అద్భుతమైన ఫీచర్‌ను పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి తక్కువ ధర కారు.. మహీంద్రా కొత్త సెన్సేషన్
సాధారణంగా మనం సినిమా చూసే సమయంలో మంచి సౌండ్ అనుభూతి కలిగితే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. వీడియో నుంచి వచ్చే ప్రతి సన్నివేశానికి సంబంధించిన మాటలు లేదా పాటలు స్పష్టమైన సౌండ్ ఎఫెక్ట్స్ అందరు కావాలని కోరుకుంటారు. ప్రధానంగా ఈ రోజుల్లో డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన సౌండ్ అనుభూతిని పొందడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అందించే ధ్వని మరింత క్లారిటీతో, లోతుగా, అన్ని వైపుల నుంచి వినిపించే రీతిలో ఉంటుంది. అలాంటి అనుభవాన్ని కారు డ్రైవ్‌లో పొందడం ఒక విభిన్నమైన అనుభూతి అని చెప్పాలి. ఈ మారుతున్న ట్రెండ్‌ను సరిగ్గా అర్థం చేసుకున్న మహీంద్రా, తన SUVలలో డాల్బీ అట్మోస్‌ను ఒక కీలక హైలైట్‌గా తీసుకొస్తోంది.
ప్రత్యేకంగా, కారు డ్రైవ్‌లోనే అనుభవించాలని కోరుకునే సమయాల్లో, ఈ ఫీచర్ వారిని మరింత ఆకర్షించే అవకాశం ఉంది. అందుకే మహీంద్రా SUVలతో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా, తన కొత్త XUV 3XO SUVలో ప్రత్యేకంగా REVX A వేరియంట్లోనే డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీని అందిస్తోందని ప్రకటించింది.కొత్తగా విడుదల చేసిన XUV 3XO REVX Aలో డాల్బీ అట్మోస్ అందుబాటులో ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ధరలో డాల్బీ అట్మోస్ సౌండ్ అనుభవాన్ని అందించే ప్రపంచంలోనే మొదటి SUV ఇదేనని మహీంద్రా గర్వంగా చెబుతోంది. సినిమా హాల్స్‌లో వినిపించే ఆ మేజిక్ సౌండ్‌ను, మహీంద్రా ఇప్పుడు SUV కేబిన్‌లోనే అందిస్తోంది. ఇది కేవలం డ్రైవింగ్ అనుభవాన్ని కాకుండా, మొత్తం ప్రయాణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చే ఫీచర్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు.
మహీంద్రా XUV 3XOలో డాల్బీ అట్మాస్ ఫీచర్‌ను కేవలం REVX A వేరియంట్‌లోనే కాకుండా, AX5L, AX7, AX7L వేరియంట్‌లలో కూడా అందిస్తోంది. దీని ద్వారా ఈ SUVని ఎంచుకునే కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా వేరియంట్‌ను తీసుకున్నా, అదే ప్రీమియం ఆడియో అనుభవాన్ని పొందగలరు. డాల్బీ అట్మాస్ సిస్టమ్‌లో ఆరు-స్పీకర్ ఆడియో డిజైన్‌ను ఉపయోగించారు. కానీ XUV 3XO ప్రత్యేకమైన క్యాబిన్ డిజైన్‌కు సరిపోయేలా ప్రత్యేకంగా ట్యూన్ చేయబడింది.

ఈ ట్యూనింగ్ వలన, సౌండ్‌స్టేజ్ మధ్యలో కూర్చున్నట్టుగా ప్రతి ప్రయాణికుడు సౌండ్ అన్ని వైపుల నుంచి లైవ్ కాన్సర్ట్‌లా అనుభవిస్తారు. డ్రైవర్ లేదా ఒకే ప్రయాణికుడికి కాకుండా, మొత్తం కేబిన్‌లో కూర్చున్న వారందరికీ ఒకే రకమైన సౌండ్ అనుభూతి వస్తుంది. సాధారణంగా, కారు సౌండ్ సిస్టమ్‌లలో సౌండ్ ఒక వైపు బలంగా, మరో వైపు తగ్గినట్టుగా అనిపించవచ్చు. కానీ డాల్బీ అట్మాస్‌తో ప్రతి స్పీకర్ నుంచి సౌండ్ వస్తుంది.
మహీంద్రా XUV 3XOలో డాల్బీ అట్మాస్ సౌండ్ మరింత ప్రీమియం స్థాయికి తీసుకెళ్లే వేరియంట్ AX7L. దీనిలో అదనంగా సబ్ వూఫర్ అందించబడింది. దీంతో సాధారణ మ్యూజిక్ సిస్టమ్‌లో లభించని లోతైన బాస్ ఎఫెక్ట్, మరింత స్పష్టత కలిగిన సౌండ్ లభిస్తుంది. రోడ్ ట్రిప్‌లో పాటలు వినడం గానీ, సినిమా తరహా ఆడియో అనుభవం కావాలి గానీ AX7L వేరియంట్‌లో ఆ అనుభూతి నిజంగా థియేటర్ తరహా లెవెల్‌కు చేరుకుంటుంది.

మహీంద్రా అందిస్తున్న ఈ డాల్బీ అట్మాస్ టెక్నాలజీ REVX A, AX5L, AX7, AX7L వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ నాలుగు వేరియంట్‌లు అధికారికంగా సెప్టెంబర్ మధ్య నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా, XUV 3XO ఇప్పుడు కేవలం ఒక SUV మాత్రమే కాదు, రోడ్డుపై ఒక మొబైల్ థియేటర్ లాంటి అనుభవాన్ని అందించే వాహనంగా మారింది అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








