అమ్మకాల్లో దీనికి సాటి లేదు.. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏడాది ఆగాల్సిందే.. ఇంతకీ ఏంటా మోడల్

గత కొన్నేళ్లుగా దేశీయ ఆటో మార్కెట్లో ఎస్ యూవీలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ మాత్రమే 52శాతం వాటాను కలిగి ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే ప్రముఖ దేశీయ కార్ల కంపెనీ మహీంద్రా కొన్ని నెలల క్రితం తన ఫేమస్ ఎస్‎యూవీ XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. దీనికి అద్భుతమైన డిమాండ్ వస్తోంది.

అప్‌గ్రేడ్ XUV 300కు కొత్త వెర్షన్ పేరు మహీంద్రాగా XUV 3XOగా కంపెనీ మార్చింది. మహీంద్రా XUV 300 ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌, ఫీచర్ల పరంగా భారీ మార్పులు చేస్తూ అప్‌డేటెడ్ వెర్షన్‌గా తీసుకువచ్చింది. ధర, ఇంజిన్‌, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియాలో సబ్-4 మీటర్ SUV విభాగంలో భారీ డిమాండ్ ఉన్న మహీంద్రా XUV.

Mahindra XUV 3XO Front

ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఇప్పుడు వేరియంట్‌ను బట్టి ఒక సంవత్సరం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. దీని అర్థం ఈ SUV బేస్ వేరియంట్ (MX1)కు అధిక డిమాండ్‌ ఉంది. మార్చి 2025 నాటికి ఈ కారుకు 52 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది మహీంద్రా సబ్-4 మీటర్ SUV కోసం గతంలో కంటే ఎక్కువ సమయం వెయిటింగ్ పిరియడ్ సూచిస్తుంది.

Take a Poll

దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 1.2లీటర్ TGDI టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 130పీఎస్ పవర్, 250ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 110 పీఎస్ పవర్, 200ఎన్ఎం పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేయగలదు. అదనంగా, ఈ కారులో డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లు కూడా ఉన్నాయి.

Mahindra XUV 3XO Front Style

దీని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117పీఎస్ పవర్, 300ఎన్ఎం పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త XUV 3XO వేరియంట్‌ను బట్టి 6-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే ఇది లీటరుకు 17.96 నుండి 21.2కిలో మీటర్ల వరకు మైలేజీ2ని అందిస్తుంది.

కొత్త మహీంద్రా XUV3XOలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డిస్ప్లేలు (10.25-ఇంచులు), డ్యూయల్-జోన్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో సహా అనేక రకాల ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6ఎయిర్ బ్యాగులు, లేటెస్ట్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఉన్నాయి.

Mahindra XUV 3XO Inner

మహీంద్రా XUV3XO కస్టమర్లను ఆకర్షించే డజన్ల కొద్దీ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధర విషయానికి వస్తే రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కంపెనీ నిర్ణయించింది. ఇది డీప్ ఫారెస్ట్ , డ్యూన్ బీజ్‌తో సహా వివిధ రంగులలో కూడా లభిస్తుంది.

5-సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉన్న ఈ సబ్-4 మీటర్ మహీంద్రా XUV 3XO SUV, మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి మోడల్స్ కు గట్టి పోటీని అందిస్తుంది. ఇది ప్రధానంగా మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఎస్‎యూవీల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.

మహీంద్రా XUV 3XO ఇతర వేరియంట్స్ కోసం వెయిటింగ్ పిరియడ్ విషయానికి వస్తే MX 2, MX 2 Pro, MX 3, MX 3 Pro వేరియంట్స్ కు ఇప్పుడు 10 వారాల వెయిటింగ్ పిరియడ్ ఉంది. AX 5 వేరియంట్ ఎనిమిది వారాల వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. మిగతా అన్ని వేరియంట్లకు రెండు వారాల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 14:00 [IST]
English summary
Mahindra xuv 3xo a high demand suv with a waiting period of one year
Read more on: #india #mahindra #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+