మొత్తం ఫ్యామిలీతో బయటికి వెళ్లడానికి పర్ఫెక్ట్ కారు.. మిడిల్‌క్లాస్ డ్రీమ్ కార్ ఇదే! వాల్యూ ఫర్ మనీ

మహీంద్రా XUV 3XO పేరు వినగానే యువత నుంచి కుటుంబాల వరకు అందరికీ ఒక స్పెషల్ కనెక్ట్. ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే కొత్త రూపం, కొత్త రేంజ్, కొత్త టెక్నాలజీతో SUV సెగ్మెంట్‌లో పెద్ద సంచలనంగా మారింది. బయటకు చూస్తేనే అగ్రెసివ్ స్టాన్స్, షార్ప్ లైన్స్, డైనమిక్ డిజైన్‌.. ఇతర కార్లతో పోలిస్తే దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. లుక్‌ని చూసిన వెంటనే ఇదే నా కార్ అనిపించేలా ఉంటుంది. అందుకే మీరు కొత్త కారు కొనాలని భావిస్తే... చూడటానికి స్టైలిష్‌గా, నడపడానికి పవర్‌ఫుల్‌గా, లోపల కంఫర్టబుల్‌గా, సేఫ్టీలో నంబర్ వన్‌గా ఉండే కారు కావాలంటే Mahindra XUV 3XO బెస్ట్ ఛాయిస్ అవుతుంది. చిన్న కుటుంబానికి సరిపోయేలా, పెద్ద ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుంది. దీని గురించిన ఇతర వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

కొత్త మహీంద్రా XUV3XO నిజంగా పోటీ ధర, ప్రీమియం ఫీచర్లు అనే కాన్సెప్ట్‌కు బెస్ట్ ఉదాహరణ. మార్కెట్లో ఉన్న ఇతర కార్లతో పోలిస్తే దీని ధరను చాలా స్ట్రాటజికల్‌గా Mahindra ప్లాన్ చేసింది. రూ. 7.28 లక్షల నుంచి రూ. 14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు లభించడం వల్ల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకున్న వినియోగదారులకైనా, ప్రీమియం SUV ఫీల్ కోరుకునేవారికైనా ఇది అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV 3XO Suv Car Price Engine Mileage Features And All Details

అంతర్గత స్పేస్ విషయానికి వస్తే, ఇది నిజంగా ఒక కాంపాక్ట్ SUV అనిపించదు. 5 మంది ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు, హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ రెండూ చాలా బాగా ప్లాన్ చేశారు. ఫ్యామిలీ యూజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇది MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5L వంటి ఆప్షన్లతో లభిస్తుంది. దీంతో Mahindra ప్రతి రకమైన కస్టమర్‌కి ఒక ప్రత్యేక ఎంపికను అందిస్తోంది.

ఇందులో ఉన్న 1.2-లీటర్ MPFI టర్బో పెట్రోల్ ఇంజన్ రోజువారీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ 3-సిలిండర్ యూనిట్ 111.5 bhp హార్స్‌పవర్, 200 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర రోడ్లలో స్మూత్‌గా నడవటానికి, హైవేలో త్వరగా పికప్‌ అందటానికి ఇది బాగా పనిచేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ అలాగే 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికను ఇచ్చింది, అందువల్ల డ్రైవింగ్ స్టైల్ ఏదైనా మంచి కంట్రోల్ లభిస్తుంది.

Mahindra XUV 3XO Suv Car Price Engine Mileage Features And All Details

మరింత పవర్ కోరుకునే డ్రైవర్ల కోసం 1.2-లీటర్ TGDI టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది నిజంగా స్పోర్టీ పనితీరును ఇస్తుంది. ఇంజన్ 130 bhp వరకు హార్స్‌పవర్‌ను, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఓవర్‌టేకింగ్, హైవే క్రూయిజింగ్ ఉంటూ డ్రైవర్‌కు ఎక్కువ థ్రిల్‌ను ఇస్తుంది. ఇదీ 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లతోనే వస్తుంది. డీజిల్ ప్రియుల కోసం Mahindra వేరుగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను అందిస్తోంది.

ఇది శక్తి, ఇంధన సామర్థ్యాన్ని కలిపిన ఐడియల్ కాంబినేషన్. 116 bhp పవర్, 300 Nm పీక్ టార్క్‌ను ఇస్తూ, భారం ఎక్కువ ఉన్న డ్రైవింగ్ పరిస్థితులకైనా సులభంగా హ్యాండిల్ చేస్తుంది. డీజిల్ టార్క్ డెలివరీ వల్ల ఇది హిల్ రోడ్‌లలోనూ, ట్రిప్‌లలోనూ పనితీరును అందిస్తుంది. ఇదీ రెండు గేర్‌బాక్స్‌లతో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ అందుబాటులో ఉంది. 18 kmpl నుంచి 21 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.

Mahindra XUV 3XO Suv Car Price Engine Mileage Features And All Details

ఈ కారులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేలు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, USB-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి వివిధ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు భద్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు, ABS , EBD, ESC, లెవెల్-2 వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 5, 2025, 17:21 [IST]
English summary
Mahindra xuv 3xo suv car price engine mileage features and all details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+