అమ్మ, నాన్న, పిల్లలు, పెద్దలు అందరిని ఒకేసారి తీసుకెళ్లడానికి ఈ కారు బెస్ట్! బడ్జెట్‌లోనే లగ్జరీ అనుభవం
మహీంద్రా XUV700 గురించి చెప్పాలంటే, ఇది నేటి భారతీయ కుటుంబాల అవసరాలను అచ్చుగుద్దినట్టుగా తీర్చగలిగే పూర్తి స్థాయి ఫ్యామిలీ SUV గా మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కారు అందించే స్పేస్, కంఫర్ట్, సేఫ్టీ.. మూడు విభాగాల్లోను తన తరగతిలోనే కాదు, ఉన్నత సెగ్మెంట్‌ల కార్లకూ పోటీ ఇస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. లోపల కూర్చుంటే ఒక పెద్ద, శుభ్రమైన, ఎయిరీ కేబిన్ ఫీలవుతుంది. రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించినా కూడా ఇబ్బంది లేకుండా కంఫర్ట్‌గా కూర్చోగలిగే ఇంత పెద్ద స్పేస్‌ను మహీంద్రా అద్భుతంగా డిజైన్ చేసింది. బయట నుంచి చూడగానే ఆకట్టుకునే ప్రెజెన్స్ కలిగిన ఈ SUV, తన షార్ప్ లైన్లు, డామినెంట్ గ్రిల్, LED లైట్ సిగ్నేచర్‌తో క్షణాల్లోనే దృష్టిని ఆకర్షిస్తుంది.
నగరంలోనో, హైవేపై నడిపినప్పుడో, XUV700 రోడ్డుపై ఓరా సృష్టిస్తుంది. కొత్త మహీంద్రా XUV700ను కంపెనీ ఎంతో పోటీ ధరలో మార్కెట్‌కు తీసుకువచ్చింది. కుటుంబాలు ఎక్కువగా చూస్తున్న బడ్జెట్‌కి సరిపోయేలా దీని ప్రైస్ రేంజ్‌ను ఆకర్షణీయంగా ఉంచింది. ప్రస్తుతం ఈ SUV ధరలు రూ. 13.66 లక్షల నుండి రూ. 23.71 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ) ఉన్నాయి, దీంతో తన సెగ్మెంట్‌లోని అనేక కార్లకంటే మెరుగైన విలువను అందిస్తోంది.

వేరియంట్ల విషయానికి వస్తే, XUV700 AX3, AX5, AX7, AX7L అనే మూడు ప్రధాన లైన్-అప్స్‌లో లభిస్తుంది (AX7L టాప్-ఎండ్ లగ్జరీ ప్యాక్). ప్రతి వేరియంట్ కూడా ప్రత్యేక ఫీచర్లతో, వేరువేరు కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. సీటింగ్ విషయంలో కూడా మహీంద్రా విశేష శ్రద్ధ తీసుకుంది. 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్ ఆప్షన్లతో కుటుంబాల పరిమాణం ఏదైనా సరే, అందరికీ సౌకర్యంగా కూర్చునేలా XUV700 డిజైన్ చేయబడింది.
వెనుక వరుసలలో కూడా మంచి లెగ్‌రూమ్ ఉండటం వల్ల లాంగ్ ట్రిప్స్‌లో ప్రయాణికులు అలసట లేకుండా గమ్యం చేరవచ్చు. వారాంతపు ట్రిప్స్ కోసం ఎక్కువ సామాను తీసుకెళ్లే కుటుంబాల కోసం, XUV700లో 240 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది. సీట్లు ఫోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువ స్థలాన్ని పొందవచ్చు, దీంతో హైవేలకు, సెలవుల ట్రిప్‌లకు ఇది పర్ఫెక్ట్ SUVగా నిలుస్తుంది. దీనిలో అమర్చిన ఇంజిన్ అద్బుతమైన పనితీరును ఇస్తుంది.

మొదటగా, ఇందులో ఉన్న 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ప్రాక్టికల్‌గా ఒక పవర్ హౌస్‌లాంటిదే. ఇది 200 bhp పవర్, 380 Nm పీక్ టార్క్ అందించడం వల్ల, హైవేపై ఓవర్‌టేక్ చేయడమా, సిటీ ట్రాఫిక్‌లో స్పీడ్‌గా స్పందించడమా, ఎటువంటి పరిస్థితిలోనైనా ఈ ఇంజన్ అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఈ పెట్రోల్ యూనిట్‌ను 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో తీసుకోవచ్చు, రెండు ట్రాన్స్‌మిషన్లలోనూ స్మూత్ డ్రైవ్ అనుభవమే లభిస్తుంది.
డీజిల్ పవర్‌ను ఇష్టపడేవారికి XUV700లో ఉన్న 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ నిజమైన బీస్ట్. ఇది 185 bhp పవర్, 450 Nm టార్క్ ఉత్పత్తి చేస్తూ, హైవే క్రూజింగ్, పూర్తి ఫ్యామిలీతో ప్రయాణించడం, ఏ పని పెట్టినా తేలికగానే పూర్తి చేస్తుంది. ఈ డీజిల్ వెర్షన్ కూడా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌లతో లభిస్తుంది, డ్రైవర్‌కు తమ స్టైల్‌కు సరిపోయే ట్రాన్స్‌మిషన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ SUV 17 kmpl వరకు మైలేజీ ఇవ్వగలగడం ఆసక్తికరమైన విషయం. ఫీచర్ల విషయానికి వస్తే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అలెక్సా కనెక్టివిటీ, సేఫ్టీక 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS (ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








