దేశం ఎదురుచూస్తున్న క్షణం! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 656 కి.మీల కారును అందుకుంటున్న కస్టమర్లు
ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏ మేరకు ఉందో ఇటీవల కాలంలో జరుగుతున్న సేల్స్‌ను చూస్తేనే తెలిసిపోతుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈవీ తయారీలో పేరుగాంచిన అన్ని కంపెనీలు వరుసగా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా (Mahindra), భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అమెరికా ప్రముఖ ఈవీ తయారీ సంస్థ టెస్లా భారతదేశానికి రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో టెస్లా ఇక్కడ అడుగుపెట్టి భారత రోడ్లపై విదేశీ ఎలక్ట్రిక్ కార్లను పరిగెత్తించాని చూస్తుంది. అయితే టెస్లాకు పోటీగా స్వదేశీ వాహన తయారీ కంపెనీ దాని కంటే ముందుగా లోకల్‌గా తయారు చేసిన ఎలక్ట్రిక్ SUVలు BE6, XUV 9E లను తీసుకొచ్చింది.
దేశీయ మార్కెట్లో మన సొంత కార్లను విడుదల చేసి ఒక్కసారిగా టెస్లాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ రెండు కార్లను మహీంద్రా విడుదల చేసింది. టెస్లా సైబర్‌ట్రక్‌కు పోటీగా కనిపించే ఈ రెండు విదేశీయులను కూడా ఆకర్షించాయి. కొద్ది రోజుల క్రితం వీటి బుకింగ్స్ ప్రారంభించగా, రికార్డు స్థాయిలో ప్రజల నుంచి డిమాండ్ సాధించాయి.

చాలా కాలంగా ఎదురు చూస్తున్న మహీంద్రా XUV 9E ఎలక్ట్రిక్ SUV డెలివరీలను ప్రారంభించి కస్టమర్ల ముఖంలో సంతోషాన్ని నింపింది. గత నెలలో బుకింగ్ ప్రారంభించిన తరువాత బుకింగ్ చేసిన తొలి బ్యాచ్ కస్టమర్లకు వాహనాలను అందజేయడం ప్రారంభించడంతో మార్కెట్లో దీని క్రేజ్ మరింత పెరిగింది. ఈ కారును సాధారణ ప్రజల నుంచి మొదలుకుని చాలామంది సెలబ్రిటీలు కూడా బుక్ చేసుకున్నట్లు సమాచారం.
మహీంద్రా కంపెనీ తన ప్రసిద్ధ XUV 9E ఎలక్ట్రిక్ SUVని ఒక కుటుంబానికి అందజేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ వీడియోను వేద్ ప్రకాష్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. క్రమంగా బుకింగ్ చేసుకున్న వారికి కారును డెలివరీ చేయడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. మహీంద్రా XUV 9E ఎలక్ట్రిక్ SUV ధర, ఇతర వివరాలు చూసినట్లయితే ఇది రూ.21.90 లక్షల నుంచి రూ.30.50 లక్షల వరకు లభిస్తుంది.

పైన పేర్కొన్న ధరలు ఎక్స్ షోరూమ్‌వి. ఆన్‌రోడ్ వచ్చేసి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. దీని బేస్ వేరియంట్ 59 kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇది 228 bhp పవర్, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 542 కి.మీ.ల దూరం వరకు ఛార్జ్ కోసం ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
ఇది 282 Bhp పవర్, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 656 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన బ్యాటరీతో ఈ SUV అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది డజన్ల కొద్ది ఫీచర్స్‌ను కలిగి ఉంది. లోపల 12.30-అంగుళాల స్క్రీన్, వెనుక సీటు ప్రయాణీకులకు స్క్రీన్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఇంకా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ ఆడియో సిస్టమ్, ట్విన్-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫీచర్లు, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2+ ADAS, 360-డిగ్రీ కెమెరా, సీట్ వెంటిలేషన్‌తో లెథరెట్ అప్హోల్స్టరీ, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








