కొత్త కారు కొనాలా? కాస్త ఆగండి.. మహీంద్రా నుంచి ఏకంగా 6 సూపర్ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

భారతీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) మారుతున్న కాలానికి అనుగుణంగా ఐసీఈ ఇంజిన్‌ కార్లను తయారు చేస్తునే మరోవైపు ఎలక్ట్రిక్ విభాగాంపై కూడా కీలకంగా దృష్టి సారించింది. భారత ఆటోమొబైల్ మార్కెట్ అత్యంత లాభదాయకంగా ఉండటంతో అంతర్జాతీయంగా ఈవీ తయారీదారులుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీలు టెస్లా, బీవైడీలు తమ మార్కెట్‌ను ఇండియాలో పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాకు చెందిన ఈవీ తయారీదారు బీవైడీ కంపెనీ ఇప్పటికే దేశంలో ఉనికిని కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా టెస్లా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతటి పోటీ ఉన్న తరుణంలో మహీంద్రా భారతీయ వినియోగదారులకు స్వదేశీ కంపెనీ నుంచి ఇక్కడే తయారైన వాహనాలను అందివ్వడానికి కీలకంగా ప్రణాళికలు రచించి త్వరలో కొత్త ఎలక్ట్రిక్ SUV కార్లను విడుదల చేయాలని చూస్తుంది.

రానున్న రోజుల్లో అంతర్గత దహన ఇంజిన్ మోడళ్లతో పాటు కొత్త ఎలక్ట్రిక్ SUV లతో మార్కెట్‌ను మరింత వెడెక్కించనుంది. గతంలో మహీంద్రా కొత్త ఈవీలను విడుదల చేయగా, అవి బాగా సక్సెస్ కావడంతో మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. మహీంద్రా ఇటీవలి నెలల్లో BE6, XEV 9e ఎలక్ట్రిక్ SUVలను లాంచ్ చేసింది. ఇవి తక్కువ కాలంలోనే వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన అందుకున్నాయి.

Mahindra Upcoming Electric Suvs

తాజాగా ఈ కార్లను బుకింగ్ చేసుకున్న కస్లమర్లకు క్రమంగా డెలివరీలను సైతం అందిస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుకుని పలువురు సెలబ్రిటీల వరకు కూడా ఈ కార్లను కొనుగోలు చేశారు. దాంతో ఈవీలకు డిమాండ్‌ పెరగడంపై అప్రమత్తమైన మహీంద్రా BE, XEV సిరీస్‌ల కింద మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV లు మహీంద్రాను భారత EV మార్కెట్‌లో కీలక కంపెనీగా నిలిపే అవకాశం ఉంది.

ఇక నుంచి మహీంద్రా మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ విభాగంలో తన ప్రభావాన్ని పెంచేందుకు సిద్ధమవుతోంది. తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV లైనప్‌ను క్రమంగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అప్‌గ్రేడ్ చేసి విడుదల చేయాలని చూస్తుంది. ICE SUV లేనటువంటి బోలెరో, స్కార్పియో, థార్ వంటి లెజెండరీ కార్లను లక్ట్రిక్ వెర్షన్‌లుగా మార్చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 6 ఈవీలను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

Mahindra Upcoming Xev 7e Ev

మహీంద్రా XEV 7e (Mahindra XEV 7e) కారును ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ కారు ఫోటోలు మాత్రం ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఇది XUV.e8 కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఇది మరింత ఫ్యుచరిస్టిక్, ఎయరోడైనమిక్ లుక్‌ను అందిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ SUV ఫాస్ట్-ఛార్జింగ్, ఎక్కువ ఎఫిషియన్సీని సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పూర్తి ఛార్జ్‌తో 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది. కారు స్టైలిష్ లుక్ కోసం క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, మెరుగైన ఎయిరో డైనమిక్స్ కోసం ప్రత్యేకమైన స్టార్-ప్యాటర్న్ ఏరో వీల్స్, ఫ్యూచరిస్టిక్ టచ్‌కు మహీంద్రా సరికొత్త లోగో, ప్రయాణికుల సేఫ్టీ కోసం లెవల్ 2 ADAS+ సూట్‌, ఇంటీరియర్‌లో అందమైన క్యాబిన్ ఉంటాయి.

Mahindra Xuv 3xo Ev Upcoming

మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 ఈవీ (Mahindra XUV 3X0 EV)ని రాబోయే నెలల్లో మార్కెట్లోకి లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇది సరికొత్తగా అప్‌డేట్ చేసిన ఫాసియా, ట్వీక్డ్ గ్రిల్, బంపర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 400 కి.మీ డ్రైవింగ్ రేంజ్ అందించే అవకాశముంది. ఈ కారు ADAS సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరిన్నింటిని కలిగి ఉంటుంది.

మహీంద్రా రాబోయే XUV 3XO EVలో కేవలం లాంగ్-రేంజ్ మాత్రమే కాదు, అత్యాధునిక భద్రతా ఫీచర్లను కూడా అందించనుంది. స్పీడ్ అలర్ట్ సిస్టమ్, EBDతో కూడిన ABS, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వంటి వాటితో ఇది అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ వంటి మోడళ్లకు పోటీగా నిలవనుందని తెలుస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Mahindra Upcoming Thar Ev

7-సీటర్ మహీంద్రా BE సిరీస్ EV:మహీంద్రా తన స్వంత INGLO స్కేట్‌బోర్డ్ EV ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రిక్ SUV లను అభివృద్ధి చేస్తోంది. బీఈ మోడల్ సక్సెస్ కావడంతో దానికి కొనసాగింపుగా ఇదే సిరీస్‌లో మరిన్ని కార్లను విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది. దీనిలో పెద్ద బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి అనువుగా 7 సీటర్ కారును రానున్న రోజుల్లో విడుదల చేయవచ్చు.

2024 ఏడాదిలో ఉత్తమ కారు అవార్డును సొంతం చేసుకున్న ఆఫ్‌రోడ్ కింగ్ థార్ రాక్స్‌ను కంపెనీ ఇప్పటి వరకు ఐసీఈ ఇంజిన్ ఆప్షన్‌లో అందించగా, త్వరలో ఈ దీన్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా విడుదల చేయడానికి మహీంద్రా తన పనులు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ థార్‌ను 2026 నాటికి ఇండియాలో విడుదల చేయవచ్చని సమాచారం. ఇది థార్.ఇ(Thar.e)లో 75kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించబోతున్నారని తెలుస్తుంది.

ఇది సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అంచనా ప్రకారం ఆఫ్‌రోడ్ కింగ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రారంభ ధర దాదాపు రూ.20 నుంచి రూ.25 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర పైనే ఉండే అవకాశం ఉంది.ఇంటర్నెట్‌లో థార్.ఇ పేటెంట్ ఫోటోలు లీక్ కావడంతో, ఈ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇది డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా ప్రసిద్ధ suv మోడళ్లు స్కార్పియోతో పాటు బొలెరో కారును కూడా ఈవీ వెర్షన్‌లో తీసుకురాబోతుంది. Scorpio.e, Bolero.e లు వాటి ఆఫ్-రోడ్ సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేలా ఉంటాయి. అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు, ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్‌తో మరింత పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, డజన్ల కొద్ది అత్యాధునిక ఆప్షన్లు, ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యుత్తమ ప్రమాణాలతో ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 28, 2025, 17:15 [IST]
English summary
Mahindra upcoming top 6 electric suvs in india xev 7e xuv 3xo thar e more details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+