కుటుంబంతో కలిసి వెళ్ళడానికి ఇది బెస్ట్ కారు! పేరు మార్చిన తర్వాత జనాలు ఎగబడి మరి కొంటున్నారు
భారతీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇతర కంపెనీలకు పోటీగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తూ, క్రమంగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటుంది. కంపెనీ ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో XUV 3XO కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఇది అమ్మకాల పరంగా గణనీయంగా పురోగతి సాధించింది. ఇది గతంలో మహీంద్రా XUV300 కాగా దీన్ని ఏప్రిల్ 2024లో రీ బ్రాండ్ చేసి XUV 3XOగా తిరిగి లాంచ్ చేశారు. పాత పేరుతో ఉనప్పటి కంటే కొత్త పేరుతో విడుదల అయిన తరువాత ఈ కారు అమ్మకాలు దాదాపు 80 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. రీబ్రాండ్ మోడల్‌గా విడుదల అయినప్పటి నుంచి జనవరి 2025 వరకు ఈ కాంపాక్ట్ SUV మొత్తం 85,990 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది.
దీని కంటే ముందు మహీంద్రా XUV300గా అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఫిబ్రవరి 14, 2019న మొదట వచ్చింది. ఇప్పటి వరకు ఈ కారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జనవరి నాటికి మొత్తం అమ్మకాలను చూసినట్లయితే దీన్ని 3,35,017 మంది కొనుగోలు చేశారు. రీబ్రాండ్ మోడల్‌గా పేరు మార్చి విడుదల చేసిన ఈ కారు అమ్మకాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. జనవరి 2025 వరకు 85,990 సేల్స్ నమోదయ్యాయి.

అయితే, ఈ కారుకు రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష అమ్మకాలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలతో పాటు మహీంద్రా సైతం అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఫిబ్రవరి-మార్చి ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలలు మిగిలి ఉండగా, ఈ కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ను సాధించి మొత్తం అమ్మకాలను లక్షకు చేరుకోవచ్చని డేటాను చూస్తే తెలిసిపోతుంది.
మహీంద్రా SUV అమ్మకాలలో XUV 3XO ప్రసిద్ధ మోడల్‌గా అవతరించింది. మొత్తం ఎస్‌యూవీ విభాగంలో దీన్ని కస్టమర్లు విపరీతంగా ఆదరించారు. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 20 శాతం వృద్ధిని సాధించింది. మహీంద్రా XUV 3XO బేస్ MX1 మోడల్ ప్రారంభ ధర రూ.7.79 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. అదే టాప్ వేరియంట్ AX7L ధర రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

అదే డీజిల్ వెర్షన్లను చూసినట్లయితే MX2 వేరియంట్ రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. అదే దీని టాప్ వేరియంట్ AX7 L ధర రూ.14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్లలో కొనుగోలుకు ఉంది. పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, 110PS పవర్, 200Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.
మరో పవర్ అవుట్‌పుట్ 130PS పవర్, 230Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ను జత చేశారు. డీజిల్ ఆప్షన్‌లో 117PS పవర్, 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT జోడించారు. ఈ కారు కుటుంబంతో కలిసి వెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








