ఫిదా చేసే ఫీచర్లతో రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఆరుగురు హాయిగా ప్రయాణించొచ్చు!
జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పో కోసం.. ఆటోమొబైల్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. వాహన తయారీ సంస్థలు కూడా తమ కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు గట్టి ప్లాన్స్‌తో వస్తోంది. తమ బ్రాండ్ నుంచి కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. ఈసారి ఆ సంస్థ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పోర్ట్ ఫోలియోను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సంస్థ నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా XEV 7e ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. ఈ కారు విశేషాలేంటి, ఇది మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
మహీంద్రా XEV 7e కారు భారత మార్కెట్లోకి ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది. అందుబాటు ధరలో దీన్ని తీసుకువచ్చేందుకు మహీంద్రా సంస్థ ప్రయత్నిస్తోంది. మహీంద్రా XEV 9e కంటే తక్కువ ధరలో దీన్ని తీసుకురానున్నారు. మిడ్- ప్రీమియం కార్లలో మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న కార్లలో XEV 7eని కీలకమైనదిగా చెప్పవచ్చు.

మహీంద్రా సంస్థ ఇప్పటికే తమ కంపెనీ నుంచి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన BE 6, XEV 9e లను విడుదల చేసి ఆకట్టుకుంది. ఈ రెండు కార్లు INGLO ప్లాట్‌ఫామ్‌తో 59kwh బ్యాటరీ ఆప్షన్లలో ఉంటాయి. రానున్న సంవత్సరాల్లో BE, XEVలకు సంబంధించి మరిన్ని మోడల్స్‌ను తీసుకురానంది మహీంద్రా సంస్థ. ఇక XEV 7e కారు డిజైన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది XUV.e8 కాన్సెప్ట్ మోడల్ వలె ఉండనుంది.
ముఖ్యంగా ఇందులోని రూఫ్ లైన్, sillhoute లుక్ తమ ICE వాహనమైన XUV 700ని పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కొత్త మోడల్ కారులో రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉండనుంది. దీనిపై ఆకర్షణీయమైన మహీంద్రా లోగో అమర్చి ఉంటుంది. దీంట్లో star- shaped aero wheels, improved lower front bumper తో దీని ఎక్స్టీరియర్‌లో చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ కారును 6- సీటర్ లేఔట్‌తో తీసుకురానున్నారు.
ఈ కొత్త మోడల్ కారులో.. మిడిల్ రోలో కెప్టెన్ సీట్స్ ప్రవేశపెట్టారు. ఇది లగ్జరీ, కంఫర్ట్ ఫీల్ అందించనుంది. XEV 9e తరహాలో ఉండే ఇంటీరియర్ డిజైన్ ఈ కొత్త కారులో ఉండన్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 16- స్పీకర్ ఆడియో సిస్టం, లెవెల్ 2 ADAS- suite, two-spoke స్టీరింగ్ వీల్, హెడ్- అప్ డిస్ ప్లే (HUD), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి.
ఈ కొత్త మోడల్ కారు.. 59 kwh బ్యాటరీ ప్యాక్‌తో ఉండనుంది. దీంట్లో BYD's LFP సెల్స్ వినియోగించనున్నారు. మహీంద్రా XEV 7e కారుతో మహీంద్రా సంస్థ భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంలో దృష్టి సారించిందని తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో స్టైలిష్ డిజైన్లతో వాహనాలను తీసుకువస్తూ EV మార్కెట్లో పోటీని పెంచుతోంది. ఈ కొత్త మోడల్ కారుతో మహీంద్రా ఈవీల ప్రస్థానంలో మరో మైలురాయిగా మారనుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








