అడ్వాన్సుడ్ ఫీచర్లతో స్కార్పియో ఎన్ వచ్చేస్తోంది.. ఈ సారి పనోరమిక్ సన్ రూఫ్, ఏడీఏఎస్ ఇంకా ఎన్నో !
మహీంద్రా స్కార్పియో ఎన్ ఇండియాలో చాలా పాపులర్ అయిన ఎస్‌యూవీ. 2022లో ఈ కారును గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇది చాలా కొత్త ఫీచర్లతో, అడ్వాన్స్‌డ్ డిజైన్, టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఇప్పుడు కంపెనీ అప్‌డేట్ చేసిన 'స్కార్పియో ఎన్' ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించిన ఒక టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే 2025 మోడల్ కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అవుతుంది. ఇందులో లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి అదిరిపోయే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా కంపెనీ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో రిలీజ్ చేసిన టీజర్ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, అందులో హైవేపై ఉన్న లేన్‌లను చూపించారు. దీన్ని బట్టి చూస్తే, ఇది ADAS లో ఉండే లేన్ కీప్ అసిస్ట్ అని ఈజీగా చెప్పేయొచ్చు. అంతేకాకుండా, కొత్త కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో పాటు, మరికొన్ని ADAS సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయని ఊహిస్తున్నారు.
ఇప్పటికే, మన దేశంలో మహీంద్రా విజయవంతంగా అమ్ముతున్న XUV 3XO, XUV700, BE6, XEV 9E కార్లలో లెవెల్ 2 ADAS ఆప్షన్ ఉంది. ఈ సేఫ్టీ ఫీచర్లతో రాబోయే స్కార్పియో ఎన్ ధర కొద్దిగా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.14లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.25 లక్షలు (ఎక్స్-షోరూం). ఇది Z2, Z4, Z6, Z8 S, Z8, Z8 L వంటి వివిధ వేరియంట్లలో లభిస్తుంది. బయటి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, డాజ్లింగ్ సిల్వర్ , రెడ్ రేజ్, డీప్ ఫారెస్ట్, నపోలి బ్లాక్ రంగులలో వస్తుంది.
ఈ కారులో రెండు పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్/ ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 57 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ దీనికి ఉంది.

కొత్త స్కార్పియో ఎన్ ఎస్‌యూవీలో 6 లేదా 7 సీట్లు ఉంటాయి. దూర ప్రయాణాలకు ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి వీలుగా 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ కారు 4662 మి.మీ పొడవు, 1917 మి.మీ. వెడల్పు, 1857 మి.మీ. ఎత్తు ఉంటుంది. 2750 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికొస్తే, 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, టీపీఎమ్‌ఎస్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ ఇప్పటికే తన డిజైన్, పర్ఫార్మెన్స్‌తో మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వస్తే, దీని క్రేజ్ మరింత పెరుగుతుంది. కొద్దిగా ధర పెరిగినా, ఈ ఫీచర్లతో కారు మరింత ఆకర్షణీయంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








