సింగిల్ ఛార్జీతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావొచ్చు.. మహీంద్రా సూపర్ eSUV డెలివరీలు షురూ
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ భారతీయ ఎస్‌యూవీ తయారీదారు మహీంద్రా ఒక ప్రత్యేకమైన మోడల్‌ను పరిచయం చేసింది. హాలీవుడ్ సూపర్ హీరో బ్యాట్‌మ్యాన్ నుండి ప్రేరణ పొంది, వార్నర్ బ్రదర్స్ భాగస్వామ్యంతో తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ డెలివరీలను మహీంద్రా ఇప్పుడు ప్రారంభించింది.
ఈ కారు కేవలం దాని సూపర్ హీరో థీమ్‌తోనే కాకుండా, దాని అద్భుతమైన ఫీచర్లతో కూడా ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ కారును కేవలం 300 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయడం విశేషం. ఇది బ్యాట్‌మ్యాన్ అభిమానులకు, కార్ కలెక్టర్లకు ఒక అరుదైన అవకాశం.

ఈ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను ఇతర కార్ల నుండి వేరు చేసే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారు గోల్డ్ యాక్సెంట్స్‌తో కూడిన శాటిన్ బ్లాక్ (మ్యాట్ బ్లాక్) రంగులో వస్తుంది, ఇది బ్యాట్‌మ్యాన్ థీమ్‌కు సరిగ్గా సరిపోతుంది. కారుపై వెలిగించే BE లోగోలు, ఫెండర్‌లపై, వీల్ క్యాప్‌లపై, రూఫ్ గ్లాస్‌పై బ్యాట్‌మ్యాన్ చిహ్నాలు దీనికి ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.
కారు లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్, ఏసీ వెంట్లు, సీట్లు, స్టార్ట్/స్టాప్ బటన్, పనోరమిక్ రూఫ్ వంటి ప్రదేశాలలో బెస్పోక్ బ్యాట్‌మ్యాన్ లోగోలు ఉంటాయి. గోల్డ్ హైలైట్స్‌తో కూడిన ప్రత్యేక బ్లాక్ సెమి-లెథరెట్ అప్హోల్స్టరీ లగ్జరీ లుక్‌ను అందిస్తుంది. భారతదేశంలోని వినియోగదారుల కోసం కేవలం 300 కార్లు మాత్రమే తయారు చేసింది కంపెనీ.

ప్రతి కారుకు ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఇచ్చింది. దీంతో కొనుగోలుదారులు అత్యంత అరుదైన ఎడిషన్ సొంతం చేసుకోనున్నారు. ఇది అభిమానులకు ఒక కచ్చితంగా గొప్ప కలెక్టర్ ఐటమ్. మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌లో టాప్-ప్యాక్డ్ ఫెసిలిటీలు, సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యుయల్ 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌లు లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి.
హర్మాన్ కార్డాన్ 16-స్పీకర్ సెటప్ అద్భుతమైన ఆడియో ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. పనోరమిక్-గ్లాస్ రూఫ్ క్యాబిన్‌కు విశాలమైన అనుభూతిని ఇవ్వగా, డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌లు సౌకర్యాన్ని పెంచుతాయి. సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఈ కారు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) లెవెల్ 2 సూట్‌తో వస్తుంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ముందస్తు సేఫ్టీ టెక్నాలజీ ఉన్నాయి.

కొత్త బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారు రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేయబడింది. ఆగస్టు 23 నుండి దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారు శక్తివంతమైన పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 682 కిలోమీటర్ల (మైలేజ్) అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 285 bhp పవర్, 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ మార్కెట్లో MG విండ్సర్ EV, MG ZS EV, హ్యుందాయ్ క్రెటా EV, టాటా కర్వ్ EV, టాటా హారియర్ EV వంటి కార్లకు బలమైన పోటీనిస్తుంది. మహీంద్రా కొత్త eSUV ఆర్కిటెక్చర్‌లో రూపొందించబడిన ఈ కారు దాని సూపర్ హీరో థీమ్‌తో పాటు ప్రీమియం ఫీచర్లు, ఉన్నత భద్రతా రేటింగ్‌లతో అటు స్వదేశీ, ఇటు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటూ ప్రజాదరణ పొందింది.


Click it and Unblock the Notifications








