దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న కారు ఇదే.. వెయిటింగ్ పీరియడ్ ఏడాదిన్నర పైనే!
మహీంద్రా కార్లు మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. ఈ కంపెనీకి చెందిన కార్లు గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో అదరగొడుతున్నాయి. ఈ సంస్థ నుంచి మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో కార్లు రాణిస్తున్నాయి. బడ్జెట్ ధరలో మహీంద్రా గత ఏడాది విడుదల చేసిన XUV3XO ఎస్‌యూవీ మంచి అమ్మకాలను రాబడుతోంది. ఈ ఎస్‌యూవీ భారీ డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. అందువల్ల ఈ కారుని జనాలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఈ కారు సేల్స్‌లో టాప్‌లో నిలిచింది.
గత డిసెంబర్ 2024లో 7,000 యూనిట్లకు పైగా కార్లను మహీంద్రా విక్రయించింది. 2023 డిసెంబర్‌లో కంపెనీ కేవలం 3,550 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 2023 డిసెంబర్ అమ్మకాలతో పోలిస్తే ఇది 97 శాతం అమ్మకాలతో భారీ వృద్ధిని నమోదు చేసింది. అందువల్ల మార్కెట్‌లో మరొక సారి తన సత్తాను చాటింది. మార్కెట్‌లో దీని వెయిటింగ్ పీరియడ్ వేరియంట్‌ని బట్టి 2 నెలల నుంచి ఏడాదిన్నరగా ఉంది.

దీని ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, పెద్ద సెంట్రల్ ఎయిర్టెక్, LED హెడ్‌లైట్స్‌తో సవరించిన బంపర్ వంటివి మంచి డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ మహీంద్రా ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌తో కొత్త అల్లాయ్ వీల్స్ భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఇది సైడ్‌లో రాయల్ లుక్‌ని కలిగి ఉంటుంది.
ఇక వెనకాల పూర్తి వెడల్పు LED లైట్ బార్, బంపర్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ప్లేట్, స్లీకర్ సి ఆకారంలో ఉన్న టెయిల్‌ల్యాంప్స్‌తో కూడిన అప్‌డేటెడ్ టెయిల్‌గేట్ డిజైన్‌తో ఈ ఎక్స్‌యూవీ క్రేజీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కొత్త మహీంద్రా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 2600 మిమీ పొడవైన వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఈ ఎక్స్‌యూవీ 3XO 23.7 డిగ్రీల ఫార్వర్డ్ విజిబిలిటీని కలిగి ఉంది.

ఇక ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ వో ఎస్‌యూవీ 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులోని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 108bhp పవర్, 200 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 1.2-టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ 129bhp పవర్, 230 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇక 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ 115bhp పవర్, 300 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో లభిస్తాయి. ఈ ఎస్‌యూవీ లీటర్‌కి 18.89 కిలోమీటర్లు నుంచి 20.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఫీచర్లు, మైలేజీ పరంగా బెస్ట్ కావడంతో మార్కెట్‌లో తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సాధించింది.

ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ 7-స్పీకర్ హర్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ ద్వారా మంచి మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే 10.25 ఇంచెస్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీటు, యాంబియంట్ సౌండ్ మోడ్లు వంటివి మరెన్నో ఉన్నాయి.
ఈ మహీంద్రా కారు సేఫ్టీలో తోపు కారుగా ఉంది. ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఈ ఎస్‌యూవీ లోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే లెవల్ 2 ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








