21కిమీ మైలేజ్, రూ.8లక్షల్లోపే ధర.. స్టైల్, సేఫ్టీకి ఫిదా అయిపోయిన జనం.. జూన్ లో ఎంతమంది కొన్నారంటే ?

మహీంద్రా కంపెనీకి చెందిన XUV 3XO కారు గత జూన్ నెలలో అద్భుతమైన అమ్మకాలను సాధించింది. గత సంవత్సరం జూన్ నెల అమ్మకాలతో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ, ప్రస్తుత జూన్ నెల అమ్మకాలు మాత్రం చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

భారతదేశంలో తక్కువ ధరలో కాంపాక్ట్ ఎస్‌యూవీల విషయానికి వస్తే మార్కెట్‌లో వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, కియా సోనెట్ వంటి చాలా కార్లు ఈ విభాగంలో బాగా అమ్ముడవుతున్నాయి.

Mahindra XUV 3XO

ఈ నేపథ్యంలో ఈ కార్లన్నింటినీ అధిగమించే విధంగా మహీంద్రా కంపెనీ గత సంవత్సరం 3XO కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు కేవలం రూ.7.99 లక్షల ధరతో విక్రయించబడుతోంది. భారత మార్కెట్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిజైన్, ఫీచర్లు, సౌకర్యాలతో ఈ కారు విడుదలైంది.

గత జూన్ నెలలో మహీంద్రా XUV 3XO కారు మొత్తం 7,089 యూనిట్లను అమ్మింది. గతేడాది జూన్‌తో పోలిస్తే, ఇది 17శాతం తక్కువ అమ్మకాలు నమోదు చేసింది. అయితే, ఈ తగ్గుదల వెనుక ఒక కారణం ఉంది. గతేడాది జూన్‌లో కారు విడుదలైన కొత్తలో, ఎక్కువ మంది కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. అప్పుడు వచ్చిన ఆర్డర్లన్నీ ఒకేసారి డెలివరీ అవ్వడంతో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి.

Mahindra XUV 3XO

కానీ, ఈ జూన్ నెలలో జరిగిన అమ్మకాలు సహజమైనవి, అంటే మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మహీంద్రా XUV 3XO కారు కొనేవారికి మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి: 1.2లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.2లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్లతో పాటు, కారులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

మైలేజ్ విషయానికొస్తే, XUV 3XO చాలా పెట్రోల్ మాన్యువల్ మోడల్ లీటరుకు 19.34 కి.మీ, పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 18.06 కి.మీ., డీజిల్ మాన్యువల్ మోడల్: లీటరుకు 20.6 కి.మీ, డీజిల్ ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 21.2 కి.మీ ఇస్తుంది.

Mahindra XUV 3XO

ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీటు ఎత్తును అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ పరంగా, ఈ కారు భారత్ NCAP క్రాష్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇందులో ADAS 2 భద్రతా ఫీచర్, ఫోర్ వీల్స్‎కు డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా XUV 3XO కారు ప్రస్తుతం కస్టమర్లలో మంచి పేరు సంపాదించుకుంది. భవిష్యత్తులో కూడా ఈ కారు అమ్మకాల్లో మంచి పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారుకు ఇంత పాపులారిటీ రావడానికి ప్రధాన కారణాలు.. ఆకర్షణీయమైన ధర, మంచి మైలేజ్, అధునాతన ఫీచర్లు, సేఫ్టీ. ఈ అంశాలన్నీ కలిసి XUV 3XO ను మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలుపుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, July 10, 2025, 16:47 [IST]
English summary
Mahindra xuv 3xo records strong sales in june what makes this compact suv a hit
Read more on: #mahindra #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+