ప్రత్యర్థులు వణికిపోయేలా కొత్త ఫీచర్‌ను తెచ్చిన మహీంద్రా.. కొత్త స్కార్పియోతో దుమ్ములేపనుంది!
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra)కు చెందిన ప్రసిద్ధ మోడల్ స్కార్పియో (Scorpio) ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. రెండు తరాలుగా ఈ కార్లు ప్రజల అభిమానాలను పొందుతున్నాయి. suv విభాగంలో దీనిదే పై చేయి. కాలం మారినా, ట్రెండ్ మారినా, ఈ suvకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే కారణంగా ఇది హాట్ కేక్‌లా అమ్ముడవుతూ, ప్రతి ఇంటికి చేరింది. ఇప్పుడు ఈ అనుభవాన్ని మరింత ఆధునీకరించడానికి మహీంద్రా మరో అడుగు ముందుకు వేసింది. సరికొత్త టెక్నాలజీతో, లెవెల్ 2 ADAS భద్రతా ఫీచర్లతో కొత్త స్కార్పియో N (Scorpio N)ను అలాగే, కొత్త Z8T వేరియంట్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌కి ఉన్న భద్రతా, సౌకర్యం లక్షణాలు స్కార్పియో అభిమానులను మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
లెవెల్ 2 ADAS భద్రతా ఫీచర్లను టాప్ ఎండ్ వేరియంట్ Z8Lలో అందించారు. మహీంద్రా స్కార్పియో N కి తాజాగా చేరిన Z8T, Z8L (ADAS) ట్రిమ్‌లు మెరుగైన పనితీరును అందించే విధంగా ఉన్నాయి. కొత్త Z8T పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ ప్రారంభ ధర సుమారు రూ.20.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ వేరియంట్ అయిన డీజిల్ 4WD ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.24.36 లక్షల వరకు ఉంటుంది.

అంటే, లేటెస్ట్ సౌకర్యాలు కోరుకునేవారు గాని, పవర్‌ఫుల్ డ్రైవింగ్ అనుభూతి కోరుకునేవారు గాని తమ అవసరానికి తగిన కాన్ఫిగరేషన్‌ని ఎంపిక చేసుకోవచ్చు. అదే సమయంలో, అత్యాధునిక భద్రతా సాంకేతికత కలిగిన ADAS-ఎక్విప్డ్ Z8L వేరియంట్ ధర రూ.21.35 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అంటే, భద్రతతో పాటు సాంకేతికంగా మరింత పూర్తి ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు ఇది సరైన ఎంపిక అవుతుంది.
కొత్త లెవల్ 2 ADASతో స్కార్పియో Nలో భద్రతా ప్రమాణాలను మరో స్థాయికి వెళ్లాయి. టాప్ ఎండ్ వేరియంట్ Z8L కొత్తగా సేఫ్టీ కోసం డ్రైవర్ అవగాహనను మరింత పెంచేందుకు, ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గించేందుకు అనేక ఫీచర్లు ఇందులో అందించారు. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ముందు ఉన్న వాహనం అనుకోకుండా ఆగినప్పుడు లేదా వేగం తగ్గించినప్పుడు వెంటనే హెచ్చరిక ఇస్తుంది.

అదే సమయంలో, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అవసరమైనప్పుడు స్వయంగా బ్రేక్స్ వేస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ , స్టాప్ అండ్ గో ఫీచర్‌తో సహా, ట్రాఫిక్‌లో వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. అంటే, ముందున్న వాహనం ఆగితే కారును ఆపుతుంది, తిరిగి కదిలితే స్పీడ్ పెంచుతుంది. ఇది హైవే ప్రయాణాల్లో డ్రైవింగ్‌ను సౌకర్యవంతం చేస్తుంది. స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.
అంతేకాదు, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ బోర్డులు, వేగ పరిమితులను గుర్తించి డ్రైవర్‌కు సమాచారం అందిస్తుంది. హై బీమ్ అసిస్టెంట్ రాత్రి డ్రైవింగ్‌ను సౌకర్యవంతం చేస్తూ ఎదురుగా వచ్చే వాహనాలకి హై బీమ్ లైట్ ఇబ్బంది కాకుండా చూస్తుంది. ఈ అన్ని ఫీచర్లు కలిపి స్కార్పియో Nని మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా ప్రయాణాన్ని అందించనుంది. హైవే రైడ్‌లు, నగరాల్లో ట్రాఫిక్‌లో ఇవి గొప్ప భద్రతగా ఉపయోగపడుతాయి.

కొత్త స్కార్పియో N Z8T వేరియంట్, Z8 శ్రేణిలో ఒక మధ్యస్థ స్థాయి ఆప్షన్గా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు టాప్-ఎండ్ Z8L వేరియంట్‌కి భద్రతా, సౌకర్య లక్షణాల పరంగా ఎక్కువ ప్రాధాన్యం ఉండగా, ఇప్పుడు Z8T ని చేర్చడం ద్వారా మరింత వినియోగదారులకు ఈ SUV చేరువవుతుంది. ఈ వేరియంట్‌కి 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ రెండూ లభిస్తాయి.


Click it and Unblock the Notifications








