అందరి ఫేవరెట్ మహీంద్రా 7 సీటర్ కారు.. SUVలలో దీనికే డిమాండ్ ఎక్కువ.. బెస్ట్ సెల్లర్ మోడల్
భారతీయ ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కార్లను విడుదల చేస్తూ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలకు ప్రత్యర్థిగా ఉంది. ప్రతి ఏడాది అదిరిపోయే సరికొత్త వాహనాలకు మార్కెట్లోకి లాంచ్ చేస్తూ, తన వ్యాపారాన్ని బాగా విస్తరించుకుంటుంది. మహీంద్రా దేశీయంగా కార్లను విక్రయిస్తూనే, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంది. 2024 సంవత్సరంలో కంపెనీల పలు కొత్త మోడళ్లను విడుదల చేయగా అవి ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మహీంద్రా స్కార్పియో(scorpio) ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న ఎస్‌యూవీ (SUV)లలో సేల్స్ పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేసింది. గత ఏడాదిలో చాలా మంది కొత్త కస్టమర్లు స్కార్పియో కారును కొనుగోలు చేశారు. ఈ మోడల్ ఎస్‌యూవీ విభాగంలో మిగతా వాటి కంటే ఎక్కువ సేల్స్‌ను సాధించింది.
మహీంద్రా స్కార్పియో కారు అంటేనే మార్కెట్లో ఒక సంచలనమైన మోడల్. దీని స్టైలిష్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ మంది కస్టమర్లు దీనికే ఫిదా అయిపోతుంటారు. రెండు సంవత్సరాలుగా ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారును దాదాపు 10 లక్షల మందికి పైగా కొనుగోలు చేశారు. కంపెనీ ఎప్పటికప్పుడు దీన్ని అప్‌డేట్ చేస్తూ ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన ఫీచర్లను అందిస్తూ విడుదల చేస్తుంది.

కొత్తగా వచ్చిన స్కార్పియో Nలో సరికొత్త సాంకేతికత, భద్రత వంటి వాటిని అందించారు. రెండు వేరియంట్లు స్కార్పియో N, క్లాసిక్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ తరపున అత్యధికంగా అమ్ముడవుతున్న suvలలో ఇవి కీలకంగా ఉన్నాయి. తాజాగా వచ్చిన డేటా ప్రకారం, స్కార్పియో 2024 ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 1,54,169 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. N, క్లాసిక్ రెండు కూడా ఈ రేంజ్ సేల్స్‌ను సాధించాయి.
ప్రస్తుతం స్కార్పియో N, క్లాసిక్‌లు రెండు కూడా అధునాతన డిజైన్లతో, అదిరిపోయే ఫీచర్లతో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 11 నెలల కాలంలోనే స్కార్పియో వేరియంట్లు ఎక్కువ మంది కొత్త కస్టమర్ల వద్దకు చేరిన suvలుగా ఘనతను సాధించాయి. మహీంద్రా కంపెనీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో మొదటి సారిగా 5 లక్షలకు పైగా ఎస్‌యూవీ సేల్స్‌ను సాధించడం గమనార్హం. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది భారీగా పెరిగింది.

2023లో మహీంద్రా ఎస్‌యూవీల అమ్మకాలు దాదాపు 4.33 లక్షల వరకు నమోదయ్యాయి. 2024లో మాత్రం ఇది 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. 11 నెలల మొత్తం మహీంద్రా కార్ల అమ్మకాల్లో స్కార్పియో సేల్స్ వాటా 32 శాతం వరకు ఉంది. ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో ఎన్ వేరియంట్ రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.
పూర్తి అప్‌డేటేడ్‌గా వచ్చిన స్కార్పియో ఎన్ వేరియంట్ 6, 7, సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. అదే స్కార్పియో క్లాసిక్ వేరియంట్ S, S11 మోడళ్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 13.62 లక్షల నుండి టాప్ మోడల్ ధర రూ. 17.42 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ ఇంజిన్ BS-VI ఉద్గార ప్రమాణాలు, RDE నిబంధనలకు అనుగుణంగా ఉంది.

అదే, స్కార్పియో N మోడల్ ల్ 2.0-లీటర్ ఎంస్టలీయన్ పెట్రోల్, 2.2-లీటర్ Mhawk డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ 200 bhp పవర్, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, డీజిల్ ఇంజిన్ 175 bhp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది


Click it and Unblock the Notifications








