డిజైన్ చూస్తే రెట్రో.. ఫీచర్లు చూస్తే మెట్రో..మహీంద్రా నుంచి మినీ బాహుబలి వస్తున్నాడు
భారతీయ రోడ్లపై రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీలకు కేరాఫ్ అడ్రస్ మహీంద్రా. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి వస్తున్న సరికొత్త మోడల్ 'మహీంద్రా విజన్.ఎస్' (Mahindra Vision.S) ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు తాజాగా టెస్టింగ్ చేస్తూ రోడ్లపై కనిపించడంతో కార్ల ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది.
మహీంద్రా (Mahindra) కంపెనీ ఆగస్టు 2025 లో ఆవిష్కరించిన ఫ్రీడమ్ ఎన్.యు (Freedom_NU) ప్లాట్‌ఫామ్ పై రూపొందిస్తున్న కొత్త కాన్సెప్ట్ మోడల్ మహీంద్రా విజన్.ఎస్ SUV తాజాగా భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ విజన్.ఎస్ మోడల్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవు (Sub-4 Meter) కలిగి ఉండే అవకాశం ఉంది.

2027 ప్రారంభంలో ఈ కారును విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. విజన్.ఎస్ అనేది మహీంద్రా ప్రదర్శించిన నాలుగు కాన్సెప్ట్ మోడల్స్‌లో (Vision.S, Vision.T, Vision.X, Vision.SXT) ఉత్పత్తికి దగ్గరగా ఉన్న మొట్టమొదటి మోడల్. టెస్టింగ్ వేగంగా జరుగుతుండటం చూస్తుంటే, ఈ SUV అనుకున్న సమయానికి మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
టెస్టింగ్ సమయంలో కనిపించిన మోడల్‌ను పరిశీలిస్తే, విజన్.ఎస్ చాలా ధృడమైన, బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ప్రత్యేకించి, వెనుక భాగంలో అమర్చిన స్పేర్ వీల్, నిటారుగా ఉండే టెయిల్‌ల్యాంప్‌లు ఈ SUV కి మరింత రగ్గడ్ లుక్‌ను ఇస్తున్నాయి. ముందు భాగంలో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌లు, రెట్రో-ఆధునిక స్లాట్ గ్రిల్ డిజైన్‌తో పాటు, ఇది ఎత్తైన బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ కారు స్కార్పియో-ఎన్ (Scorpio-N) మాదిరిగా లాడర్-ఫ్రేమ్ (Ladder-Frame) చట్రం కాకుండా, మోనోకోక్ (Monocoque) ఫ్రీడమ్_ఎన్.యు (nu_IQ) ఆర్కిటెక్చర్‌పై నిర్మితమవుతుంది. ఈ SUV పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ (Petrol, Diesel and Electric) ఇంజిన్ ఆప్షన్‌లను పొందుతుందని మహీంద్రా ఇప్పటికే ధృవీకరించింది. ఇంజిన్, డ్రైవ్‌ట్రైన్ ఎంపికల గురించి పూర్తి వివరాలు విడుదల సమయానికి ప్రకటించబడతాయి.
{video1}
విజన్.ఎస్ ఇంటీరియర్‌లో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లతో కూడిన టెక్నాలజీ-కేంద్రీకృత క్యాబిన్‌ను (Technology-Centric Cabin) ఆశించవచ్చు. సౌకర్యం, కార్యాచరణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రీమియం క్యాబిన్‌ను రీడిజైన్ చేశారు. నగరం, ఆఫ్-రోడ్ రైడింగ్‌లను ఇష్టపడే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని, లగ్జరీతో పాటు రగ్గడ్ యుటిలిటీకి ప్రాధాన్యతనిచ్చి ఈ కారును తయారు చేస్తున్నారు.

ఈ కొత్త సబ్-4 మీటర్ SUV మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి బ్రెజా (Maruti Brezza) వంటి పోటీదారులకు గట్టి సవాలు విసరనుంది. పోటీతత్వ ధర, ప్రాక్టికాలిటీ, రగ్గడ్ లుక్‌తో ఈ సెగ్మెంట్‌లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
విజన్.ఎస్ తరువాత, విజన్.ఎస్ఎక్స్టీ, విజన్.టి, విజన్.ఎక్స్ వంటి విభిన్న బాడీ డిజైన్‌లు కలిగిన ఇతర కాన్సెప్ట్ మోడల్స్‌ను కూడా కంపెనీ వరుసగా విడుదల చేయనుంది. ఈ మోడల్స్ అన్నీ ఒకే మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడతాయి. మహీంద్రా నుంచి రాబోతున్న కొత్త ఎస్‌యూవీ విజన్.ఎస్ టెస్టింగ్ దశలో కనిపించింది. లుక్ అదిరిపోయింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో రానుంది.


Click it and Unblock the Notifications








