స్టైల్, కంఫర్ట్, స్పేస్.. కంప్లీట్ ఫ్యామిలీ కార్..పెద్ద కుటుంబంతో హాయిగా ట్రిప్‌కు వెళ్లచ్చు..ఈసారి సరికొత్తగా
ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్న మహీంద్రా కార్లలో ఎక్స్‌యూవీ700 ఒకటి. స్కార్పియో తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మహీంద్రా కారు ఇదే. గతంలో ఉన్న ఎక్స్‌యూవీ500 కారుకు బదులుగా 2021 చివరలో విడుదలైన ఈ మోడర్న్ మహీంద్రా ఎస్‌యూవీకి మొదటి నుండి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.
అందుకే, ఎక్స్‌యూవీ700 కారును అప్‌గ్రేడ్ చేయడానికి మహీంద్రా కంపెనీ రెడీ అవుతుంది. మరి, ఈ కొత్త కారు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎక్స్‌యూవీ700 కారు మార్కెట్‌లో విడుదలై మూడేళ్లకు పైగా అయ్యింది కాబట్టి, ఈ కారును అప్‌డేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో భాగంగానే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారు కొత్త ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్ వెర్షన్ విడుదల కోసం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో అధికారిక విడుదల తేదీకి ముందే కొత్త ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ కారు సీక్రెటుగా రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా గుర్తించారు. మహీంద్రా కంపెనీ వివిధ కొత్త కార్లను తయారు చేస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూడా మహీంద్రా నుండి త్వరలో విడుదల కానున్నాయి. అవి కూడా రోడ్లపై టెస్ట్ చేస్తుండగా కెమెరాలకు చిక్కాయి.
అయితే, ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ కారు టెస్ట్ డ్రైవ్‌లో గుర్తించబడడం ఇదే మొదటిసారి. అప్పుడు తీసిన వీడియోను ఒక తమిళ యూట్యూబ్ ఛానెల్ విడుదల చేయడంతో, కొత్త ఎక్స్‌యూవీ700 కారు ఈ టెస్ట్ డ్రైవ్ తమిళనాడులో లేదా తమిళనాడుకు సమీపంలోని సరిహద్దు ప్రాంతాలలో ఎక్కడో జరిగి ఉండొచ్చు.

వీడియోలో పర్వతాలు, టీ తోటలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఊటీ, కొడైకెనాల్ లేదా మూనార్ ప్రాంతంలో ఈ టెస్ట్ డ్రైవ్ నిర్వహించి ఉండవచ్చని కొందరు వాదిస్తున్నారు. వాహనం కంప్లీట్ పర్ఫామెన్స్ తెలుసుకోవడానికి ఈ విధంగా పర్వత ప్రాంతాలలో టెస్ట్ డ్రైవ్‌లు నిర్వహించడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది.
ఇటీవల కూడా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్త హిమాలయన్ బైక్‌లు లడఖ్‌లో కఠినమైన వాతావరణ పరిస్థితులలో టెస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ కారు విషయానికి వస్తే... వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ కొత్త ఎక్స్‌యూవీ700 కారు టెస్ట్ డ్రైవ్‌లో పూర్తిగా కవర్ చేశారు. కారు అల్లాయ్ వీల్స్ కూడా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు.

ఇది ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్ కాబట్టి, కారు ముందు భాగం, వెనుక భాగం, లోపలి భాగాలలో మాత్రమే కొన్ని మార్పులు తీసుకురానున్నారు. కారు పక్క భాగంలో లేదా కారు పొడవు, వెడల్పు, ఎత్తు వంటి వాటిలో పెద్దగా ఎటువంటి మార్పులు ఉండవు. అలాగే, కారు మెకానికల్ భాగాలలో కూడా మహీంద్రా కంపెనీ మార్పులు చేసే అవకాశం లేదు.
ఈ టెస్ట్ డ్రైవ్‌లో కారు అల్లాయ్ వీల్స్ కవర్ చేశారు. కాబట్టి, ప్రస్తుత ఎక్స్‌యూవీ700 కారు నుండి అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్‌లో కొత్త ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ కారు ముందు భాగంలో డిఫరెంట్ డిజైన్‌లో హెడ్‌లైట్లు ఉన్నట్లు చూడవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత మార్కెట్‌లో అత్యధిక అంచనాలతో ఉన్న కార్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ కారు ఒకటి. ఈ కొత్త మహీంద్రా కారు 2025లోనే విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, బీఈ6, ఎక్స్‌ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్ల విడుదలలో మహీంద్రా దృష్టి పెట్టడం వల్ల, దీని రిలీజ్ లేట్ అయింది. ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ కారును ఎక్స్‌యూవీ 7ఎక్స్.ఓ(XUV 7XO) అనే పేరుతో ఈ కారును మహీంద్రా విడుదల చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








