మారుతి బ్రెజ్జాను దాటేసిన మహీంద్రా కారు.. ఒక్క నెలలో 12,237 మంది కొన్నారు.. అంతగా దీనిలో ఏముంది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా & మహీంద్రా (M&M) మరోసారి తన దూకుడు శైలిని నిరూపించింది. ఇప్పటికే కఠినమైన పోటీ ఉన్న SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీ తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, ఆధునిక ఫీచర్లు, అత్యుత్తమ భద్రత ఈ కారణాల వల్లే మహీంద్రా బ్రాండ్‌కు వచ్చిన విశ్వసనీయత రోజురోజుకు మరింత బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి గర్వకారణంగా మారిన మోడల్ XUV 3XO. మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఈ కాంపాక్ట్ SUV వినియోగదారుల హృదయాలను దోచుకుంది. ప్రీమియం లుక్, ఆధునిక టెక్నాలజీలు, సేఫ్టీ స్టాండర్డ్స్ ఈ వాహనాన్ని తన సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ముఖ్యంగా, అమ్మకాల పరంగా ఇది ఇప్పుడు నిజంగా గేమ్-చేంజర్‌గా మారింది.

ఎన్నో ఏళ్లుగా కాంపాక్ట్ SUV విభాగాన్ని అదరగొడుతున్న మారుతి సుజుకి బ్రెజ్జాను కూడా XUV 3XO అధిగమించగలిగింది. గత నెలలో ఇది 12,237 యూనిట్ల అమ్మకాలతో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో బ్రెజ్జా మాత్రం వెనుకబడటంతో చర్చ అంతా 3XO వైపే మళ్లిపోయింది. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 9,562 యూనిట్లతో పోలిస్తే దాదాపు 28% వృద్ధిని XUV 3XO నమోదు చేసింది.

Mahindra XUV 3XO October 2025 Sales Recorded 12237 Units More Details Inside

ఈ పెరుగుదల కేవలం సంఖ్యల కథ మాత్రమే కాదు; వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు, మార్కెట్ ఎలా మారుతోంది, కొత్త తరంలోని SUV కొనుగోలుదారులు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న వాటికి ఇది బలమైన సూచిక. తమ బడ్జెట్‌లో ప్రీమియం అనుభవం, ఫీచర్ల పరంగా, అలాగే నమ్మకమైన భద్రత.. ఈ మూడు అంశాలను XUV 3XO ఖచ్చితంగా అందిస్తోంది. అందువల్లే ఇప్పుడు ఇది అమ్మకాల్లో మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది.

మారుతి బ్రెజ్జా అక్టోబర్ 2025లో 12,072 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసినప్పటికీ, మహీంద్రా XUV 3XO దానిని స్వల్ప తేడాతో అధిగమించడం విజయంగా నిలిచింది. బ్రెజ్జా వంటి సంవత్సరాలుగా మార్కెట్‌లో ఆధిపత్యం చూపిన SUVను ఓడించడం చిన్న విషయం కాదు. ఇటీవలి GST రేట్ల తగ్గింపు XUV 3XOకి పెద్ద వరంగా మారింది. దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.28 లక్షల నుండి రూ. 14.40 లక్షల వరకు ఉంది.

Mahindra XUV 3XO October 2025 Sales Recorded 12237 Units More Details Inside

శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, డ్రైవింగ్‌కు ఇచ్చే రెస్పాన్స్, ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఈ SUVను ఫ్యామిలీ యూజర్లతో పాటు యువ డ్రైవింగ్ ఎంథూసియాస్ట్‌లకు కూడా బెస్ట్ చాయిస్‌గా నిలబెట్టి ఉన్నాయి. XUV 3XO మూడు వేర్వేరు ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. మొదటిది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 115 bhp శక్తి, 200 Nm టార్క్ అందిస్తుంది. నగరాల్లో డ్రైవింగ్‌కు ఇది చాలా స్మూత్‌గా, హైవేపై లీనియర్ పవర్ డెలివరీతో పనిచేస్తుంది.

ఇంకా శక్తివంతమైన 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఆప్షన్ ఉంది. ఇది 130 bhp శక్తితో పాటు 250 Nm వరకు టార్క్‌ను అందించగలదు. పెట్రోల్ టర్బో సెగ్మెంట్‌లో ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఇంజిన్ కాన్ఫిగరేషన్‌లలో ఒకటి. డీజిల్ వాహనాలను ఇష్టపడే వినియోగదారుల కోసం కంపెనీ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజన్ను అందిస్తోంది. ఇది 117 bhp వద్ద 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Mahindra XUV 3XO October 2025 Sales Recorded 12237 Units More Details Inside

ఇన్ని ఇంజిన్ ఆప్షన్లకు తగ్గట్టుగానే ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా విస్తృతంగా ఉన్నాయి. XUV 3XOలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT, అలాగే మరింత స్మూత్‌గా పనిచేసే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. డ్రైవర్ ప్రాధాన్యత, వినియోగం, సిటీ లేదా హైవే వంటి రోడ్డు పరిస్థితుల ఆధారంగా వినియోగదారులు తమకు నచ్చిన కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, November 15, 2025, 10:10 [IST]
English summary
Mahindra xuv 3xo october 2025 sales recorded 12237 units more details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+