ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి.. లుక్‌తో కట్టి పడేస్తుంది.. కంపెనీ కూడా ధర పెంచేసింది! .
మారుతి సుజుకి సంస్థ మిడిల్ క్లాస్ ఫ్యామీలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీ చాలా తక్కువ ధరలో ప్రీమియ ఫీచర్లతో కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ లిస్ట్‌లో ఉన్న మొట్టమొదటి కారుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)ని చెప్పవచ్చు. ఈ కారుకి ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇది బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, బ్రెజా ఎస్‌యూవీ మధ్యలో ఉండే కారుగా ఉంటుంది. ఈ కారుని జనాలు సైతం అంతే మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి డిజైన్ స్టైలింగ్, సరసమైన ధరలతో ఈ కారు మరింత పవర్‌ఫుల్‌గా ఉంది.
ఈ కారు ఇటీవలె సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇది లాంచ్ అయిన మొదటి 10 నెలల్లోనే లక్ష అమ్మకాలతో సరికొత్త రికార్డుని తిరగరాసింది. ఈ ఫ్రాంక్స్ మారుతి సుుజుకి నుంచి అత్యంత వేగవంతంగా ఈ అమ్మకాలను రాబట్టిన మోడల్‌గా రికార్డు సృష్టించింది. శరవేగంగా లాభాలను తెచ్చిపెడుతున్న ఈ మారుతి సుజుకి కారు ధరను ఆ కంపెనీ స్వల్పంగా పెంచింది.

ఈ నెల నుంచే ఈ మోడల్ ధరల పెంపు జరిగింది. ఇప్పుడు మీరు ఈ ఫ్రాంక్స్ డెల్టా 1.2 ఏజీఎస్, డెల్టా ప్లస్ 1.2 ఏజీఎస్, డెల్టా ప్లస్ (ఓ) 1.2 ఏజీఎస్ వంటి ఎంపిక చేసిన వేరియంట్ల ధరలు దాదాపు రూ.5,500 వరకు పెంచింది. ఇది కాకుండా ఈ కారు ఇతర వేరియంట్ల ధరలు సైతం రూ .500 పెరిగాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి ఫ్రాంక్స్ సవరించిన ఎక్స్-షోరూమ్ ధర రూ .7.52 లక్షల నుంచి రూ .13.04 లక్షల మధ్య ఉన్నాయి. ధరల సవరణ మినహా ఈ కూపే-స్టైల్ ఎస్‌యూవీలో మరే ఇతర మార్పులను చేయలేదు. ఈ ఫ్రాంక్స్ 10 కలర్ ఆప్షన్లలో ఆరు వేరియంట్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ కారుని రెండు ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

ఇది 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు కలవు. ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 88 bhp వద్ద 113 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.0-లీటర్ టర్బో-బూస్టర్జెట్ ఇంజిన్ 99 bhp వద్ద 147.6 nm గరిష్ట టార్క్‌ని అందిస్తుంది.
ఈ కారుని సీఎన్‌జీ వెర్షన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్రాంక్స్ సీఎన్‌జీ వేరియంట్ లీటరుకు 28.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్లా ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీల కెమెరా, హెడ్స్ అప్‌డిస్ ప్లే వంటి ఫీచర్లు కలవు.

వీటితో పాటు ఇంజిన్ స్టార్ట్ స్టాప్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇక దీని డిజైన్‌లో ఫ్రంట్ గ్రిల్, LED DRLs, ఎల్ఈడీ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్, రఫ్ స్టైల్‌ని అందించే చంకీ బాడీ క్లాడింగ్ వంటివి కలవు. ఇందులో 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలవు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








