బిగ్ బ్యాడ్ న్యూస్! ఇకపై ఈ థార్ కార్లను కొనడం కుదరదు.. ఒక్కసారిగా మహీంద్రా షాకింగ్ డెసిషన్!

భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రసిద్ధ వాహన తయారీ కంపెనీగా ఉన్నటువంటి మహీంద్రా నుంచి గతంలో విడుదలైన ఆఫ్‌రోడ్ కింగ్ థార్ దేశీయంగా మంచి ప్రజాధారణ సంపాదించింది. మొదట్లో 3 డోర్ థార్‌ను విడుదల చేసిన కంపెనీ ఈ ఆ తరువాత పెరుగుతున్న వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ ప్రయాణాలకు సైతం అనువుగా ఉండేలా 5 డోర్ థార్‌ను తీసుకువచ్చి తన కస్టమర్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. బలమైన బాడీ రూపం, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, అన్ని రకాల రోడ్లపై కూడా దూసుకుపోయేలా పెర్ఫామెన్స్ కారణంగా గత ఏడాది అత్యుత్తమ కార్ల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం మహీంద్రా మూడు-డోర్ల థార్, ఐదు-డోర్ల థార్ రాక్స్‌ను కలిపి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ రెండింటి ద్వారా కంపెనీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

అయితే ఇప్పుడు మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక సందర్బం ఉంది. థార్ అభిమానులకు ఇప్పుడు ఒక చిన్న బ్యాడ్ న్యూస్. తాజాగా, మహీంద్రా తన 3-డోర్ థార్ మోడల్‌లో ఉన్న కొన్ని వేరియంట్లను నిలిపివేసింది. అయితే, దీనిని పూర్తి స్థాయిలో మార్కెట్ నుంచి తొలగించలేదు. కేవలం కొన్ని నిర్దిష్ట వేరియంట్లను మాత్రమే ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు థార్ 3-డోర్ మొత్తం 19 వేరియంట్లలో అందుబాటులో ఉండేది.

Mahindra Thar

కానీ ఇప్పుడు, కేవలం 11 వేరియంట్లే కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నాయి. గల కొంత కాలంగా తక్కువ అమ్మకాలను నమోదు చేస్తున్న ఎనిమిది వేరియంట్లను మార్కెట్ నుండి ఉపసంహరించాలనే నిర్ణయానికి వచ్చింది. కంపెనీ దృష్టి ఇప్పుడు మధ్యస్థ, టాప్ వేరియంట్లపై స్పష్టంగా కేంద్రీకరించబడింది. ఈ క్రమంలో, కొన్ని అధిక ధరలు ఉన్న మోడళ్లను దశలవారీగా లైనప్ నుంచి తొలగించడం జరిగింది. దీనిలో భాగంగా, AX (O) 4WD కన్వర్టిబుల్ వేరియంట్‌ను తొలగించారు.

అలాగే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన LX AT 4WD కన్వర్టిబుల్ వేరియంట్‌లను నిలిపివేశారు. వీటితో పాటు, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లభించే AX (O) 4WD కన్వర్టిబుల్, 4WD హార్డ్ టాప్, LX 4WD కన్వర్టిబుల్, 4WD హార్డ్ టాప్ OD వేరియంట్లకు కూడా గుడ్‌బై చెప్పేశారు. ఇంకా, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడిన LX AT 4WD హార్డ్ టాప్ OD కనిపించదు.

Mahindra Thar Discontinued

అలాగే, LX AT 4WD కన్వర్టిబుల్ వేరియంట్లను కూడా మళ్లీ చూడలేం. మహీంద్రా తీసుకున్న తాజా నిర్ణయం వారి వ్యూహాత్మక ప్రణాళికలో ఒక భాగంగా తెలుస్తుంది. మరింతగా ప్రజాదరణ పొందిన మోడళ్లపై దృష్టి కేంద్రీకరించడమే లక్ష్యం అని దీనర్థం. కొన్ని మోడళ్లను నిలిపివేసినప్పటికి థార్ లవర్స్‌కు ఇష్టమైన మరిన్ని అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం థార్ మోడళ్ల ధరలు భారతదేశంలో ఎక్స్-షోరూమ్ రూ.11.50 లక్షల నుండి రూ.17.60 లక్షల వరకు ఉన్నాయి.

ఇదిలా ఉంటే మహీంద్రా తన థార్‌ను మరింత కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. 2026లో దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కొత్త తరం థార్ కూడా భారతీయ మార్కెట్లో విశేష ఆదరణ పొందుతుందని కంపెనీ ఆశిస్తోంది. మహీంద్రా థార్ చాలా సేఫ్టీ కారు. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ సాధించింది. దీనిలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS ఉన్నాయి.

Thar Design Price

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 27, 2025, 11:00 [IST]
English summary
Mahindra thar 8 variants discontinued in the market more details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+