షోరూమ్‌కు వచ్చేవారు ఈ కారునే ఎందుకు అడుగుతున్నారు? వేల మంది దీనికోసం ఎగబడ్డారు! ఎక్కడ చూసినా ఇదే!

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో కార్లను విడుదల చేస్తుంది. అమ్మకాల పరంగా మహీంద్రా గత కొంత కాలంగా మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది. ఇటీవల జూన్ నెల ముగియానే తయారీదారులు తమ వాహనాల సేల్స్‌కు సంబంధించిన వివరాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ కంపెనీ కూడా సేల్స్‌ను వెల్లడించగా, దానిలో ఆసక్తి కర విషయాలు తెలిశాయి. దేశీయ మార్కెట్లో ఈ సంస్థ జూన్ 2025లో 47,306 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగలిగింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 40,022 యూనిట్లతో పోలిస్తే దాదాపు 18.2 శాతం వృద్ధిని సూచిస్తుంది.

అంటే కంపెనీ మార్కెట్‌లో తన పట్టు ఇంకా బలంగా కొనసాగిస్తోందని స్పష్టమవుతోంది. ఇక్కడ మరో కీలక విషయం కూడా ఉంది. ఈ మొత్తం అమ్మకాల వెనక అసలు బలం మూడు SUV మోడళ్లదే. వీటి కారణంగా మహీంద్రా గతంలో కంటే ఎక్కువ వృద్ధిన సాధించడానికి వీలైంది. అవే, థార్ (Thar), బొలెరో (Bolero), స్కార్పియో (Scorpio). ఈ మూడు వాహనాలు కలిపి మొత్తం అమ్మకాలలోనే సగానికి పైగా వాటాను సాధించాయి.

Mahindra Scorpio Price

జూన్ 2025లో 47,306 ప్యాసింజర్ వాహనాల సేల్స్‌లో ఈ మూడు వాహనాలు కలిపి 29,760 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే మొత్తం అమ్మకాల్లో 62 శాతం పైగా వాటా కేవలం ఈ మూడు SUVలదే. వీటిలో స్కార్పియో మాత్రమే 12,740 యూనిట్ల అమ్మకంతో మొదటి స్థానంలో నిలిచింది. వెంటనే దాని తరువాత థార్ 9,542 యూనిట్లు అమ్ముడవ్వగా, బొలెరో కూడా తన స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తూ 7,478 యూనిట్లను మార్కెట్లో విక్రయించింది.

ఇది ఏంటంటే మహీంద్రా SUV సెగ్మెంట్ పట్ల వినియోగదారుల విశ్వాసం ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. ఈ గణాంకాలు చూస్తుంటే, మహీంద్రా బ్రాండ్ తన క్లాసిక్ SUVల ఆధారంగా మార్కెట్‌లో ఎలా ఎదుగుతుందో అర్థమవుతుంది. లేటెస్ట్ ఫీచర్లు, శక్తివంతమైన డిజైన్, గ్రామీణ ప్రాంతాల నుంచీ పట్టణాల్లో వరకు ఉన్న విస్తృత ఆదరణ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న నెట్‌వర్క్ సర్వీస్... ఇవన్నీ కలిసి మహీంద్రా సేల్స్ విజయానికి కారణాలుగా నిలిచాయి.

Mahindra Bolero Sales

మహీంద్రా స్కార్పియో.. ఇది కేవలం SUV మాత్రమే కాదు, ఇది బ్రాండ్‌కు ఒక సింబాల్ లాంటి వాహనం. జూన్ 2025లో 12,740 యూనిట్ల అమ్మకాలను సాధించడం అంటే సాధారణ విషయం కాదు. మహీంద్రా మొత్త అమ్మకాలలో ఇది ఒక్కటే 25 శాతం కన్నా ఎక్కువ వాటాను దక్కించుకోవడం గమనార్హం. అంతేకాదు, భారతదేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఏడవ స్థానాన్ని కూడా ఇది ఆక్రమించింది.

గత ఏడాది అదే నెలతో పోలిస్తే, స్కార్పియో జూన్ 2024లో 12,307 యూనిట్లు మాత్రమే అమ్మింది. అంటే 2025లో ఇది దాదాపు 4 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగలిగింది. ఇది చిన్న సంఖ్యలా అనిపించవచ్చు, కానీ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కొత్త మోడళ్లు వరుసగా వచ్చి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో, స్కార్పియో స్థిరంగా ఎదుగుతున్న తీరే దాని గొప్పతనాన్ని సూచిస్తుంది.

Mahindra Thar

ఇప్పటికీ స్కార్పియోను ఎన్నుకుంటున్న వినియోగదారులు దాని రఫ్ అండ్ టఫ్ డిజైన్‌ను, శక్తివంతమైన పనితీరును, ఇంకా ట్రస్ట్ చేసే బ్రాండ్ వాల్యూను మెచ్చుకుంటున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఒక పటిష్టమైన వాహనంగా చెలామణి అవుతూనే, పట్టణాల్లోనూ స్టేటస్ సింబల్‌గా నిలుస్తోంది. సాధారణంగా SUV సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది, స్కార్పియో మాత్రం వాటిని తట్టుకుని నిలబడింది.

More from DriveSpark

Article Published On: Saturday, July 19, 2025, 18:30 [IST]
English summary
Mahindra scorpio thar bolero achieved 62 percent share of total sales in june 2025
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+