షోరూమ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కారే కావాలన్నారు! 7 సీటర్ కారుకు ఫిదా అయిన కస్టమర్లు

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) పేరు వినగానే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోడ్లపై ఆధిపత్యం గుర్తుకొస్తాయి. 2002లో తొలిసారిగా విడుదలైన ఈ SUV, రెండు దశాబ్దాలకుపైగా కాలం గడిచినా ఇప్పటికీ తన ప్రాధాన్యతను నిలబెట్టుకుంది. స్కార్పియో కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అనేక కుటుంబాల కలల SUVగా, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ రోడ్ల వరకు తన సత్తా చాటిన మోడల్‌గా నిలిచింది. తాజాగా, అక్టోబర్ నెల మహీంద్రా కంపెనీకి మరో విజయవంతమైన అధ్యాయాన్ని రాసింది. ఈ నెలలో మహీంద్రా స్కార్పియో భారీ స్థాయిలో అమ్ముడవడం కంపెనీకి ఉత్సాహాన్ని కలిగించింది. మొత్తం 18,107 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడగా, గత ఏడాది అక్టోబర్‌లో అమ్ముడైన 15,877 యూనిట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది.

ఈ గణాంకాలు స్కార్పియోకు ఉన్న ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేస్తున్నాయి. అమ్మకాల పెరుగుదల వెనుక పలు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి కేంద్ర ప్రభుత్వం GST సవరణలు అమలు చేయడంతో, స్కార్పియో ధరలు కొంత మేర తగ్గాయి. ఈ ధర తగ్గింపు మార్కెట్‌లో కొత్త కొనుగోలుదారులను ఆకర్షించింది. పైగా దీపావళి సీజన్ కావడంతో అది కూడా కాస్త కలిసి వచ్చింది.

Mahindra Scorpio Suv October 2025 Sales Recorded 14 Percent Growth Compared To Previous

భారతీయ కుటుంబాలు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి దీపావళి సీజన్ అత్యుత్తమ సమయమని భావించాయి. పండుగ ఆఫర్లు, ఫైనాన్స్ పథకాలు, మహీంద్రా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం,, ఇవన్నీ కలిపి స్కార్పియో అమ్మకాలకు బలాన్నిచ్చాయి. స్కార్పియో మరో ముఖ్యమైన ఆకర్షణ దాని డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రఫ్ అండ్ టఫ్ పనితీరు. పట్టణ రోడ్లలోనైనా, గ్రామీణ గడ్డలలోనైనా ఈ SUV సులభంగా నడుస్తుంది.

మహీంద్రా స్కార్పియో ప్రస్తుతం స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త మహీంద్రా స్కార్పియో N SUV తన శక్తివంతమైన పనితీరుతో పాటు ఆధునిక ఫీచర్లతో కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. దీని ధర రూ.13.20 లక్షల నుండి రూ.24.17 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్) ఉంది. ఇది రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్‌లను 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది.

Mahindra Scorpio Suv October 2025 Sales Recorded 14 Percent Growth Compared To Previous

పనితీరు పరంగా కూడా ఇది అద్భుతంగా నిలుస్తుంది. కేవలం 9 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగం అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 165 కిలోమీటర్లు, అలాగే మైలేజ్ 12 నుండి 16 కిమీ/లీటర్ మధ్య ఉంటుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 57 లీటర్లు, దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. డిజైన్ పరంగా చూసుకుంటే, కొత్త స్కార్పియో N నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

దీనిలో LED హెడ్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ లాంప్‌లు, DRLలు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బలమైన ప్రెజెన్స్ కలిగి ఉండటంతో రోడ్డుపై గట్టి ఇంపాక్ట్ సృష్టిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ SUVలో ఉన్న ఫీచర్లు నిజంగా ప్రీమియం అనిపిస్తాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత విలాసవంతంగా మార్చుతాయి.

Mahindra Scorpio Suv October 2025 Sales Recorded 14 Percent Growth Compared To Previous

భద్రత పరంగా కూడా స్కార్పియో N రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ వ్యూ కెమెరా వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం చూస్తే, మహీంద్రా స్కార్పియో N ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్, శక్తి, స్టైల్, సౌకర్యం, భద్రత.. అన్ని ఒకే వాహనంలో ఉన్నాయి. ఇది భారతీయ మార్కెట్లో మరోసారి SUV సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేలా కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 13, 2025, 9:24 [IST]
English summary
Mahindra scorpio suv october 2025 sales recorded 14 percent growth compared to previous
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+