షాకుల మీద షాకులు ఇస్తున్న మహీంద్రా కంపెనీ.. ఈ సారి ఆ మోడల్స్ ధరలను పెంచుతూ నిర్ణయం
ఇటీవల కాలంలో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు కస్టమర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా, హోండా, రెనాల్ట్ లు ఏప్రిల్ 1నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాటి దారిలోనే మహీంద్రా తమ మోడల్ శ్రేణిలో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలలో తన పోటీదారులను అధిగమించి మహీంద్రా రెండో స్థానానికి చేరుకుంది.
దీంతో తాజాగా కంపెనీ మరో ధరల పెంపును అమలు చేయడానికిప్రయత్నిస్తుంది. ఏప్రిల్ 2025 నుంచి SUVలు, కమర్షియల్ వెహికల్స్ ధరలను పెంచుతామని మహీంద్రా ప్రకటించి షాక్ ఇచ్చింది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్న వారందరికీ ఇది ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

మహీంద్రా మూడు శాతం వరకు ధరల పెరుగుదల ఉంటుందని ప్రకటించింది. దేశంలోని ప్రముఖ యుటిలిటీ వాహన తయారీదారుల్లో ఒకటైన ఆ కంపెనీ ఇన్ పుట్ ఖర్చులు పెరగడం, అలాగే ముడి వస్తువుల ధరలు పెరగడం వల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. మోడల్, వేరియంట్ ఆధారంగా వివిధ ఎస్‌యూవీలు, కమర్షియల్ వెహికల్స్ ధరల పెంపు రేంజ్ మారుతుందని మహీంద్రా తెలిపింది.
ఇప్పటికే జనవరిలో కంపెనీ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరోసారి మహీంద్రా ఈ ఏడాది ధరలను పెంచుతోంది. ఇది బ్రాండ్ లైనప్‌లోని అన్ని మోడళ్లపై ప్రభావం చూపుతుంది. ఇందులో ICE మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ BE 6, XEV 9e కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా, హోండా, బీఎండబ్ల్యూ కొత్త ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపును ప్రకటించాయి.

మహీంద్రా ఇండియాలో XUV 3XO, బొలెరో, బొలెరో నియో, థార్, థార్ రాక్స్, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో N, XUV700 వంటి ఎస్యూవీలను విక్రయిస్తుంది. కంపెనీ ఇటీవలే మహీంద్రా XUV700 ఎబోనీ ఎడిషన్‌ను కూడా రిలీజ్ చేసింది. మార్చిలో కంపెనీ XUV700 ఎస్యూవీ ఆఫ్షన్ చేసిన వేరియంట్ల ధరలను తగ్గించింది. ఆ బ్రాండ్ ధరను దాదాపు రూ. 75,000 తగ్గించింది.
ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ కొనాలని చూస్తున్న వారికి ఇది సంతోషాన్ని అందించింది. కంపెనీ XUV700ని MX, AX3, AX5 S, AX5, AX7, AX7 L వేరియంట్లలో విక్రయిస్తోంది. కంపెనీ టాప్ వేరియంట్లైన AX7, AX7 L మోడళ్ల ధరలను మాత్రమే తగ్గించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మహీంద్రా పెట్రోల్ ఆటోమేటిక్ 7-సీటర్, డీజిల్ ఆటోమేటిక్ 7-సీటర్ ఆప్షన్లలో వచ్చే AX7 ధరలను సుమారు రూ.45వేల మేర తగ్గించింది.

డీజిల్ మాన్యువల్ 7-సీటర్, పెట్రోల్ ఆటోమేటిక్ 7-సీటర్, డీజిల్ ఆటోమేటిక్ 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో వచ్చే మహీంద్రా XUV700 ఎస్యూవీ AX7 L వేరియంట్లపై రూ.75వేల ధర తగ్గింపు లభిస్తోంది. సవరించిన ధర ప్రకారం, కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ AX7 సిరీష్, ఎక్స్-షోరూమ్ ధర రూ.19.49 లక్షల నుంచి రూ.24.18 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది.
XUV700 లైన్‌ను మరింత ఎట్రాక్టివ్‌గా మార్చడానికి ప్రారంభించబడిన ఎబోనీ ఎడిషన్ కూడా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. AX7 L వేరియంట్‌పై నిర్మించబడిన ఈ కారును కంపెనీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్లలతో 7-సీటర్ మోడల్‌గా మాత్రమే విడుదల చేసింది.

XUV700 ఎబోనీ ఎడిషన్‌లో బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్, బ్లాక్ గ్రిల్ ఇన్సర్ట్‌లు, బ్లాక్ రియర్‌వ్యూ మిర్రర్స్, 18-ఇంచుల బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఇంటీరియర్‌లో బ్లాక్ లెథరెట్ అప్హోల్స్టరీ, బ్రష్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, సెంటర్ కన్సోల్, డోర్ ప్యానెల్‌లపై సిల్వర్ యాక్సెంట్లు, డార్క్ క్రోమ్ ఎయిర్ వెంట్స్ , గ్రే-ఫినిష్డ్ రూఫ్ లైనర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








