మిగతా ఆటో మొబైల్ కంపెనీలను ముప్పుతిప్పలు పెడుతున్న మన కారు.. ఇంత తక్కువ ధరలో ఎన్ని ఫీచర్లో

భారతదేశంలో రోజురోజుకు కార్ల మార్కెట్ పెరుగుతోంది. మార్కెట్లో ఇప్పుడు అనేక కంపెనీలకు చెందిన కార్లు అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాస్ ను టార్గెట్ చేస్తూ కంపెనీలు అన్నీ కూడా తక్కువ బడ్జెట్ కార్లను తీసుకొస్తున్నాయి. అలాగే మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్లోనే అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి కార్లను అందించడంలో మహీంద్రా కంపెనీ ముందుందనేది వాస్తవం.

ఇటీవలే మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగంలో BE 6eమోడల్ విడుదల చేసింది. ఇది త్వరలో మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమని తేలిపోయింది. ఇది మార్కెట్లో గేమ్ ఛేంజర్ కాబోతుంది. అలాగే భారతీయ మార్కెట్లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్ SUV కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. మహీంద్రా XUV 3XO అనేది భారతీయ కస్టమర్లలో అత్యంత పాపులర్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVలలో ఒకటి.

Mahindra XUV3XO Front

ఇటీవల భారత మార్కెట్లో మహీంద్రా భారీ వృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. దీనికి మహీంద్రా XUV3XO కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహీంద్రా XUV300 ప్రతి నెలా అద్భుతమైన విక్రయాలను నమోదు చేస్తుంది. కానీ ఫిబ్రవరి 2025లో మహీంద్రా XUV3XO కార్ల అమ్మకాలు అనూహ్యంగా తగ్గిపోయాయి. కానీ ఈ తగ్గుదల అనేది స్వల్పమే. జనవరి 2025లో మహీంద్రా 8,454 XUV3XO కార్లను విక్రయించింది.

కానీ తరువాతి ఫిబ్రవరిలో ఈ సంఖ్య 7,861కి తగ్గిపోయింది. ఇది 7.01 శాతం తగ్గుదల. ఇటీవల విడుదలైన అమ్మకాల నివేదిక ద్వారా ఈ సమాచారం వెల్లడైంది. మహీంద్రా XUV3XO మొత్తం 3 ఇంజన్ ఆఫ్షన్లలో లభిస్తుంది. అవి 1.2లీటర్ టర్బో పెట్రోల్ టీజీడీఐ, 1.5 లీటర్ టర్బో డీజిల్. మహీంద్రా XUV3XOలో లేటెస్ట్ ఫీచర్లుకు కొదవ లేదనే చెప్పొచ్చు.

Mahindra XUV3XO Interior

దీనిలో పనోరమిక్ సన్ రూఫ్, లెవల్ 2 ఏడీఎస్, 10.25ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కంప్లీట్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, లెథరెట్ సీట్స్ ఉంటాయి. మొత్తంగా చూస్తే మహీంద్రా XUV3XO ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో లభించే స్టైలిష్ కారు. ఈ కారు టెక్నాలజీ, మంచి రైడింగ్ ఫెసిలిటీ రెండింటినీ అందిస్తుంది.

అదనంగా, దీని ప్రీమియం ఇంటీరియర్స్ లగ్జరీ కారు లాంటి అనుభూతిని అందిస్తుంది. ఈ కారణాల వల్ల మహీంద్రా XUV3XOను కస్టమర్ల డబ్బుకు తగిన విలువ కలిగిన ప్రొడక్ట్ గా భావిస్తున్నారు. లగ్జరీ కార్లు కొనే కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు మహీంద్రా XUV300XO ని కొనుగోలు చేస్తున్నారు.

Mahindra XUV3XO Rear

కాబట్టి, ఫిబ్రవరి అమ్మకాల్లో స్వల్ప క్షీణత నమోదైనా మహీంద్రా XUV300 రాబోయే నెలల్లో తిరిగి వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ కారు భారత మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌లకు గట్టిపోటీ ఇస్తుంది. మహీంద్రా ఎక్స్‎యూవీ 3X0 ఎంట్రీ లెవల్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.7.99లక్షలు. దీనిలో టాప్ వేరియంట్ ధర రూ.15.56లక్షలు.. ఈ రెండూ కూడా ఎక్స్ షోరూమ్ ధరలే.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 10:42 [IST]
English summary
Mahindra xuv3xo a feature rich compact suv gaining traction in the indian market
Read more on: #mahindra #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+