ఈ కారులో 7 మంది కలిసి వెళ్లొచ్చు.. ఫెర్ఫామెన్స్‌లో దుమ్ములేపుతుంది.. పెట్రోల్ కంటే ఎక్కువ డిమాండ్

భారతీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారు అయిన మహీంద్రా (Mahindra) కార్లకు దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ వాహనాల్లో ఇంజిన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లతో కార్లను విడుదల చేయడంలో మహీంద్రాకు మంచి పేరుంది. దేశీయంగా ఉన్న టాటా మోటార్స్, మారుతీ సుజుకీ కంపెనీలకు బలమైన పోటీదారుగా మహీంద్రా కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో కంపెనీ అమ్మకాల పరంగా మెరుగైన సంఖ్యలను నమోదు చేసింది. మహీంద్రా పెట్రోల్‌తో డీజిల్ కార్లను కూడా విక్రయిస్తుంది. సాధారణంగా డీజిల్ కార్లను విడుదల చేయడం చాలా వరకు తగ్గిపోయింది. అన్ని కంపెనీలు కూడా పెట్రోల్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తుండగా, మహీంద్రా మాత్రం పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్‌ను విక్రయిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో కంపెనీ మంచి మార్కెట్‌ను కలిగి ఉంది.

మహీంద్రా‌కు డీజిల్ కారు XUV700‌కు భారతీయ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. పెట్రోల్ కార్లకు పోటీగా ఇది అమ్మకాల్లో దూసుకుపోతుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 వరకు ఈ కారును జనాలు ఎగబడి కొన్నారు. ఈ కాలంలో అమ్మకాలు దాదాపు 25 శాతం గణనీయంగా పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ఈ కారును 59,073 మంది కొనుగోలు చేశారు.

Mahindra Xuv700

ఇదే సమయంలో పెట్రోల్ ఎడిషన్ అమ్మకాల్లో 3.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా‌ XUV700‌ అమ్మకాల్లో 75 శాతం డీజిల్ మోడల్‌ను కొనుగోలు చేయడం విశేషం. మొదటి పది నెలల్లో ఈ కారును ఇంత మంది కొనుగోలు చేయడం అంటే భారతీయ కస్టమర్లలో డీజిల్ వేరియంట్‌కు ఉన్న డిమాండ్‌‌ను అర్ధం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో మిగిలిన వాటా పెట్రోల్ మోడల్ అమ్మకాలను నమోదు చేసింది.

ఇదే సమయంలో పెట్రోల్ వెర్షన్‌ అమ్మకాలు దాదాపు 19,690 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా XUV700‌ డీజిల్ కారు శక్తివంతమైన 2.2-లీటర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 185hp పవర్, 420Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. అలాగే, హైవే మార్గాల్లో కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. ఇంజిన్‌ పనితీరు అద్బుతంగా అనిపిస్తుంది.

Mahindra Xuv700 Diesel Variant

అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా దీని బాడీని రూపొందించారు. కఠినంగా ఉన్న భూభాగాలలో కూడా డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది. XUV700 ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్‌లో లభిస్తుంది. ఆఫ్-రోడ్ డ్రైవింగ్ చేసే వారికి ఈ SUV అత్యంత అనువైన మోడల్. భారతీయ కస్టమర్లకు అవసరమైన అన్ని ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు. లోపల క్యాబిన్ థీమ్ చాలా అందంగా ఉంటుంది.

ఐదు సీట్లతో లభిస్తున్న MX డీజిల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.4.59 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. దీని ఇంజిన్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్‌‌ సెటప్‌ను జోడించారు. అలాగే . AX7 L AWD ఎడిషన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 7-సీట్లతో రూ.25.74 లక్షల ధరకు కొనుగోలుకు లభిస్తుంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2025, 11:20 [IST]
English summary
Mahindra xuv700 diesel variant fy 2025 sales report details check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+