ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు..ఈ కారుంటే సినిమా హిట్టంతే.. ఎప్పుడు వెళ్లినా జనంతో షోరూంలు కిటకిట

భారతదేశ కార్ల మార్కెట్‌లో మహీంద్రా స్కార్పియో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుని, భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కొనుగోలుదారులు కూడా చాలా ఇష్టపడి దీన్ని కొంటున్నారు. తెలుగు ఫ్యాక్షన్ సినిమాల్లో కీలక పాత్రను పోషించింది స్కార్పియో. స్కార్పియోలు గాల్లోకి లేచిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

అలాగే బయట మార్కెట్లో కూడా ఇది బంపర్ హిట్. ఇటీవల దేశీయంగా అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా విడుదలైంది. అందులో స్కార్పియో 7వ స్థానంలో నిలిచి, 12,740 యూనిట్లను విక్రయించింది. టాప్ 10 జాబితాలో హ్యుందాయ్ క్రెటా(15,786 యూనిట్లు) మొదటి స్థానంలో ఉంది. మారుతి సుజుకి డిజైర్ (15,484 యూనిట్లు) రెండో స్థానంలో, మారుతి సుజుకి బ్రెజా(14,507 యూనిట్లు) మూడో స్థానంలో ఉన్నాయి.

Mahindra Scorpio

అలాగే మారుతి సుజుకి ఎర్టిగా(14,151 యూనిట్లు) నాలుగో స్థానంలో, మారుతి సుజుకి స్విఫ్ట్(13,275 యూనిట్లు) ఐదో స్థానంలో, మారుతి సుజుకి వాగన్ఆర్(12,930 యూనిట్లు) ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి 5 నెలల్లో కూడా మహీంద్రా స్కార్పియో SUV రికార్డు స్థాయిలో అమ్ముడైంది. మే నెలలో 14,401 యూనిట్లు, ఏప్రిల్‌లో 15,534 యూనిట్లు, మార్చిలో 13,913 యూనిట్లు, ఫిబ్రవరిలో 13,618 యూనిట్లు, జనవరిలో 15,442 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో SUV స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే రెండు రకాల్లో కస్టమర్లకు లభిస్తోంది. అంతేకాకుండా, ఇది ఆధునిక డిజైన్, ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఎక్కువ సీట్లు ఉండడం వల్ల, ఒక పెద్ద కుటుంబం కూడా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

Mahindra Scorpio

ఈ SUV రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో కస్టమర్లకు లభిస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, డాజ్లింగ్ సిల్వర్, రెడ్ రేజ్, డీప్ ఫారెస్ట్, నపోలి బ్లాక్ వంటి వివిధ రంగుల ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ఇది 6 లేదా 7 సీట్ల ఆప్షన్లతో వస్తుంది.

కొత్త స్కార్పియో ఎన్ 2-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంది. ఇది 12 నుండి 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Mahindra Scorpio

ఈ SUV కనీసం రూ.13.77 లక్షలు, గరిష్టంగా రూ.17.72 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుంది. ఇది ఎస్, ఎస్11 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టెల్త్ బ్లాక్, మాల్టన్ రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, నపోలి బ్లాక్, డిసెట్ సిల్వర్, ఎవరెస్ట్ వైట్ వంటి రంగులలో లభిస్తుంది.

ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 16 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 7 లేదా 9 సీట్ల ఆప్షన్లలో వస్తుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, పవర్ స్టీరింగ్, రూఫ్ మౌంటెడ్ సన్‌గ్లాస్ హోల్డర్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్యుయల్-ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Mahindra Scorpio

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా స్కార్పియో దాని పటిష్టత, సీటింగ్ కెపాసిటీ, ఇప్పుడు మెరుగైన ఫీచర్లతో మార్కెట్లో తన పట్టును నిలుపుకుంటోంది. స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ రెండు వెర్షన్లు వేర్వేరు బడ్జెట్‌లు, అవసరాలకు సరిపోయేలా ఉండటం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2025, 14:35 [IST]
English summary
Mahindra scorpio records sales 7th position in top 10 cars list best mileage suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+