5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కారుకు బ్రహ్మరథం పట్టిన జనాలు.. బడ్జెట్ ధరలో, డజన్ల కొద్ది ఫీచర్స్‌..

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా(Mahindra) అంటే భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కంపెనీ. దేశీయ వినియోగదారుల కోసం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న కస్టమర్ల కోసం కంపెనీ ప్రతి ఏడాది అదిరిపోయే ఫీచర్స్‌తో కూడిన వాహనాలను విడుదల చేస్తుంది. మహీంద్రా నుంచి వచ్చే కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. 2024లో కంపెనీ మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. అయితే తాజాగా కంపెనీ వరుసగా తన మోడళ్ల వారీగా సేల్స్ వివరాలు వెల్లడిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల మహీంద్రా XUV 3XO కారు 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడించింది. కంపెనీ నుంచి విడుదలైన వివరాల ప్రకారం, XUV 3XO మోడల్ గత నెలలో దాదాపు 7000 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అయితే ఇది 2023 ఇదే డిసెంబర్ నెలలో ఈ సంఖ్య కేవలం 3,550 యూనిట్లుగా మాత్రమే ఉంది.

భారతీయ మార్కెట్లో మహీంద్రా XUV 3XO అత్యంత ప్రజాదరణ కలిగిన కార్లలో ఒకటిగా ఉంది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ కారు అమ్మకాలు ఏకంగా 97 శాతం వృద్ధి చెందింది. ఈ గణంకాలను చూసినట్లయితే దేశీయ కస్టమర్లలో ఈ కారుకు ఉన్నటువంటి డిమాండ్ తెలిసిపోతుంది. మొత్తం అమ్మకాలు 12 నెలల వ్యవధిలో రెట్టింపు కావడంపై మహీంద్రా ఉన్నతాధికారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీకి ఇది పెద్ద విజయం.

Mahindra Xuv December 2024 Sales

ఏడాది కాలంలోనే ఈ కారు అమ్మకాలు రెట్టింపు కావడానికి ప్రధాన కారణం దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్స్. కొత్త ఏడాదిలో కూడా XUV 3XO ఇంకా ఎక్కువ అమ్మకాలను నమోదు చేస్తుందని మహీంద్రా కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. భారతీయ కస్టమర్లలో ఓ రేంజ్‌లో ఆదరణ సంపాదించిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.7.99 లక్షల నుంచి ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంది.

XUV 3XOలో టాప్ వేరియంట్ ధర మాత్రం రూ.15.56 లక్షల వరకు ఉంటుంది. ఇది కూడా ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే పన్నులు, ఇతరత్ర వాటితో కలిపి మరింత ఎక్కువ ఉంటుంది. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ రెండు ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. పెట్రోలో కారులో 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు అమర్చారు.

Mahindra Xuv Price Design

అదే డీజిల్ ఇంజిన్‌‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌, 6-స్పీడ్ మాన్యువల్ సెటప్ జోడించారు. ఫీచర్స్ కావాలనుకునే వారికి దీనిలో డజన్ల కొద్ది కనిపిస్తాయి. లేటెస్ట్ ఫీచర్స్‌కు మాత్రం ఎలాంటి కొదవ లేదు. ఇంటీరియర్ క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కంఫర్టబుల్ సీట్లు, అధునాతన థీమ్ సెటప్ వంటివి ఉన్నాయి.

లోపల కూర్చున్న ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా ఇది బెస్ట్ మోడల్. ఇది లెవెల్ 2 ADS, 360-డిగ్రీ కెమెరా, ఎయిర్‌బ్యాగ్స్‌తో వచ్చింది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ప్రమాద సమంయంలో పిల్లలు, పెద్దలకు రక్షణకు సంబంధించి పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

Mahindra Xuv Sales Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2025, 11:00 [IST]
English summary
Mahindra xuv 3xo sales increased by 97 percent in december 2024
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+