మార్కెట్లో మహీంద్రా ఈవీల దండయాత్ర.. 7 నెలల్లో 30 వేల యూనిట్లు.. టాటా, టెస్లాకు గట్టి సవాల్ !

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాల్లో మహీంద్రా (Mahindra) సంస్థ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కేవలం ఏడు నెలల డెలివరీ పీరియడ్‌లోనే బీఈ 6 (BE 6), ఎక్స్‌ఈవీ 9ఈ (XEV 9e) అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను కలిపి ఏకంగా 30 వేల యూనిట్లకు పైగా విక్రయించి మహీంద్రా చరిత్ర సృష్టించింది.

అత్యుత్తమ డ్రైవింగ్ రేంజ్ (Driving Range), అడ్వాన్సుడ్ టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కార్లు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంస్థ టెక్నాలజీలో టెస్లా (Tesla) వంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Mahindra s Electric Cars Create Global Buzz BE 6 and XEV 9e Achieve 30 000 Sales in 7 Months

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. మార్చి నెలలో డెలివరీ ప్రారంభించిన మహీంద్రా BE 6, మహీంద్రా XEV 9e అనే రెండు ప్రధాన మోడల్స్ భారీ విజయాన్ని నమోదు చేశాయి.

కేవలం ఏడు నెలల స్వల్ప కాలంలోనే ఈ రెండు మోడల్స్ కలిపి 30,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించాయి. ఈ గణనీయమైన విక్రయాలు, ఈ కార్లకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణను స్పష్టం చేస్తున్నాయి.

Mahindra s Electric Cars Create Global Buzz BE 6 and XEV 9e Achieve 30 000 Sales in 7 Months

మహీంద్రా BE 6, XEV 9e రెండూ ఒకే రకమైన బ్యాటరీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడ్డాయి. రెండూ అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లలో 59 kWh, 79 kWh కెపాసిటీ కలిగిన రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ కారు 59 kWh బ్యాటరీతో 557 కిలోమీటర్ల వరకు, 79 kWh బ్యాటరీతో ఏకంగా 683 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను (Driving Range) అందిస్తుంది. మహీంద్రా XEV 9e కారులో రేంజ్ కొంచెం తక్కువగా 542 కి.మీ (59 kWh), 656 కి.మీ (79 kWh) వరకు ఉంది. ఇవి మహీంద్రా సంస్థ అధికారికంగా ప్రకటించిన రేంజ్ గణాంకాలు.

Mahindra s Electric Cars Create Global Buzz BE 6 and XEV 9e Achieve 30 000 Sales in 7 Months

సేఫ్టీ కోసం ఈ కార్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు అందించారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఈవీ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహీంద్రా XEV 9S అనే మోడల్‌పై వినియోగదారుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మహీంద్రా XEV 9S అనేది కంపెనీ నుంచి రాబోతున్న మొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. మూడు వరుసల సీటింగ్ అరేంజ్‌మెంట్‌తో ఈ కారు ఫ్యామిలీ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు నవంబర్ 27న అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.22 లక్షల వద్ద ఉండవచ్చు, కాగా టాప్ వేరియంట్ ధర రూ.35 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. క్రమక్రమంగా మహీంద్రా కంపెనీ మార్కెట్లో తన పట్టును పెంచుకుంటుంది. వచ్చే రెండు మూడేళ్లలో చాలా ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2025, 7:16 [IST]
English summary
Mahindras electric cars create global buzz be 6 and xev 9e achieve 30 000 sales in 7 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+