ఇన్నోవాను ఎదుర్కొనే మొనగాడు వచ్చేశాడు.. కిలోమీటర్‌కు రూ.1.2 ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం లాంగ్ జర్నీ చేయొచ్చు

భారతీయ కస్టమర్లలో భారీ అంచనాలను పెంచిన మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ (Mahindra XEV 9S) కారు ఇటీవల అధికారికంగా మార్కెట్‌లో విడుదలైంది. ఇది 7-సీటర్ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (7 Seater Electric SUV) రకానికి చెందినది. ఈ కారులో మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. అవి 59 kWh, 70 kWh, 79 kWh.

కంపెనీ ప్రకటించిన డ్రైవింగ్ రేంజ్ వివరాలు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి: 59 kWh బ్యాటరీతో 521 కి.మీ, 70 kWh బ్యాటరీతో 600 కి.మీ, అత్యధికంగా 79 kWh బ్యాటరీతో ఏకంగా 679 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.95 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.29.45 లక్షలుగా ఉంది.

Mahindra XEV 9S 7-Seater Electric SUV Launched Offers 679 km Range and Very Low Running Cost

మహీంద్రా XEV 9S అతిపెద్ద ఆకర్షణ దాని రన్నింగ్ కాస్ట్. మహీంద్రా సంస్థ అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక కిలోమీటర్ నడపడానికి కేవలం రూ.1.2 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన సుమారు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రయాణించడానికి అయ్యే మొత్తం ఖర్చు కేవలం రూ.334 మాత్రమే.

ఈ కారులో ఏడుగురు ప్రయాణించవచ్చు కాబట్టి, ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు దాదాపు రూ.48 మాత్రమే అవుతుంది. ఈ తక్కువ నిర్వహణ ఖర్చు, డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచే టయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తూ కుటుంబ ప్రయాణాలకు XEV 9Sను అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుపుతోంది.

Mahindra XEV 9S 7-Seater Electric SUV Launched Offers 679 km Range and Very Low Running Cost

భద్రత పరంగా, మహీంద్రా XEV 9S అత్యాధునిక ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో లెవెల్ 2 ఏడీఏఎస్ (ADAS - Advanced Driver Assistance Systems) భద్రతా ప్యాకేజీ ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ముఖ్యమైనవి.

అదనంగా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరాతో కూడిన బ్లైండ్ వ్యూ మానిటర్ వంటివి ఉన్నాయి. ఇతర సౌకర్యాల విషయానికి వస్తే, కారు డాష్‌బోర్డ్‌లో మూడు పెద్ద 12.3 అంగుళాల డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్యాసింజర్ డిస్‌ప్లే), పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

Mahindra XEV 9S 7-Seater Electric SUV Launched Offers 679 km Range and Very Low Running Cost

అత్యంత తక్కువ నిర్వహణ ఖర్చు, అడ్వాన్సుడ్ ఫీచర్ల కారణంగా భారతీయ వినియోగదారులలో ఈ కారుపై భారీ ఆసక్తి నెలకొంది. మహీంద్రా సంస్థ ఈ కారును జనవరి 5వ తేదీ నుండి టెస్ట్ డ్రైవ్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

జనవరి 14వ తేదీ నుండి ఈ కారుకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభం కానుంది. ఆ తరువాత జనవరి 23వ తేదీ నుంచి కస్టమర్లకు డెలివరీ చేసే పనులు ప్రారంభమవుతాయి. డిజైన్, రేంజ్, తక్కువ రన్నింగ్ కాస్ట్ కారణంగా మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్‌లో భారీ విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, December 7, 2025, 7:36 [IST]
English summary
Mahindra xev 9s 7 seater electric suv launched offers 679 km range and very low running cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+