ్గుదల చూపింది.

XUV3XO 21,791 యూనిట్లు అమ్ముడై 22.18% తగ్గుదల నమోదు చేసింది. పెరుగుతున్న పోటీ, ఉత్పత్తిలో మార్పుల కారణంగా ఈ మోడళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించింది. బొలెరో 18,369 యూనిట్లు అమ్ముడయ్యాయి, కానీ వార్షికంగా 14.97% క్షీణతను ఎదుర్కొంది.

Mahindra Records Strong Double-Digit Growth in Q3 Sales Scorpio Leads the Charge

గత నెల సెప్టెంబర్‌లో మహీంద్రా బలమైన నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌లో మొత్తం అమ్మకాలు 56,233 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం సెప్టెంబర్‌తో (51,062 యూనిట్లు) పోలిస్తే 10% అధికం. అంతకుముందు ఆగస్టు 2025లో (39,999 యూనిట్లు) అమ్ముడైన కార్లతో పోలిస్తే ఇది ఏకంగా 43% నెలవారీ వృద్ధిని నమోదు చేసింది.

స్కార్పియో 18,372 యూనిట్లు అమ్ముడై (స్కార్పియో క్లాసిక్, N తో కలిపి) సెప్టెంబర్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు వార్షికంగా 27%, నెలవారీగా 87% పెరిగాయి. థార్ (3-డోర్, కొత్త 5-డోర్ ROXX వెర్షన్) 11,846 యూనిట్లు అమ్ముడై రెండో స్థానంలో ఉంది.

Mahindra Records Strong Double-Digit Growth in Q3 Sales Scorpio Leads the Charge

ఇది వార్షికంగా 34%, నెలవారీగా 69% వృద్ధిని చూపింది. ఇటీవల వచ్చిన 2025 థార్ ఫేస్‌లిఫ్ట్ దీని అమ్మకాలను మరింత పెంచింది. XUV700 గత నెలలో దీని డిమాండ్ పెరిగి 9,764 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆగస్టుతో పోలిస్తే ఇది ఏకంగా 97% నెలవారీ వృద్ధిని నమోదు చేయడం విశేషం.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో XEV 9e (7,394 యూనిట్లు), BE 6 (4,798 యూనిట్లు) ఈ త్రైమాసికంలో గణనీయమైన విక్రయాలకు దోహదపడ్డాయి. అలాగే, మహీంద్రా మరాస్సో కారు 225 యూనిట్లు అమ్ముడైంది, ఇది సంఖ్యపరంగా తక్కువగా ఉన్నా గత ఏడాదితో పోలిస్తే దాదాపు 676% వార్షిక వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Monday, October 13, 2025, 17:30 [IST]
English summary
Mahindra records strong double digit growth in q3 sales scorpio leads the charge
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+