లక్షల మంది కొనే మారుతి కారులో ఇంతేనా సేఫ్టీ ? క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ నిజం చెప్పేశాయ్

మనదేశంలో కార్ల గురించి మాట్లాడగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి. దేశంలో అత్యధికంగా కార్లు అమ్ముడయ్యే నంబర్ వన్ కంపెనీ ఇది. ఈ స్థానానికి చేరుకోవడంలో చాలా మారుతి కార్లు సహాయపడ్డాయి. అందులో ఈ మధ్యకాలంలో బాగా సేల్ అవుతున్న కార్లలో బాలెనో ఒకటి. మిగతా తక్కువ ధర మారుతి కార్ల కన్నా బాలేనో ధర కాస్త ఎక్కువైనా చాలా మంది దీన్ని పోటీపడి మరీ కొంటున్నారు.

ప్రతి నెలా సగటున 10 వేల నుంచి 15 వేల బలేనో కార్లు ఈజీగా సేల్ అవుతున్నాయి. ఇంతగా భారత ప్రజల మనసు గెలుచుకున్న బాలెనోకు, భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో (Bharat NCAP Crash Test) పూర్తి మార్కులు రాకపోవడం కొంచెం షాకింగ్‎గా ఉంది. అసలు బాలేనోకు ఎన్ని స్టార్ రేటింగ్ వచ్చింది? దాని సేఫ్టీ ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.

Maruti Baleno

మారుతి సుజుకి భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కార్లను సేల్ చేసే నంబర్ వన్ కార్ కంపెనీ. మారుతి సుజుకి ఈ స్థాయికి చేరుకోవడంలో గతంలో చాలా మారుతి కార్లు సహాయపడ్డాయి. ఆ విధంగా ఇటీవల బాగా సేల్ అవుతున్న మారుతి సుజుకి కార్లలో బాలెనో(Baleno) ఒకటి.

ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల ప్రాణాలను బాలెనో ఎంతవరకు కాపాడుతుంది ? అని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులు వివిధ గ్రూపుల ద్వారా నిర్వహిస్తున్నారు. యూరోపియన్ ఎన్‌సీఏపీ, ఆసియన్ ఎన్‌సీఏపీ, ఆస్ట్రేలియన్ ఎన్‌సీఏపీ వంటి అనేక గ్రూపులు తమ ఖండాలలో సేల్ అవుతున్న కార్లను టెస్ట్ చేసి మార్కులు ఇస్తున్నాయి.

Maruti Baleno

ఇవి కాకుండా, గ్లోబల్ ఎన్‌సీఏపీ కూడా ఉంది. ఈ విధంగా భారతదేశం కోసం ప్రత్యేకమైన ఒక ఎన్‌సీఏపీ ఉండాలనే ఉద్దేశ్యంతో 2023లో భారత ప్రభుత్వం ప్రారంభించిందే భారత్ ఎన్‌సీఏపీ. 2023 చివరిలో ప్రారంభమైనప్పటి నుంచి భారత మార్కెట్‌లో పాపులర్ అయిన అనేక కార్లు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో పాల్గొన్నాయి.

ఆ జాబితాలో రెండు మారుతి సుజుకి కార్లు ఇటీవల భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ నిర్వహించారు. ఇప్పుడు వాటి టెస్ట్ రిజల్ట్స్ బయటకొచ్చాయి. ఈ వార్తలో ఈ కారుకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుందాం.

Maruti Baleno

భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ప్రస్తుతం సేల్ అవుతున్న బాలెనో కారుకు 5కి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. పెద్దల సేఫ్టీలో ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకు 5కి 4 స్టార్స్ వచ్చాయి. కానీ, పిల్లల సేఫ్టీలో బాలెనోకు కేవలం 3 స్టార్స్ మాత్రమే వచ్చాయి. అయితే, పెద్దల సేఫ్టీ రేటింగ్‌ను ముఖ్యంగా చూస్తారు కాబట్టి, బాలెనోను 4-స్టార్ రేటింగ్ కారుగా ప్రకటించారు.

బాలెనో కారు వేరియంట్లను బట్టి.. దానికి వచ్చిన మార్కులు కొంచెం మారుతాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో ఖరీదైన జెటా, ఆల్ఫా వేరియంట్లు పెద్దలకు ఎక్కువ సేఫ్టీని అందించేవిగా గుర్తించారు. ఈ ఖరీదైన టాప్ వేరియంట్లు పెద్దల సేఫ్టీలో 32కు 26.52 మార్కులు పొందాయి.

Maruti Baleno

అదే, బాలెనో కారు తక్కువ ధర ఉన్న సిగ్మా, డెల్టా వేరియంట్లకు పెద్దల సేఫ్టీలో 32కు 24.04 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ తేడాకు ముఖ్యమైన కారణం బాలెనో టాప్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కానీ, తక్కువ ధర వేరియంట్లలో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉంటాయి. పిల్లల సేఫ్టీలో బాలెనో కారులోని అన్ని వేరియంట్లు ఒకే విధంగా 49కి 34.81 మార్కులు పొందాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: దేశంలో ప్రతి వీధిలో బాలెనో కారును చూడొచ్చు. అన్నంతగా ప్రజల్లో పాపులర్ అయిన మారుతి సుజుకి బాలెనో కారు సేల్స్ ఇప్పుడు బయటకొచ్చిన భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ రిజల్ట్స్‌తో తగ్గుతాయా అని వేచి చూడాలి. 4-స్టార్ రేటింగ్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బాలెనోకు వచ్చిన మంచి రేటింగ్. బాలెనో కస్టమర్లు ఈ సేఫ్టీ రిజల్ట్స్‌ను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

More from DriveSpark

Article Published On: Thursday, June 12, 2025, 10:58 [IST]
English summary
Maruti baleno gets 4 star rating in bharat ncap disappointing child safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+