మార్కెట్లో మారుతి బెస్ట్ హైబ్రిడ్ కార్ ఇదే.. ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఫీచర్లు, అధిక మైలేజ్ మిస్ కావొద్దు

ఇండియాలో మారుతి కార్లకు ఉన్న డిమాండ్ మరే కంపెనీ కార్లకు ఉండదు. ప్రతి నెల వేల సంఖ్యలో కార్లు అమ్ముడవుతుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈవీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కమ్రంలోనే మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఇ విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇ విటారా బుకింగ్ ప్రారంభమైంది. రూ.25వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి ఇ విటారా కారును బుక్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒక కాంపాక్ట్ SUV. ఇది అత్యుత్తమ హైబ్రిడ్ కారు కూడా. మారుతి సుజుకి ఈ కారును టయోటా కంపెనీతో కలిసి అభివృద్ధి చేసింది. దాని బేసిక్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు గ్రాండ్ విటారాలో ఆటో చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. దీని వల్ల ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా విటారా నిలిచింది.

Maruti Grand Vitara Offers

విటారా ఫీచర్ల విషయానికి వస్తే.. గ్రాండ్ విటారా ఆల్ వీల్ డ్రైవ్ ఆఫ్షన్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేని అందించే 9 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యానిమేషన్‌లతో కారుకు సంబంధించిన అన్ని సమాచారాలను అందిస్తుంది. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.

కొన్ని ప్రీమియం ఫీచర్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ కు పరిమితం చేశారు. అవి, 7 ఇంచుల డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ క్లియర్ గ్రాఫిక్స్‌తో ఫుల్ సమాచారాన్ని అందిస్తుంది. హెడ్స్-అప్ డిస్ప్లే బ్యాటరీ ఇన్ఫర్మేషన్, నావిగేషన్‌ను కూడా చూపుతుంది. వెంటిలేటెడ్ ముందు సీట్లు కూడా అందిస్తున్నారు. గ్రాండ్ విటారా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్‌లను సాధించిన బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. గ్రాండ్ విటారా కూడా కనీసం 4 స్టార్లను పొందుతుంది.

Maruti Grand Vitara

ఇందులో ప్రయాణిస్తున్న వారి సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌తో వస్తుంది. ఇంజిన్ల విషయానికి వస్తే, గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆఫ్షన్లతో వస్తుంది.

Take a Poll

మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 103.06 PS పవర్, 136.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, మాన్యువల్‌తో సుజుకి ఆల్ గ్రిప్ AWD సిస్టమ్ కూడా కొనుగోలు చేయవచ్చు. గ్రాండ్ విటారా 17 వేరియంట్లలో లభిస్తుంది. గ్రాండ్ విటారా బేస్ మోడల్ సిగ్మా, టాప్ మోడల్ మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ CVT DT. ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లో గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.

Maruti Grand Vitara Side

మరొకటి కొత్త స్ట్రాంగ్-హైబ్రిడ్, ఇది 1.5-లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 115.56 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్‌లో లీటరుకు 21.11కి.మీ, ఆటోమేటిక్‌లో 20.58కి.మీ, AWD మాన్యువల్‌లో 19.38 కి.మీ మైలేజీని ఇస్తుంది. మారుతి గ్రాండ్ విటారా ధర రూ. 11.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 20.09 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 16:30 [IST]
English summary
Maruti best hybrid car grand vitara offers amazing features and high mileage at an affordable price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+