ఒక మంచి కాఫీ కన్నా.. మంచి కార్లో ప్రయాణం చాలా బావుంటది! అందుకే ఈ కారుకు ఫుల్ డిమాండ్

దేశీయ దిగ్గజ వాహన తయారీదారు అయినటువంటి మహీంద్రా (Mahindra) శక్తివంతమైన పనితీరుతో కూడిన వాహనాలను విడుదల చేస్తుంది. ప్రధానంగా ఎస్‌యూవీ స్టైల్‌కు చెందిన వాటిని తీసుకురావడంలో ఈ కంపెనీ ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఈ క్రమంలోనే స్కార్పియో (Scorpio)ను తీసుకొచ్చింది. ఈ కారు తన సొగసైన డిజైన్‌తో పాటు, డజన్ల కొద్దీ ఆధునిక ఫీచర్లను కలిగి ఉండటం వల్ల వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైల్, సౌకర్యం, టెక్నాలజీ.. ఈ మూడు అంశాల్లోనూ అభిమానాన్ని సాధించిన మోడల్‌గా ఇది మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ కారణంగానే, వినియోగదారులు దీన్ని విశ్వసనీయంగా ఎంచుకుంటూ, కొనుగోలు జాబితాలో ముందు ఉంచుతున్నారు. దానికి తాజా నిదర్శనంగా జూలై 2025లో దీని అమ్మకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి.

ఇటీవల విడుదలైన సేల్స్ నివేదిక ప్రకారం, జూలై 2025లో స్కార్పియో ఒక్క నెలలోనే 13,747 యూనిట్లు అమ్ముడుపోయింది. గత ఏడాది ఇదే కాలంలో 12,237 యూనిట్లు అమ్ముడైన దృష్ట్యా, ఈసారి అమ్మకాలు సంవత్సరానికి 12 శాతం పెరిగింది. ఈ వృద్ధి కేవలం మార్కెట్ డిమాండ్‌ను మాత్రమే కాకుండా, వినియోగదారులు కారుపై ఉంచిన నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. క్రమంగా పెరుగుతున్న అమ్మకాల సంఖ్య చూస్తుంటే, రాబోయే నెలల్లో కూడా ఇది పెరగవచ్చు.

Mahindra Scorpio Suv July 2025 Sales Report Details

మహీంద్రా స్కార్పియో N గురించి చూసినట్లయితే ఇది రూ. 13.99 లక్షల నుండి రూ. 25.15 లక్షల (ఎక్స్‌-షోరూమ్) ధర పరిధిలో లభించే ప్రీమియం SUV. ఇది కేవలం బలమైన రోడ్ ప్రెజెన్స్‌నే కాకుండా, లేటెస్ట్ డిజైన్‌తో కూడిన ఆకర్షణీయమైన లుక్‌ను కూడా కలిగి ఉంది. శక్తివంతమైన పనితీరు కోసం ఇందులో రెండు ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలను బట్టి ఎంచుకోవచ్చు.

ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఈ ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికలతో డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్యూయల్ సామర్థ్యం పరంగా, స్కార్పియో N 12 నుండి 16 కిలోమీటర్ల వరకు లీటరుకు మైలేజీ ఇస్తుంది, అలాగే 57 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో కుటుంబంతో కలిపి వెళ్లే దూర ప్రయాణాలను సులభంగా పూర్తి చేయవచ్చు.

Mahindra Scorpio Suv July 2025 Sales Report Details

వేరియంట్‌ను బట్టి 6 లేదా 7 సీటింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో, చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం వరకు అందరికీ ఇది సరిపోతుంది. విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీట్లు, లాంగ్ డ్రైవ్‌లలో కూడా అలసట రానీయని కంఫర్ట్‌తో స్కార్పియో N, శక్తి, స్టైల్, సౌకర్యం కలగలసిన ఒక అద్భుతమైన SUVగా నిలుస్తుంది. మరో మోడల్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కూడా మంచి పనితీరు అందించే కారు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ధర రూ. 13.77 లక్షల నుండి రూ. 17.72 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. శక్తివంతమైన 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది రోడ్లపై మంచి పనితీరును ప్రదర్శిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సాఫ్ట్‌గా గేర్ మార్పులు చేయడంలో సహాయపడుతుంది, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఇంధన సామర్థ్య పరంగా ఇది 14.44 kmpl మైలేజీని అందించడం వల్ల దూర ప్రయాణాలు కూడా ఆర్థికంగా ఉంటాయి.

Mahindra Scorpio Suv July 2025 Sales Report

More from DriveSpark

Article Published On: Saturday, August 9, 2025, 15:00 [IST]
English summary
Mahindra scorpio suv july 2025 sales report details check
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+