మార్కెట్లో ఇన్నోవాకు సవాల్ విసిరిన ఎస్యూవీ.. మహీంద్రా కారు సేల్స్ పడిపోవడానికి కారణం ఏంటి?

కొత్త కారు కొనాలనుకునే వారిలో చాలామందికి మహీంద్రా XUV700 ఒక మంచి ఆఫ్షన్‎గా కనిపిస్తుంది. ఇది అడ్వాన్సుడ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, అద్భుతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అయినప్పటికీ, జూలై నెలలో ఈ కారు అమ్మకాలు కొంతవరకు తగ్గాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలలో 9% క్షీణత కనిపించింది.

జూలైలో 7,054 యూనిట్లు అమ్ముడవ్వగా, గత ఏడాది జూలైలో ఈ సంఖ్య 7,769గా ఉంది. ఈ మార్కెట్ ఒడిదుడుకులకు కారణాలు ఏమిటి? ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ ప్రత్యేకతలు ఏమిటో ఈ వార్తలో తెలుసుకుందాం.

Mahindra XUV700 Sales Decline Is it losing to rivals like Innova

ఈ ఎస్యూవీ మార్కెట్లో మంచి పోటీ ధరలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ. 25.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది MX, AX3, AX5, AX7, AX7L వంటి వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

దీని డిజైన్ చాలా స్టైలిష్‎గా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‎ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్‎ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎవరెస్ట్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, డ్యాజ్లింగ్ సిల్వర్, రెడ్ రేజ్, ఎలక్ట్రిక్ బ్లూ, మ్యాట్ బ్లేజ్ రెడ్, బర్న్ట్ సియెన్నా, డీప్ ఫారెస్ట్, నేపుల్స్ బ్లాక్, స్టీల్త్ బ్లాక్, వలేరియన్ సిల్వర్ వంటి రంగులలో లభిస్తుంది.

Mahindra XUV700 Sales Decline Is it losing to rivals like Innova

కొత్త XUV700 ఎస్యూవీ 4695 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు, 1755 మిమీ ఎత్తు కలిగి ఉంది. దీనికి 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 2750 మిమీ వీల్ బేస్ ఉన్నాయి. ఈ కారు 6 లేదా 7 సీట్ల ఆప్షన్‎లో లభిస్తుంది. ఎక్కువ సామాను పెట్టుకోవడానికి వీలుగా 240 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

మహీంద్రా XUV700 పవర్ఫుల్ ఇంజిన్‎తో వస్తుంది. దీని 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 200 పీఎస్ హార్స్ పవర్, 380 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. మరో 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 185 పీఎస్ హార్స్ పవర్, 450 ఎన్ఎం పీక్ టార్క్‎ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు వేరియంట్‎ను బట్టి 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‎బాక్స్‎తో వస్తుంది. ఇది లీటరుకు 17 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు.

కారు లోపలి డిజైన్ చాలా అడ్వాన్సుడ్‎గా ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‎స్క్రీన్ ఇన్ఫోటైన్‎మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, 12 స్పీకర్లు, పనోరమిక్ సన్‎రూఫ్, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‎లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, అలెక్సా కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త XUV700 ఎస్‎యూవీ తన ప్రయాణికులకు గరిష్ట భద్రతను అందిస్తుంది. ఇందులో 7 ఎయిర్‎బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, టీపీఎంఎస్, ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్, టయోటా ఇన్నోవా, టాటా సఫారీలకి గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, August 17, 2025, 10:26 [IST]
English summary
Mahindra xuv700 sales decline is it losing to rivals like innova
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+