ఎంత పెద్ద ఫ్యామిలీ అయిన లాంగ్ జర్నీలకు నో టెన్షన్.. మహింద్రా పెద్ద ఎలక్ట్రిక్ కారు వచ్చేసిందోచ్
Mahindra XEV 9S : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా బెంగళూరులో నిర్వహించిన స్క్రీమ్ ఎలక్ట్రిక్ అనే కార్యక్రమంలో తమ కొత్త తరం ఎలక్ట్రిక్ కారు మహింద్రా XEV 9Sను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో 3-వరుసల సీట్లు (7 సీటర్) ఉండే కార్ల సెగ్మెంట్‌లో తొలిసారిగా ఒక ఎలక్ట్రిక్ కారు రంగంలోకి దిగుతుండటంతో, దీనిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పెద్ద ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణించే కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ XEV 9S కారు పెట్రోల్ కార్లకు గట్టి పోటీ ఇచ్చి, పెద్ద ఎత్తున అమ్ముడవుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కారు XUV 700 డిజైన్‌ను, XUV.e8 కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని INGLO ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఇందులో ఉన్న S అనేది Space(స్పేస్)ని సూచిస్తుంది.

మహింద్రా ఈ XEV 9S కారు సగటున 500 కి.మీ రేంజ్ ఇస్తుందని ప్రకటించింది. వివిధ నగరాల్లో టెస్ట్ చేసిన తర్వాత ఉదాహరణకు చెన్నైలో ఇది 488 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి 59kWh, 70kWh, 79kWh.
79kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 210kW (సుమారు 281 hp) పవర్‌ను, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 202 కిమీ వరకు ఉంటుంది. అన్ని వేరియంట్లు కూడా రియర్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉంటాయి. 175kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. దీని కొలతలు చూస్తే, 4,929ఎంఎం పొడవు, 1,964ఎంఎం వెడల్పు, 1,745ఎంఎం ఎత్తు, 2,762ఎంఎం వీల్‌బేస్‌తో చాలా పెద్దదిగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 219ఎంఎంగా ఉంది.
ఈ కారులో అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. ఇది కేవలం 15 మిల్లీసెకన్లలో స్పందిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, XEV 9S ప్రారంభ వేరియంట్ (Pack One Above - 59kWh) ధర రూ.19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

టాప్ వేరియంట్ (Pack Three Above - 79kWh) ధర రూ.29.45 లక్షలు వరకు ఉంది. పెట్రోల్ కార్ల ధరలకే ఈ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ XEV 9S కారు ఫీచర్లలో, సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారు ADAS లెవెల్ 2+ ఫీచర్‌తో పాటు, డ్రైవర్‌ను, ముందు ప్రయాణీకుడిని పర్యవేక్షించే DOMS (Driver Monitoring System), VisionX ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్అప్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయి.
ఇంటీరియర్‌లో డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్, ప్రయాణీకుల కోసం మూడు పెద్ద 31.24 సెం.మీ. డిస్‌ప్లేలు ఉండడం దీని ప్రత్యేక ఆకర్షణ. ఈ కారును నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ.1.2 మాత్రమే ఖర్చు అవుతుందని, మెయింటెనెన్స్ ఖర్చు కిలోమీటర్‌కు 40 పైసలు మాత్రమే ఉంటుందని మహీంద్రా తెలిపింది.
వెనుక సీట్లలో ప్రయాణికులకు కూడా డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 5G కనెక్టివిటీ వంటి అదనపు ఆకర్షణలు ఉన్నాయి. మూడవ వరుస సీట్లు మడిచినప్పుడు 527 లీటర్ల బూట్ కెపాసిటీ, అదనంగా 150 లీటర్ల ఫ్రంక్ (ముందు భాగంలో స్టోరేజ్) లభిస్తుంది.

ఈ కారు కోసం డిసెంబర్ 14, 2025 నుంచి ఎంపిక చేసుకోవచ్చు. జనవరి 5, 2026 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు, జనవరి 14 నుంచి బుకింగ్‌లు, జనవరి 23 నుంచి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ కారు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఇన్నోవా, XUV 700లాంటి కార్లకు గట్టిపోటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








