ఈ నెలలో కొత్త మోడల్ కార్ల రంగ ప్రవేశం.. చలికాలంలోనూ మార్కెట్లో పెరగనున్న హీటు
భారత ఆటోమొబైల్ మార్కెట్‌కు 2024 తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయింది. ఇక 2025 కొత్త ఏడాది పేజ్ ఓపెన్ అయిపోయింది. గతేడాదిలానే ఈ సంవత్సరంలోనూ అనేక వాహన తయారీ సంస్థలు తమ జోరు కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాయి. లేటు చేయకుండా ఈ జనవరి నెలలో తమ కొత్త మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో దిగ్గజ కార్ల సంస్థలు టాటా, మహీంద్రా, బెంజ్, కియా, ఎంజీ మోటార్ వంటి సంస్థలు ఉన్నాయి. రానున్న ఈ కార్లలో ఫ్యూయల్ పవర్డ్ కార్లు మొదులుకుని ఈవీల వరకు అన్నీ ఉన్నాయి. ఏయే సంస్థలు, ఏయే కార్లతో కస్టమర్స్ ముందుకు రానున్నాయో ఇప్పుడు చూద్దాం.
గట్టి ప్లాన్‌తో మెర్సిడిస్: లగ్జరీ కార్లకు పెట్టింది పేరు మెర్సిడిస్ బెంజ్. ప్రతి కారు ప్రేమికుడు ఒక్కసారైనా విహరించాలనుకునే బ్రాండ్. ఈ బ్రాండ్ నుంచి కొత్త కారు వస్తోందంటే చాలు.. పోటీ సంస్థలు కలవరపడుతాయి. ఇప్పుడు మరోసారి తన కొత్త మోడల్‌తో మార్కెట్లో హీటు పెంచేందుకు సిద్ధమవుతోంది మెర్సిడిస్ సంస్థ.

జనవరి 9న తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric Suv) మోడల్ అయిన ఈక్యూఎస్ ఎస్‌యూవీ 450ని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కారు... 122 KWh బ్యాటరీ ప్యాక్ తో రెండు ఎలక్ట్రిక్ మోటార్స్‌తో రానుంది. ఇందులో ఐదుగురు వరకు ప్రయాణించొచ్చు.
హ్యాందాయ్ మరింత హుందాగా: హ్యాందాయ్ సంస్థ తన కొత్త మోడల్ అయిన క్రెటా ఈవీని ఈ నెలలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో (జనవరి 17 నుంచి జనవరి 22 మధ్య ఇది జరగనుంది)లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది 60 kWh బ్యాటరీ ప్యాక్, 500 కి.మీ ల రేంజ్‌తో రానుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ కారు ఉంటుంది.

కేక్ పెట్టించేలా కియా: దిగ్గజ వాహన తయారీ సంస్థ కియా కొంత గ్యాప్ తర్వాత మరో కొత్త మోడల్‌తో మార్కెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. సైరస్ ఎస్‌యూవీ మోడల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో లో లాంఛ్ చేయనుంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ,1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రానుంది. ఈ కారు.. 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ యూనిట్‌తో అందుబాటులో ఉండనుంది.
టాటా నుంచి మరోటి: పాపులర్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఎంతగానో ఎదురు చూస్తున్న SUV coupe Curve ను కొత్త డిజైన్‌తో స్పెషల్ ఎడిషన్స్ కింద తీసకురానుంది. దీనికి సంబంధించి డార్క్ ఎడిషన్, ఈవీ, ఐసీఈ వెర్షన్లను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఈ కార్లు కొత్త ఫీచర్లతో కస్టమర్స్ కోసం అందుబాటులోకి రానున్నాయి.

తగ్గేదేలే అంటున్న ఎంజీ మోటర్: ఎంజీ సంస్థ తన కొత్త మోడల్ సైబర్ స్టర్, ఎంజీ హాలో మోడల్‌గా భారత్‌లో 2025లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇది రూ. 60 లక్షల నుంచి రూ.70 లక్షల ధరలో అందుబాటులో ఉండనుంది. ఈ కారు 77kWh బ్యాటరీ ప్యాక్ తో, 510 కిలోమీటర్ల రేంజ్‌తో రానుంది.
దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుది 510 BH పవర్ 725 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3.2 సెకన్లలో ఇది ఏకంగా 100 కి.మీల వేగం అందుకోగలదు. కొత్త ఏడాదిలో రాబోతున్న ఈ కార్లు అన్ని కూడా అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. ఇవే కాకుండా జనవరి 17 నుంచి 22, 2025 మధ్య జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో మరిన్ని మోడళ్లు లాంచ్ కాబోతున్నాయి.


Click it and Unblock the Notifications








