మహీంద్రా ముచ్చటే వేరు.. ఒక్క నెలలో ఊహించని స్థాయిలో భారీ అమ్మకాలు..!

భారతీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా తాజాగా ఏప్రిల్ 2025లో నమోదు చేసిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, మహీంద్రా గత నెలలో 50,000కు పైగా SUVలను విక్రయించి మరోసారి తన దూకుడు కొనసాగించినట్లు తెలుస్తోంది. భారతదేశంలోని వినియోగదారులు హై-రైడింగ్, బలమైన రూపంలో ఉన్న SUVలపై చూపుతున్న ప్రేమ కారణంగా మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్‌లకు అమ్మకాలు మెరుగ్గా నమోదవుతున్నాయి. స్కార్పియో, బొలెరో, థార్, ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ300 వంటి పాపులర్ మోడల్స్‌కు గల ఆదరణ, మార్కెట్లో మహీంద్రాకు ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా దేశీయ ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ సాధించడానికి వీలైంది. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వచ్చిన కొత్త SUV మోడళ్లకీ మంచి స్పందన లభిస్తోంది. దీంతో మహీంద్రా మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకుంటూ పోతుందని అంచనా వేయవచ్చు.

గత సంవత్సరం ఏప్రిల్‌ 2024 లో 41,008 SUVలు విక్రయించిన మహీంద్రా, ఈ సంవత్సరం అదే నెలలో 11,322 యూనిట్లు అధికంగా విక్రయించి, మొత్తంగా 52,330 SUVలతో గత నెలను విజయవంతంగా ముగించింది. దీంతో కంపెనీ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సారి 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది మహీంద్రా మార్కెట్‌లోని ప్రాధాన్యతను మాత్రమే కాదు, SUVల పట్ల ఉన్న వినియోగదారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.

Mahindra Sold 52330 Suvs In April 2025

ఈ గణాంకాలు పరిశీలిస్తే, భారతీయ వినియోగదారుల ట్రెండ్ ఇప్పుడు స్పష్టంగా SUVలవైపు మళ్లినట్లు కనిపిస్తుంది. రఫ్ అండ్ టఫ్ లుక్, హై గ్రౌండ్ క్లియరెన్స్, ప్రాక్టికాలిటీ పరంగా అద్బుతమైన పనితీరును అందించడంలో ఇవి ముందు స్థానంలో ఉండటం చాలా కలిసి వచ్చిన అంశం. ఈ కారణంగానే మహీంద్రా వంటి ప్రసిద్ద ఎస్‌యూవీ బ్రాండ్‌లు తమ స్థానాన్ని మార్కెట్లో మరింత బలోపేతం చేసుకుంటున్నాయి.

గత నెలలో మహీంద్రా ఆటోమొబైల్స్ అమ్మకాల వృద్ధిలో దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా గణనీయ పాత్ర పోషించింది. కంపెనీ ఏప్రిల్ 2025లో 2,530 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయగా, ఇదే నెల 2024లో ఈ సంఖ్య కేవలం 534 యూనిట్లే. అంటే ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 374 శాతం ఎగుమతుల వృద్ధి, ఒక మాటలో చెప్పాలంటే భారీ వృద్ది అని చెప్పవచ్చు.

Mahindra Cars

దేశీయ విక్రయాలతో పాటు ఎగుమతులను కలిపి చూస్తే, మహీంద్రా ఏప్రిల్ 2025లో మొత్తం 54,860 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన వాహనాల సంఖ్య 41,542 మాత్రమే. అంటే 32 శాతం వృద్ధి, ఈ లెక్కన దాదాపు 13,318 యూనిట్లు అదనంగా అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్న దాని ప్రకారం, మహీంద్రా బ్రాండ్‌గా దేశంలోనే కాదు, ప్రపంచ మార్కెట్లలోనూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది.

ఏప్రిల్ 2025 మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను BE.06, XUV.e9 పేర్లతో విడుదల చేసింది. అయితే వీటి నెలవారీ అమ్మకాలను మహీంద్రా ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, కంపెనీ తెలిపిన ప్రకారం మార్చి 20న డెలివరీలు ప్రారంభమయ్యాక, ఏప్రిల్ 9 నాటికి 3,000కిపైగా యూనిట్లను వినియోగదారులకు అందజేశారు. మహీంద్రా వచ్చే నెలల్లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

Mahindra Sold 52330 Suvs In April 2025 More Details Inside

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 3, 2025, 11:00 [IST]
English summary
Mahindra sold 52330 suvs in april 2025 more details inside check
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+