దేశంలోనే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే కారు! పేద-మిడిల్‌క్లాస్‌కు దేవుడు.. 47 లక్షల ఇళ్లకు చేరిన ఆనందం
మారుతి ఆల్టో (Maruti Alto) భారత కుటుంబాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చిన్న కారు. ఇండియాలో కారు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఇదే. ఎందుకంటే ఇది కేవలం ఒక కార్ కాదు... లక్షల్లో మధ్యతరగతి, పేద కుటుంబాల కలలు నెరవేర్చిన ఫ్యామిలీ మెంబర్ లాంటిది. తక్కువ బడ్జెట్‌లో, నమ్మకమైన క్వాలిటీతో, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడంతో ప్రతి ఇంటి ముందూ ఒక ఆల్టో కనపడటానికి ఇదే కారణం. తండ్రి మొదటిసారి తన కుటుంబాన్ని కారులో తీసుకెళ్లే ఆనందం నుంచి, స్కూల్‌కు వెళ్లే చిన్నారుల నవ్వుల దాకా ఈ కార్ ఎన్నో ఇండియన్ మెమరీలు సృష్టించింది. అందుకే ఆల్టోకు ఇంత భారీ క్రేజ్ సాధారణం కాదు... ఇది భారత రోడ్లపై తిరిగే ఒక భావోద్వేగం.
ఇప్పుడు కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక సందర్భం వచ్చేసింది. ఎందుకంటే ఆల్టో విడుదలై ఇప్పటికే 25 ఏళ్లు పూర్తయ్యాయి. క్వార్టర్ సెంచరీ అయినా, ఈ కార్ క్రేజ్ ఒక్కరోజు కూడా తగ్గలేదు. కొత్త మోడళ్లు వచ్చినా, మార్కెట్లో పోటీ పెరిగినా, ఈ చిన్న కార్‌కు డిమాండ్ అలాగే కొనసాగుతోంది. అంతేగాక, కంపెనీ ప్రకటించిన మరో అద్భుతమైన విషయం, ఇప్పటివరకు 47 లక్షల మంది మారుతి ఆల్టోను కొనుగోలు చేశారు.

అంటే ప్రతి కొద్ది కిలోమీటర్లకు ఒక ఆల్టో కనిపించడం ఆశ్చర్యం కాదు. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటని చెప్పటం సరైంది కాదు... ఇది అత్యంత ప్రేమించబడిన కారు అని చెప్పాలి. ఒకప్పుడు తక్కువ ధరలో మంచి కారు వస్తుందా? అని అనుకున్న ప్రజలకు ఆల్టోనే సమాధానం అయింది. రోజువారీ ప్రయాణాలకు పర్ఫెక్ట్, హైవేపై కూడా మినీ కంపానియన్, పార్కింగ్‌లో హాయిగా సెట్ అవుతుంది.
దీనికి ముందు కూడా కంపెనీ సేన్, మారుతి 800 వంటి మోడళ్లను విడుదల చేసింది. ఆ రెండు కార్లు ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందాయి, రోడ్లపై కొత్త ట్రెండ్‌ని సృష్టించాయి కూడా. కానీ కొన్ని సంవత్సరాలకే వాటి క్రేజ్ తగ్గిపోయింది. తరువాత సెన్, 800 అమ్మకాలు క్రమంగా పడిపోయాయి. ఇదే సమయంలో ఆల్టో మాత్రం పూర్తి భిన్నంగా ప్రయాణం ప్రారంభించింది. తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్‌తో సేల్స్‌ను బాగా పెంచుకుంది.

2010 వరకూ మార్కెట్‌లో ఆల్టో 800 మాత్రమే ఉండేది. ఈ సమయంలోనే మరింత పవర్, మంచి పనితీరు కావాలని కస్టమర్ డిమాండ్ పెరిగింది. దీనిని గుర్తించిన మారుతి, 800సీసీ ఇంజిన్‌కు బదులుగా శక్తివంతమైన 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌ను తీసుకువచ్చి ఆల్టో K10ను లాంచ్ చేసింది. కొత్త ఇంజిన్, స్మూత్ డ్రైవ్, మెరుగైన పవర్ అన్నీ కలిసి ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి.
ఆల్టో K10 చిన్న కారు అయినప్పటికీ, పనితీరులో మాత్రం పెద్ద కార్లకి ఏమాత్రం తీసిపోని పవర్‌ను అందిస్తుంది. ప్రస్తుతం మారుతి ఇందులో పెట్టిన 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఈ సెగ్మెంట్‌కి నిజంగా వరం. ఈ ఇంజన్ 67.6 bhp హార్స్‌పవర్‌ను, 91 Nm పీక్ టార్క్‌ను పంపుతుంది. సిటీలో రద్దీ రోడ్లపై అయినా, హైవేపై ఓపెన్ రోడ్లపై అయినా ఈ పవర్‌ట్రెయిన్ స్పందన చురుకుగా ఉంటుంది.

దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇదే 1-లీటర్ ఇంజన్‌కు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది.పెట్రోల్, CNG డ్యూయల్ ఫ్యూయల్ వెర్షన్. CNG మోడ్‌లో ఇది 55.92 bhp హార్స్‌పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. మైలేజీ విషయంలో ఆల్టో K10 తన క్లాస్‌లో నిలకడగా టాప్‌లో ఉంటుంది. వేరియంట్‌ను బట్టి 24 కి.మీ/లీటర్ నుండి 34 కి.మీ/కిలో వరకూ మైలేజీ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








