కార్ల తయారీలో కొత్త విప్లవం.. మహీంద్రా కొత్త ప్లాట్‌ఫారమ్ ఫ్రీడమ్ ఎన్ యూ .. ఆగస్టు 15న లాంచ్

మహీంద్రా ఆటో కంపెనీ రాబోయే ఆగస్టు 15న తమ సరికొత్త కార్ల తయారీ ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై భవిష్యత్తులో వచ్చే మహీంద్రా కార్లన్నీ తయారవుతాయి. అసలు ఈ ప్లాట్‌ఫారమ్ ఏంటి, దాని విశేషాలు ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం మహీంద్రా కంపెనీ వివిధ రకాల కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్లన్నీ ప్రస్తుతం భారత రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్నాయి. మహీంద్రా BE రేల్-ఈ, XUV3XO ఈవీ, 2025 స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్, XUV700 ఫేస్‌లిఫ్ట్, XEV 7e, కొత్త బొలెరో వంటి కార్లను ఆ కంపెనీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. కంపెనీ ప్లాన్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒక్కో కారును మార్కెట్‌లోకి తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.

Freedom NU

ఈలోగా మహీంద్రా కంపెనీ సీక్రెట్‎గా ఒక కొత్త పని చేసింది. అదేంటంటే, భవిష్యత్తులో వాహనాలను తయారు చేయడానికి ఒక కొత్త ప్లాట్‌ఫారమ్‌ను డెవలప్ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఆగస్టు 15న కంపెనీ పరిచయం చేయబోతోందని ప్రస్తుతం విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను మహీంద్రా కంపెనీ New Features Architecture అని పిలుస్తోంది. ఈ ఆర్కిటెక్చర్‌కు మహీంద్రా కంపెనీ Freedom NU అని పేరు పెట్టినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

ఈ టీజర్‌ను మహీంద్రా కంపెనీ కంబషన్ ఇంజిన్ సెగ్మెంట్ పంచుకుంది. కానీ, టీజర్‌లో ఎలక్ట్రిక్ విభాగం లోగో కూడా ఉంది. దీని ద్వారా ఈ ప్లాట్‌ఫారమ్‌ను కంబషన్ ఇంజిన్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటినీ తయారు చేయగల విధంగా డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 15న రాబోతుంది.

Freedom NU

ఇంకా ఈ టీజర్‌ను జాగ్రత్తగా గమనిస్తే అందులో 4 రంగుల్లో పొడవైన గీతలు కనిపిస్తున్నాయి. ఇది ఈ ప్లాట్‌ఫారమ్‌పై 4 రకాల ఇంధన వాహనాలను తయారు చేయడానికి వీలవుతుందని సూచిస్తున్నట్లు ఉంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వంటి వాహనాలను ఈ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ముందుగా బొలెరో లేదా థార్ కార్లు తయారు అవుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ లేదు. 2026 చివరిలో మాత్రమే దీనిపై ఉత్పత్తి ప్రారంభమవుతుంది కాబట్టి, కాలక్రమేణా మహీంద్రా కంపెనీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా కంపెనీ హైబ్రిడ్ ఇంజిన్‌ను డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. మహీంద్రా కంపెనీ దీన్ని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ వాహనాలను తయారు చేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్, కంబషన్ ఇంజిన్ వాహనాల మధ్య ఉన్న అంతరాన్ని పూరిస్తుందని అంచనా వేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, వివిధ ఇంధన ఆప్షన్లలో వాహనాలు అవసరం. దీన్ని అర్థం చేసుకుని మహీంద్రా కంపెనీ ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. దీని లాంచ్ సమయంలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇది భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కీలక మార్పును తీసుకురాగలదు.

More from DriveSpark

Article Published On: Friday, June 27, 2025, 12:45 [IST]
English summary
Mahindra to unveil new car platform on august 15 what does freedom nu mean for future cars
Read more on: #mahindra #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+