పేరు మారింది..అదృష్టం తిరిగింది..4 లక్షల కుటుంబాలకు చేరిన మహీంద్రా మొనగాడు

మహీంద్రా కంపెనీ తయారు చేసిన ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీ అయిన XUV300 మోడల్ మొదట్లో మార్కెట్‌లో అంతగా రాణించలేకపోయింది. ఈ కారు సేఫ్టీ విషయంలో, పర్ఫామెన్సులో చాలా బెస్ట్ అయినా కూడా కొనుగోలుదారులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. అయితే ఇటీవల ఈ మోడల్‌ను ఫేస్‌లిఫ్ట్ చేసి, XUV 3XO అనే కొత్త పేరుతో విడుదల చేశారు. పేరు మారిన తర్వాత దీనిని అదృష్టం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డీలర్‌షిప్‌లలో ఈ కారు కొనడానికి కస్టమర్లు క్యూ కడుతున్నారు.

కొత్త పేరుతో వచ్చిన XUV 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీ ఊహించని విధంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. గత నెలలో ఈ మోడల్ దాని ప్రధాన పోటీదారు అయిన మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza) కంటే కూడా ఎక్కువ అమ్మకాలు సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా, XUV 3XO, దాని పాత మోడల్ XUV300 కలిపి మొత్తం 4 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించాయి.

Mahindra XUV 3XO Achieves 4 Lakh Sales Milestone Outselling Maruti Brezza

ఆటోకార్ నివేదిక ప్రకారం, అక్టోబర్ 2025లో ఈ ఎస్‌యూవీ ఏకంగా 12,237 యూనిట్లు అమ్ముడై, ఆ నెలలో అత్యధిక అమ్మకాలు సాధించిన మోడల్‌గా నిలిచింది. మహీంద్రా XUV300ను ఫిబ్రవరి 14, 2019 న విడుదల చేయగా, ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన XUV 3XO ను 2024 ఏప్రిల్ 29న విడుదల చేసింది.

మొత్తం 4,06,569 యూనిట్ల అమ్మకాల్లో, దాదాపు 39 శాతం (1,57,542 యూనిట్లు) కేవలం కొత్త XUV 3XO మోడల్ నుంచే వచ్చాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో, 1,00,905 యూనిట్ల అమ్మకాలతో XUV 3XO, మహీంద్రాలోనే అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా మారింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 84 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదు చేసింది.

Mahindra XUV 3XO Achieves 4 Lakh Sales Milestone Outselling Maruti Brezza

మహీంద్రా XUV 3XO మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా అనేక ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 130 బీహెచ్‌పీ పవర్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 117 బీహెచ్‌పీ శక్తిని అందిస్తాయి.

దీనిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

Mahindra XUV 3XO Achieves 4 Lakh Sales Milestone Outselling Maruti Brezza

XUV 3XO సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ పడలేదు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగులు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర జీఎస్టీ తగ్గింపు తర్వాత రూ.7.28 లక్షల నుంచి రూ.14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మొత్తంగా చూస్తే, అధిక ఫీచర్లు, అద్భుతమైన పనితీరు, మంచి సేఫ్టీతో XUV 3XO ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా మార్కెట్‌లో విజయవంతంగా దూసుకుపోతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 25, 2025, 12:36 [IST]
English summary
Mahindra xuv 3xo achieves 4 lakh sales milestone outselling maruti brezza
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+