ఈ కారు మహీంద్రాకు బంగారు గుడ్డు లాంటిది! ఫుల్ డిమాండ్.. ఏకంగా నెలకు పైగా వేచి ఉండాల్సిందే!

దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra)కు చెందిన ప్రసిద్ద మోడల్ ఎక్స్‌యూవీ 700 (XUV700) కీలక మైలు రాయికి చేరుకుంది. అమ్మకాల పరంగా ఇది దూసుకుపోయి మహీంద్రాకు కీలకమైన మోడల్‌గా అవతరించింది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు నమోదు చేసి మహీంద్రా చరిత్రలో ఓ మైలురాయిని సాధించింది. 2021 ఆగస్టులో మార్కెట్‌లోకి ప్రవేశించిన XUV700 ప్రజల అభిమానాన్ని పొందుతూనే ఉంది. ఇటీవలి కాలంలో కంపెనీకి అత్యధిక విజయాలను తీసుకొచ్చిన SUV ఇదే. ఆకర్షణీయమైన రూపం, శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్ల కలయిక వలన ఈ మోడల్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది.

ప్రస్తుతం మహీంద్రా XUV700 భారతీయ SUV మార్కెట్‌లో హాట్ ఫేవరెట్‌గా నిలిచింది. ఈ కారుకు ఉన్న డిమాండ్ ఎలాంటి స్థాయిలో ఉందంటే, కొన్ని వేరియంట్ల కోసం బుకింగ్ చేసుకున్న వినియోగదారులు నెలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ మోడల్, త్వరలో కొత్త రూపంతో మన ముందుకు రానుంది. మహీంద్రా ఇప్పటికే 2026 ప్రారంభంలో XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేయాలన్న ప్రణాళికలపై పనిచేస్తోంది.

Mahindra Xuv700 Suv Price

ఇందులో ముందుగా చూపే మార్పులు స్పష్టంగా కనిపించనున్నాయి, కొత్తగా డిజైన్ చేసిన LED హెడ్‌లైట్లు, మరింత స్టైలిష్‌గా ఉన్న గ్రిల్ డిజైన్, ఇంటీరియర్‌లో చక్కటి ఫినిషింగ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీతో తయారవుతోంది. అంటే చెప్పాలంటే, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మునుపటి వేరియంట్లకంటే ఇంకా అధునాతనంగా, స్టైలిష్‌గా, టెక్నాలజీ పరంగా మరింతగా మెరుగుపడేలా వస్తోంది. డిమాండ్ ఎక్కడ తగ్గలేదు, ఇక కొత్త రూపంలోకి వస్తే ఇంకా ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిందే!

ఇప్పుడు అందుబాటులో ఉన్న మహీంద్రా XUV700 ధర విషయంలో చూస్తే, ఎక్స్-షోరూమ్ రూ.14.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.89 లక్షల వరకూ ఉండగా, ఇది విభిన్న సెగ్మెంట్లకు చెందిన కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఇది 5, 7 సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. కేవలం రెగ్యులర్ వేరియంట్లే కాకుండా, బ్లేజ్, ఎబోనీ వంటి ప్రత్యేక ఎడిషన్లను కూడా కంపెనీ తీసుకొచ్చి వినియోగదారుల మన్ననలు పొందింది.

Mahindra Xuv700 Suv 3 Lakh Sales

MX, AX3, AX5, AX7 వంటి వేరియంట్‌లు వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఎన్నుకోవచ్చు. బేసిక్ నుండి లగ్జరీ ఎడిషన్ వరకు ఎంపికలు ఎక్కువగా ఉండటంతో, ప్రతి ఒక్కరికీ సరిపోయే SUVగా మారింది XUV700. ఇది కేవలం డిజైన్, టెక్నాలజీ కోణం నుంచి మాత్రమే కాదు, భద్రత విషయంలోనూ అదే స్థాయిలో నమ్మదగిన వాహనంగా తయారుచేశారు. గ్లోబల్ NCAP ద్వారా అందించిన 5-స్టార్ రేటింగ్‌ దీనికి ఉన్న భద్రతా ప్రమాణాల నిదర్శనం.

పైగా, టాప్ వేరియంట్‌లలో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, సైడ్, కర్టెన్, అలాగే డ్రైవర్ మోకాలి వద్దను కలుపుకుని మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తున్నాయి. దీనితో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్(ESP) ద్వారా కారు స్థిరత్వం మరింత మెరుగవుతుంది. అలాగే, ADAS వలన ప్రయాణం సురక్షితంగానే కాకుండా స్మార్ట్‌గా కూడా మారుతుంది. అంటే, ప్రమాదం సంభవించే అవకాశాలను ముందే గమనించి, డ్రైవర్‌కు హెచ్చరికలు ఇవ్వడం వంటి సౌకర్యాలు ఈ కారులో లభిస్తాయి.

Mahindra Xuv700 Suv

ఇంకా, పవర్ ట్రైన్ విషయానికి వస్తే, ఇది రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఒక వైపు, మరొకవైపు 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్లతో జత చేయబడ్డాయి. కొన్ని ప్రత్యేక వేరియంట్లలో మెరుగైన ట్రాక్షన్ కోసం ఆల్-వీల్ డ్రైవ్ సదుపాయం కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2025, 8:48 [IST]
English summary
Mahindra xuv700 suv cross 3 lakh sales milestone since launch in india
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+